Entertainment
oi-Jakki Mahesh
భారతీయ
సినీ
పరిశ్రమలో
విషాదం
నెలకొంది.
దక్షిణాదిలో
ప్రసిద్ధి
చెందిన
నిర్మాణ
సంస్థ
‘ఏవీఎం
ప్రొడక్షన్స్’
అధినేత,
సీనియర్
నిర్మాత
ఏవీఎం
శరవణన్
(85)
ఈ
లోకాన్ని
విడిచి
వెళ్లిపోయారు.
సుదీర్ఘ
సినీ
ప్రయాణంలో
లెక్కకు
మించిన
సూపర్
హిట్
చిత్రాలను
అందించిన
ఆయన
మృతి
పట్ల
పలువురు
సినీ
ప్రముఖులు,
అభిమానులు
తీవ్ర
సంతాపం
వ్యక్తం
చేస్తున్నారు.
బహుభాషా
నిర్మాత
ఏవీఎం
శరవణన్
కేవలం
తమిళ
సినీ
పరిశ్రమకే
పరిమితం
కాలేదు.
ఆయన
నిర్మాతగా
వ్యవహరించిన
చిత్రాలు
తమిళంతో
పాటు
తెలుగు,
మలయాళం,
కన్నడ,
మరియు
హిందీ
భాషల్లో
ప్రేక్షకులను
అలరించాయి.
5
దశాబ్దాలకు
పైగా
సినీ
రంగంలో
పనిచేసిన
ఆయన
తన
కెరీర్‌లో
300కు
పైగా
చిత్రాలకు
నిర్మాణ
బాధ్యతలు
వహించారు.
తెలుగులో
ఆయన
ఎన్నో
ప్రముఖ
చిత్రాలను
నిర్మించి
ప్రేక్షకులకు
వినోదాన్ని
పంచారు.
తెలుగులో
ఆయన
లీడర్,
ఆ
ఒక్కటీ
అడక్కు,
సంసారం
ఒక
చదరంగం
వంటి
అద్భుత
చిత్రాలను
నిర్వించారు.
తెలుగు
ప్రేక్షకులకు
ఎంతో
పరిచయమున్న
ఈ
సినిమాలు
బాక్సాఫీస్
వద్ద
విజయం
సాధించాయి.
ప్రత్యేకించి
‘లీడర్’
చిత్రం
ఆయన
నిర్మాణ
విలువలకు
నిదర్శనంగా
నిలిచింది.
ఏవీఎం
ప్రొడక్షన్స్
వారసత్వం
ఏవీఎం
శరవణన్
తండ్రి
అయిన
ఏవీ
మెయప్పన్
1945లోనే
‘ఏవీఎం
ప్రొడక్షన్స్’
బ్యానర్‌ను
స్థాపించారు.
భారతీయ
సినిమా
చరిత్రలోనే
అత్యంత
పురాతనమైన,
ప్రతిష్టాత్మకమైన
నిర్మాణ
సంస్థలలో
ఇది
ఒకటి.
ఈ
సంస్థలో
ఎంజీఆర్,
శివాజీ
గణేశన్
వంటి
దిగ్గజాలతో
పాటు,
రజనీకాంత్,
కమల్
హాసన్
వంటి
సూపర్
స్టార్లతో
కూడా
సినిమాలు
నిర్మించబడ్డాయి.
తండ్రి
ఏవీ
మెయప్పన్
తర్వాత
ఏవీఎం
శరవణన్
ఈ
నిర్మాణ
సంస్థ
బాధ్యతలను
స్వీకరించి
దాని
కీర్తిని
దశదిశలా
వ్యాపింపజేశారు.
ఆయన
ఆధ్వర్యంలోనే
ఏవీఎం
ప్రొడక్షన్స్
అత్యధిక
విజయాలను
నమోదు
చేసింది.
సినీ
నిర్మాణ
వారసత్వాన్ని
కొనసాగిస్తూ,
శరవణన్
కుమారుడు
ఎమ్ఎస్
గుహాన్
కూడా
నిర్మాతగా
రాణిస్తున్నారు.
ఏవీఎం
శరవణన్
మృతి
సినీ
పరిశ్రమకు
తీర్చలేని
లోటు.
ఆయన
అందించిన
చిత్రాలు,
పాటలు,
నిర్మాణ
విలువలు
ఎప్పటికీ
సినీ
చరిత్రలో
నిలిచిపోతాయి.


