సీఎం రేవంత్ రెడ్డితో టాటా గ్రూప్ చైర్మన్ భేటీ

Date:


Telangana

oi-Bomma Shivakumar

దావోస్
లో
జరుగుతున్న
ప్రపంచ
ఆర్థిక
వేదిక
సదస్సులో
టాటా
గ్రూప్
చైర్మన్
ఎన్.
చంద్రశేఖరన్‌
తో
ముఖ్యమంత్రి
రేవంత్
రెడ్డి
భేటీ
అయ్యారు.

సందర్బంగా
ముఖ్యమంత్రి
రేవంత్
రెడ్డి
తెలంగాణ
రైజింగ్
విజన్-
2047,
ప్రభుత్వ
విధానాలు,
రాష్ట్రంలో
ఉన్న
పారిశ్రామిక
అనుకూల
వాతావరణాన్ని
టాటా
చైర్మన్‌
కు
వివరించారు.

తెలంగాణ
రాష్ట్రం
రూపొందించిన
దీర్ఘకాలిక
అభివృద్ధి
ప్రణాళికలను
వివరించారు.
భవిష్యత్
అవసరాలకు
ప్రణాళికాబద్ధమైన
ఆలోచన
విధానంపై
టాటా
ఛైర్మన్
చంద్రశేఖరన్
ప్రశంసించారు.
పెట్టుబడుల
కోసం
కాకుండా,
విధానాలు,
ఫ్యూచర్
విజన్‌
ను
ప్రపంచానికి
పరిచయం
చేయడమే
లక్ష్యంగా
తెలంగాణ
ముందుకెళ్తోందని
ఆయన
అభినందించారు.
హైదరాబాద్‌
లోని
ప్రధాన
క్రీడా
మైదానాలను
ప్రపంచ
స్థాయి
ప్రమాణాలతో
తీర్చిదిద్దే
ఆలోచనలను
ముఖ్యమంత్రి
టాటా
గ్రూప్
చైర్మన్
తో
పంచుకున్నారు.

స్పోర్ట్స్
స్టేడియం
అభివృద్ధి
లో
భాగస్వామ్యం
పంచుకునేందుకు,
ప్రభుత్వం
తో
కలిసి
పని
చేసేందుకు
సిద్ధంగా
ఉన్నట్లు
చంద్రశేఖరన్
తెలిపారు.
దేశంలో
ప్రతిభ
ఉన్నా..
దానికి
తగిన
మౌలిక
సదుపాయాలు
అవసరమని
ఆయన
అభిప్రాయపడ్డారు.
యువత
నైపుణ్యాల
అభివృద్ధిపై
కూడా
చర్చించారు.
65
ప్రభుత్వ
ఐటీఐలను
ఆధునిక
సాంకేతిక
కేంద్రాలుగా
మార్చడంలో
టాటా
టెక్నాలజీస్‌
తో
కలిసి
పనిచేస్తున్నామని
సీఎం
తెలిపారు.
ప్రభుత్వ
పాలిటెక్నిక్
కాలేజీలను
స్కిల్
సెంటర్లుగా
అభివృద్ధి
చేసే
ప్రణాళికలను
వివరించారు.
యంగ్
ఇండియా
స్కిల్
యూనివర్సిటీని
ఆనంద్
మహీంద్రా
ఆధ్వర్యంలో
ఏర్పాటు
చేసిన
విషయాన్ని
గుర్తు
చేశారు.

2036
ఒలింపిక్స్
లో
భారత్
పతకాలు
సాధించేలా
క్రీడా
మౌలిక
సదుపాయాల
అభివృద్ధి
లక్ష్యాలను
వివరించారు.
హైదరాబాద్
లో
చేపడుతున్న
మూసీ
నది
పునరుజ్జీవన
ప్రాజెక్టుపై
టాటా
ఛైర్మన్
ఆసక్తి
చూపారు.
రాజస్థాన్,
మహారాష్ట్రలో
నీటి
వనరుల
పునరుద్ధరణలో
టాటా
గ్రూప్
అనుభవాన్ని
గుర్తుచేస్తూ,
మూసీ
అభివృద్ధిలో
భాగస్వామిగా
పనిచేయడానికి
సిద్ధంగా
ఉన్నట్లు
తెలిపారు.
మూసీ
నది
చుట్టూ
ఆర్థిక
కార్యకలాపాలు
పెరిగేలా
ప్రణాళికలు
రూపొందిస్తున్నామని
ముఖ్యమంత్రి
చెప్పారు.

మరోవైపు
రాష్ట్రంలో
హోటళ్లు,
రిసార్టులు
ఏర్పాటు
చేసే
అంశంపై

సమావేశం
లో
చర్చలు
జరిగాయి.
మేడారం,
వేములవాడ,
భద్రాచలం
వంటి
ఆలయ
ప్రాంతాల్లో
హోటళ్ల
ఏర్పాటుకు
టాటా
గ్రూప్
ఆసక్తి
చూపింది.
శ్రీశైలం
రహదారి
వెంబడి
అంతర్జాతీయ
స్థాయి
రిసార్ట్
ఏర్పాటుపై
సానుకూలంగా
స్పందించింది.
ఏఐ
డేటా
సెంటర్లు,
సెమీ
కండక్టర్,
ఈవీ
తయారీ
రంగాల్లో
తెలంగాణలో
కొత్త
పరిశ్రమలు
నెలకొల్పే
అవకాశాలపై
టాటా
చైర్మన్
ఆసక్తి
ప్రదర్శించారు.
ఇక

సమావేశంలో
మంత్రి
శ్రీధర్
బాబు,
మంత్రి
పొంగులేటి
శ్రీనివాస
రెడ్డితోపాటు
ఇతర
ఉన్నతాధికారులు
పాల్గొన్నారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related