సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్‌ బహిరంగ లేఖ.. ఈసారైనా..

Date:


Telangana

oi-Bomma Shivakumar

రాబోయే బడ్జెట్‌ లో హామీల అమలుకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సగం పదవీకాలం పూర్తి కావస్తున్నా హామీలు ఇంకా నెరవేర్చడంలో విఫలం అయ్యారని దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బడ్జెట్‌ లోనైనా నిధులు కేటాయించాలని.. లేదంటే ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ బహిరంగలేఖ రాశారు. ఈ సారైన బడ్జెట్‌ లో కేటాయింపులు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తెలంగాణ సమాజం ఇంకా ఓపికపట్టే ప్రసక్తే లేదని గుర్తుచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సగం కాలం పూర్తయినా ఇప్పటికీ హామీల్లో 95 శాతం పెండింగ్‌ లోనే ఉన్నాయని మండిపడ్డారు. 6 గ్యారెంటీల పేర్లు చెప్పి అధికారంలోకి వచ్చి.. ఆ తర్వాత వాటి అమలను పక్కన పెట్టారని దుయ్యబట్టారు.

ఈ నేపథ్యంలో 2026-27 బడ్జెట్‌ లో అయినా మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, యువత, రైతుల కోసం ఇచ్చిన హామీల మేరకు భారీగా నిధులు కేటాయించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 6 గ్యారంటీలకు చట్టబద్ధత తీసుకువస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం దాన్ని నిలబెట్టుకోవాలన్నారు. ఈసారి కూడా హామీల అమలకు నిధులు కేటాయించకుంటే మోసకారి కాంగ్రెస్‌ ను ప్రజల పక్షాన నిలదీస్తామని హెచ్చరించారు.

” డిక్లరేషన్ల పేరుతో హామీలు ఇచ్చిన మేరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాలి. ఆయా వర్గాలకి రెండు సంవత్సరాలుగా ఎగగొట్టిన హామీలను.. కాంగ్రెస్ ఇస్తామని చెప్పిన నిధుల బకాయిలకు ఈ బడ్జెట్లో కేటాయింపులు చేయాలి. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత తీసుకువస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం దాన్ని నిలబెట్టుకోవాలి. ఈసారి కూడా హామీల అమలకు నిధులు కేటాయించకుంటే ప్రజల తరఫున ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తాం. 2026 – 2027 బడ్జెట్‌లో 6 గ్యారెంటీలు, 420 హామీలు, డిక్లరేషన్ల కింద ఇచ్చిన వాగ్దానాల అమలుకు తగిన నిధులు కేటాయించకపోతే, ఎక్కడికక్కడ మోసకారి కాంగ్రెస్ ను ప్రజల పక్షాన నిలదీస్తాం” అని కేటీఆర్ సీఎంకు రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

An automated moderation error left Tumblr users panicked

Tumblr users were left scrambling on Wednesday after dozens...

‘KPop Demon Hunters’ on Tour? Why a HUNTR/X Run Could Be Complicated

Reports are swirling that Netflix may take its breakout...

Kerala Assembly Elections 2026: Manjeswaram set for another photo finish as key players line up

Manjeswaram, one of Kerala’s most closely watched Assembly constituencies...

ChatGPT’s ads have the industry excited, but insiders are frustrated

When OpenAI first announced it was rolling out ads...