సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే!

Date:


Telangana

oi-Jakki Mahesh

తెలంగాణ రాష్ట్ర సర్కారు అధికారికంగా నిర్వహించిన ఉగాది వేడుకలలో భాగంగా జరిగిన పంచాంగ శ్రవణం విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉగాది సందర్భంగా ప్రముఖ సిద్ధాంతి బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి సీఎం రేవంత్ రెడ్డి జాతకంతో పాటు రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి చిత్తా నక్షత్రం, తులా రాశిలో జన్మించారని సిద్ధాంతి పేర్కొన్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి జాతకంలో పంచమాధిపతి, అష్టమాధిపతి అయిన బుధుడు భాగ్యస్థానంలో ఉండటం వల్ల ఆయనకు అద్భుతమైన యోగం పట్టిందని వివరించారు. ఈ ఏడాది బుధ దశ ప్రారంభం కాబోతుండటం వల్ల రేవంత్ రెడ్డికి అన్ని రంగాల్లోనూ సానుకూల ఫలితాలు వస్తాయని.. ఆయన అధికారం మరింత బలపడుతుందని తెలిపారు.

గ్రహాల స్థితి, ప్రభావం
రేవంత్ రెడ్డి కుంభ లగ్నంలో జన్మించినందున ఆయనకు బలం పెరిగిందని సిద్ధాంతి వివరించారు. అయితే లగ్నంలో రాహువు ప్రభావం కొంతమేరకు ఉన్నప్పటికీ.. ఆరో స్థానంలో శని ఉండటం వల్ల శత్రువులపై విజయం సాధించే అవకాశం ఉందని పేర్కొన్నారు. శని గోచార రీత్యా అనుకూలంగా ఉన్నందున ప్రత్యర్థుల ఎత్తుగడలను రేవంత్ రెడ్డి సమర్థవంతంగా తిప్పికొడతారని భవిష్యవాణి వినిపించారు.

జాగ్రత్తలు, విజయసూత్రాలు
ముఖ్యమంత్రి ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సిద్ధాంతి సూచించారు. నిద్ర పోకుండా, నిరంతరం అప్రమత్తతతో ఉంటేనే విజయం అద్భుతంగా ఉంటుందని పేర్కొన్నారు. భాగ్య స్థానంలో గురువు ఉండటం రేవంత్ రెడ్డికి దైవ బలాన్ని ఇస్తుందని.. ఇది రాష్ట్ర అభివృద్ధికి కూడా తోడ్పడుతుందని వివరించారు. రాశి చక్రం ప్రకారం రేవంత్ రెడ్డికి ఉన్న యోగం వల్ల ఈ ఏడాది ఆయనకు తిరుగులేదని స్పష్టం చేశారు.

రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్తు
“రాజు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది” అనే నానుడిని సిద్ధాంతి బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి జాతక బలం వల్ల రాష్ట్ర మంత్రివర్గం, ప్రజలు కూడా క్షేమంగా ఉంటారని ఆకాంక్షించారు. ఈ ఏడాది తులా రాశి వారికి ఏ రకమైన ఆటంకాలు లేవని.. రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని భరోసా ఇచ్చారు. ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమం సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.





Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related