India
oi-Chandrasekhar Rao
దేశవ్యాప్తంగా
సంచలనం
రేపిన
ఢిల్లీ
అల్లర్ల
వెనుక
ఉన్న
భారీ
కుట్ర
కేసులో
అరెస్ట్
అయిన
విద్యార్థి
సంఘాల
నాయకులు
ఉమర్
ఖలీద్,
షర్జీల్
ఇమామ్‌కు
భారీ
షాక్
తగిలింది.
వారికి
బెయిల్
మంజూరు
చేయడానికి
సుప్రీంకోర్టు
నిరాకరించింది.
ఆ
అర్హత
వీరికి
లేదని
బెంచ్
వ్యాఖ్యానించింది.
ఇదే
కేసులో
ఆరోపణలను
ఎదుర్కొంటోన్న
మరో
అయిదుమంది
నిందితులకు
షరతులతో
కూడిన
బెయిల్
లభించింది.
బెయిల్
పొందినవారిలో
గుల్ఫిషా
ఫాతిమా,
మీరన్
హైదర్,
షిఫా
ఉర్
రెహ్మాన్,
మహమ్మద్
సలీం
ఖాన్,
షాదాబ్
అహ్మద్
ఉన్నారు.
ఢిల్లీలో
2020
ఫిబ్రవరిలో
చోటుచేసుకున్న
అల్లర్ల
కేసుకు
సంబంధించిన
విచారణ
ఇది.
పౌరసత్వ
సవరణ
చట్టం,
ఎన్ఆర్సీకి
వ్యతిరేకంగా
జరిగిన
నిరసనల
మధ్య
చెలరేగిన
అప్పటి
అల్లర్లలో
53
మంది
మరణించగా,
700
మందికి
పైగా
గాయపడ్డారు.
నిందితులను
అప్పట్లో
పోలీసులు
యూఏపీఏ
కింద
అరెస్ట్
చేశారు.
పలు
దఫాలుగా
బెయిల్
ప్రయత్నాలు
సాగించారు.
ఢిల్లీ
హైకోర్టు
బెయిల్
నిరాకరించడాన్ని
సుప్రీంకోర్టులో
సవాల్
చేశారు.
నిందితులు
దాఖలు
చేసిన
ఈ
బెయిల్
పిటీషన్లపై
ఇదివరకే
జస్టిస్
అరవింద్
కుమార్,
జస్టిస్
ఎన్
వీ
అంజారియాతో
కూడిన
ఇద్దరు
న్యాయమూర్తుల
సుప్రీంకోర్టు
విచారణను
ముగించింది.
డిసెంబర్
10వ
తేదీన
తీర్పును
రిజర్వ్
చేసింది.
తాజాగా
తుది
తీర్పు
వినిసించింది.
ఈ
కేసులో
నిందితులు
అయిదేళ్లకు
పైగా
అండర్‌ట్రైల్‌గా
జైలులో
ఉన్నారని
పిటీషనర్ల
తరఫు
అడ్వొకేట్
వాదించారు.
ఈ
వాదనలతో
బెంచ్
ఏకీభవించలేదు.
విచారణ
ప్రారంభానికి
ముందే
నిందితులను
దీర్ఘకాలం
పాటు
జైలులో
ఉంచడం
కంటే
జాతీయ
భద్రత,
ప్రజా
శాంతిభద్రతలను
పరిగణనలోకి
తీసుకోవడం
ముఖ్యమని
బెంచ్
స్పష్టం
చేసింది.
మిగిలిన
అయిదుమంది
నిందితులు
గుల్ఫిషా
ఫాతిమా,
మీరాన్
హైదర్,
షిఫా
ఉర్
రెహమాన్,
మహమ్మద్
సలీం
ఖాన్,
షాదాబ్
అహ్మద్‌లపై
విచారణ
కొనసాగించడం
అవసరం
లేదని
ధర్మాసనం
పేర్కొంది.
వారికి
బెయిల్
మంజూరు
చేసింది.
ఉమర్
ఖలీద్,
షర్జీల్
ఇమామ్
మినహా
మిగిలిన
వారంతా
ఇప్పుడు
జైలు
నుంచి
విడుదల
కానున్నారు.
ప్రతి
నిందితుడి
బెయిల్
పిటిషన్‌ను
కూడా
నిర్దుష్టంగా
పరిశీలించడం
అవసరమని
బెంచ్
వ్యాఖ్యానించింది.
ఈ
దశలో
ప్రాసిక్యూషన్
సమర్పించిన
సాక్ష్యాలను
పరిగణనలోకి
తీసుకున్న
తర్వాతే
బెయిల్
పై
తుది
తీర్పు
ఇచ్చామని
పేర్కొంది.
అల్లర్ల
కుట్ర
ఆరోపణల్లో
ఉమర్
ఖలీద్,
షర్జీల్
ఇమామ్
కీలక,
ప్రాథమిక
పాత్రను
ప్రాసిక్యూషన్
సమర్పించిన
సాక్ష్యాలు
సూచిస్తున్నాయని
ధర్మాసనం
సంతృప్తి
వ్యక్తం
చేసింది.


