International
oi-Bomma Shivakumar
అమెరికాకు
చెందిన
హవాయి
ద్వీపంలోని
కిలోవేయ
అగ్నిపర్వతం
మరోసారి
బద్ధలైంది.
1500
అడుగుల
మేర
లావా
ఎగిసిపడుతోంది.
అగ్ని
పర్వతం
నుంచి
లావా
పెద్ద
ఎత్తున
ఉబికి
బయటకు
వస్తోంది.
హవాయిలోని
అత్యంత
క్రియాశీలకమైన
ఈ
అగ్నిపర్వతం
బద్ధలు
కావడం
ఇది
40
వ
సారి.
జనవరి
12
న
ఈ
అగ్నిపర్వతం
బద్ధలైనట్లు
అధికారులు
పేర్కొన్నారు.
పరిస్థితిని
ఎప్పటికప్పుడు
పర్యవేక్షిస్తున్నట్లు
తెలిపారు.
2024
డిసెంబర్
నుంచి
ఇప్పటి
వరకూ
ఈ
అగ్నిపర్వతం
దాదాపు
40
సార్లు
విస్పోటనం
చెందినట్లు
స్పష్టం
అవుతోంది.
అమెరికాకు
చెందిన
హవాయి
ద్వీపంలో
ప్రపంచంలోనే
అత్యంత
క్రియాశీలక
అగ్నిపర్వతాల్లో
ఒకటైన
కిలోవేయ
తాజాగా
మరోసారి
బద్ధలైంది.
ఈ
అగ్నిపర్వతం
బద్దలు
కావడంతో
దాదాపు
15
వందల
అడుగుల
ఎత్తు
వరకూ
లావా
ఎగిసి
పడుతోంది.
లావా
నుంచి
ఉబికి
వస్తున్న
నిప్పు
కణికలు
20
వేల
అడుగుల
వరకూ
విస్పోటనం
చెందుతున్నాయి.
జనవరి
12
న
దాదాపు
10
గంటల
పాటు
ఈ
విస్పోటనం
చెందినట్లు
అధికారులు
తెలిపారు.
అగ్నిపర్వతం
నుంచి
స్మాగ్,
గ్యాస్
బయటకు
వస్తున్నట్లు
తెలిపారు.
పరిస్థితిని
ఎప్పటికప్పుడు
పర్యవేక్షిస్తున్నట్లు
వివరించారు.
🚨Profilo:Kīlauea
volcano
erupts
in
Episode
40—sustained
lava
fountains
soar
over
660
feet
at
the
summit,
tephra
blankets
crater
rims,
and
a
gas
plume
rises
more
than
13,000
feet
above
Hawaii.@USGSVolcanoes
@Hawaii_EMA
pic.twitter.com/knQIkm58yA—
Kingsley
Chukwuka
(@profilopolitics)
January
13,
2026
హవాయిలోని
కిలోవేయ
అగ్నిపర్వతం
గతేడాది
నుంచి
క్రమం
తప్పకుండా
విస్పోటనం
చెందుతున్నట్లు
యూఎస్
జియోలాజికల్
సర్వే
ధ్రువీకరించింది.
ప్రస్తుతం
ఈ
లావా
విస్పోటనానికి
సంబంధించిన
దృశ్యాలు
సామాజిక
మాధ్యమాల్లో
వైరల్
అవుతున్నాయి.
ఇందుకు
సంబంధించిన
వీడియోని
యూఎస్
జియోలాజికల్
సర్వే
సోషల్
మీడియాలో
పోస్టు
చేసింది.
దాదాపు
10
గంటల
పాటు
అగ్నిపర్వతం
నుంచి
లావా
ఉబికి
వచ్చినట్లు
అధికారులు
పేర్కొన్నారు.
అగ్నిపర్వతం
బద్ధలైనప్పుడు
వచ్చే
గ్యాస్..
వాతావరణంలో
కలిసి
శ్వాసకోశ
ఇబ్బందులతో
పాటుగా
ఇతర
అనారోగ్య
సమస్యలకు
కారణం
అయ్యే
ప్రమాదం
ఉన్నట్లు
అధికారులు
అంచనా
వేస్తున్నారు.
గతేడాది
డిసెంబర్
లోనూ
కిలోవేయ
అగ్నిపర్వతం
బద్ధలైంది.
దాదాపు
వంద
అడుగుల
ఎత్తు
వరకు
లావా
ఎగిసిపడింది.
అగ్నిపర్వతం
నుంచి
పెద్ద
ఎత్తున
లావా
ఉబికి
వచ్చింది.


