India
-Bomma Shivakumar
కేంద్ర
హోం
మంత్రిత్వ
శాఖ
దేశవ్యాప్తంగా
సైబర్
మోసగాళ్లపై
ఉక్కుపాదం
మోపుతోంది.
ముఖ్యంగా
“డిజిటల్
అరెస్ట్”
పేరుతో
వృద్ధులను
లక్ష్యంగా
చేసుకుని
పెరుగుతున్న
మోసాలపై
ప్రత్యేక
దృష్టి
సారించింది.
దేశంలోని
పలు
ప్రధాన
నగరాల్లో
ఈ
తరహా
మోసాల్లో
వృద్ధులు
భారీగా
ఆర్థికంగా
నష్టపోతున్నారు.
ఇది
కోట్లాది
రూపాయలకు
చేరుతోంది.
అధికారుల
వివరాల
ప్రకారం..
మోసగాళ్లు
దిల్లీ
పోలీసు,
సీబీఐ,
ట్రాయ్
వంటి
ప్రభుత్వ
సంస్థల
అధికారులమని
నటిస్తున్నారు.
వీడియో
కాల్స్,
నకిలీ
యూనిఫాంలు,
నిజమైన
అధికారి
నేపథ్యాలను
ఉపయోగించి
బాధితులలో
భయాందోళనలు
సృష్టిస్తున్నారు.
అనంతరం
బాధితులను
ఒంటరిగా
ఉండిపోయేలా
బలవంతం
చేస్తున్నారు.
ఇలా
ఒంటరిగా
చేసిన
తర్వాత,
వారి
కష్టపడి
సంపాదించిన
డబ్బును
తమ
నియంత్రణలో
ఉన్న
ఖాతాలకు
బదిలీ
చేయమని
బలవంతం
చేస్తున్నారు.
ఈ
ఖాతాలు
ఆర్‌బీఐ
లేదా
ఇతర
చట్టబద్ధమైన
ఏజెన్సీలకు
సంబంధించినవని
తప్పుగా
పేర్కొంటున్నారు.
ఇలా
బాధితుల
నుంచి
డబ్బు
కొల్లగొడుతున్నారు.
ఈ
“డిజిటల్
అరెస్ట్”
కేసులను
వ్యవస్థీకృత
ఆర్థిక
నేరాలుగా
పరిగణించాలని
హోం
మంత్రిత్వ
శాఖ
రాష్ట్ర
పోలీసు,
సైబర్
క్రైమ్
యూనిట్లను
ఆదేశించింది.
ఇలాంటి
కేసులపై
దర్యాప్తును
వేగవంతం
చేయాలని,
మోసగాళ్లు
తరలించిన
డబ్బును
ట్రాస్
చేసే
ప్రయత్నాలను
ముమ్మరం
చేయాలని
సూచించింది.
ఇటువంటి
మోసాల్లో
ఒకటి
గ్వాలియర్
లో
నమోదైంది.
అక్కడ
75
ఏళ్ల
రిటైర్డ్
ప్రభుత్వ
అధికారి
దాదాపు
ఒక
నెల
పాటు
నకిలీ
డిజిటల్
అరెస్ట్
లో
ఉండి
రూ.
1.12
కోట్ల
రూపాయలు
మోసపోయారు.
మొదట,
అతని
ఆధార్-
లింక్డ్
మొబైల్
నంబర్
బ్లాక్
చేస్తామని
హెచ్చరించారు.
అనంతరం,
అతను
మనీ
లాండరింగ్
కేసులో
విచారణలో
ఉన్నాడని
మోసగాళ్లు
తెలిపారు.
సీనియర్
పోలీసు,
సీబీఐ
అధికారులుగా
నటిస్తూ,
ఆ
అధికారిని
మ్యూచువల్
ఫండ్
పెట్టుబడులను
నగదుగా
మార్చి,
“ధృవీకరణ”
పేరుతో
నిధులను
బదిలీ
చేయమని
ఒప్పించారు.
ఈ
విధంగా
ఆయన్ని
మోసం
చేశారు.
ఇదే
తరహాలో,
దక్షిణ
దిల్లీలో
ఒక
పెద్ద
మోసం
వెలుగులోకి
వచ్చింది.
ఇక్కడ
వృద్ధ
డాక్టర్
దంపతులను
రెండు
వారాలకు
పైగా
వారి
ఇంటికే
పరిమితం
చేసి,
దాదాపు
రూ.
15
కోట్ల
రూపాయలు
బదిలీ
చేయమని
మోసగాళ్లు
బలవంతం
చేశారు.
ఈ
కేసులో
నష్టపోయిన
మొత్తం
భారీగా
ఉంది.
ట్రాయ్,
పోలీసు
అధికారులుగా
నటిస్తూ,
ఆ
దంపతులు
నల్లధనం
లావాదేవీలతో
సంబంధం
కలిగి
ఉన్నారని
మోసగాళ్లు
ఆరోపించారు.
స్థానిక
పోలీసు
స్టేషన్
లో
ఈ
మోసం
బయటపడే
వరకు
నిరంతరం
వీడియో
కాల్స్,
చట్టపరమైన
బెదిరింపులు,
నకిలీ
పత్రాలతో
ఒత్తిడి
చేసి,
డబ్బు
దోచుకున్నారు.
ఎలాంటి
చట్ట
అమలు
సంస్థలూ
ఫోన్
కాల్స్
లేదా
వీడియో
కాల్స్
ద్వారా
పౌరులను
ప్రశ్నించవని,
విచారణ
కోసం
డబ్బు
బదిలీలను
కోరవని
హోం
మంత్రిత్వ
శాఖ
హెచ్చరించింది.
ప్రభుత్వ
ఏజెన్సీలు
వాట్సాప్
ద్వారా
విచారణలు
చేయవని,
ఆర్టీజీఎస్
(RTGS)
లేదా
ఇలాంటి
మార్గాల
ద్వారా
ఆర్థిక
ధృవీకరణను
డిమాండ్
చేయవని
సంబంధిత
అధికారులు
స్పష్టం
చేశారు.
ఐ4సీ-
ఎంహెచ్ఏ
(I4C-MHA)
బ్యాంక్‌లను
అప్రమత్తంగా
ఉండాలని,
ముఖ్యంగా
వృద్ధుల
సేవింగ్స్
ఖాతాల
నుండి
పెద్ద
మొత్తంలో
ఆర్టీజీఎస్
బదిలీలు
సరైన
ధృవీకరణ
తర్వాత
మాత్రమే
జరుగుతున్నాయో
లేదో
నిర్ధారించుకోవాలని
ఆదేశించింది.
పౌరులు
అలాంటి
కాల్స్
ను
స్థానిక
పోలీసులతో
ధృవీకరించుకోవాలని,
వ్యక్తిగత
లేదా
బ్యాంకింగ్
వివరాలను
పంచుకోవద్దని,
అనుమానాస్పద
కమ్యూనికేషన్
ను
వెంటనే
www.cybercrime.gov.in
లోని
జాతీయ
సైబర్
క్రైమ్
విభాగానికి
నివేదించాలని
కోరింది.
ఈ
మోసపూరిత
నెట్
వర్క్‌లను
ఛేదించడానికి,
మరిన్ని
కేసులు
జరగకుండా
నిరోధించడానికి
బ్యాంకులు,
టెలికాం
సంస్థలు,
సైబర్
క్రైమ్
యూనిట్
లతో
సమన్వయాన్ని
పెంచామని
కేంద్ర
హోం
మంత్రిత్వ
శాఖ
వెల్లడించింది.
దీని
ద్వారా
సైబర్
నేరగాళ్లకు
అడ్డుకట్ట
వేయాలని
లక్ష్యంగా
పెట్టుకుంది.


