Science Technology
oi-Chandrasekhar Rao
భారత
అంతరిక్ష
ప్రయోగ
సంస్థ..
ఇస్రో
ఈ
ఏడాది
తొలి
మిషన్
ప్రారంభించబోతోంది.
పోలార్
శాటిలైట్
లాంచింగ్
వెహికల్
సీ62
ప్రయోగానికి
ఏర్పాట్లు
చేపట్టింది.
ఈ
నెల
12వ
తేదీన
ఉదయం
10:17
నిమిషాలకు
తిరుపతి
జిల్లా
శ్రీహరికోటలోని
సతీష్
ధావన్
స్పేస్
సెంటర్
లోని
మొదటి
లాంచ్
ప్యాడ్
నుండి
ఈ
రాకెట్
నింగిలోకి
దూసుకెళ్లనుంది.
స్పేస్
వర్క్‌హార్స్
గా
పేరుగాంచిన
పీఎస్ఎల్
వీ
సిరీస్‌లో
ఇది
64వ
ప్రయోగం
కావడం
ప్రాధాన్యతను
సంతరించుకుంది.
ఈ
మిషన్
ప్రధాన
పేలోడ్
ఈఓఎస్-
ఎన్1.
పర్యావరణ
పర్యవేక్షణకు
ఉద్దేశించిన
అత్యాధునిక
హైపర్‌స్పెక్ట్రల్
ఎర్త్
అబ్జర్వేషన్
శాటిలైట్
ఇది.
హైపర్‌స్పెక్ట్రల్
ఇమేజింగ్
ద్వారా
విస్తృత
తరంగదైర్ఘ్యాలలో
డేటాను
సేకరిస్తుంది.
వృక్షసంపద,
నీటి
నాణ్యత,
భూ
వాతావరణం-
ఉపరితల
మార్పులను
ఎప్పటికప్పుడు
సేకరిస్తుంది.
ఈ
డేటాను
విశ్లేషిస్తుంది.
దేశ
వైపరీత్యాల
నిర్వహణ,
వ్యవసాయం,
వనరుల
మ్యాపింగ్‌కు
గణనీయమైన
ఊతం
ఇస్తుందీ
మిషన్.
ఈఓఎస్-
ఎన్1
తో
పాటు
వివిధ
అంతర్జాతీయ
భాగస్వామ్య
సంస్థలకు
చెందిన
18
చిన్న
ఉపగ్రహాలు
కూడా
ఈ
పీఎస్ఎల్వీ
మిషన్
ద్వారా
నింగిలోకి
వెళ్లనున్నాయి.
భారత
అంతరిక్ష
పరిశోధనలపై
ఆయా
దేశాలు
పెట్టుకున్న
విశ్వసనీయతకు
ఇది
అద్దం
పట్టినట్టయింది.
63
ప్రయోగాలలో
90
శాతానికి
పైగా
సక్సెస్
రేట్
ను
సాధించింది
పీఎస్ఎల్వీ.
అంతర్జాతీయ
అంతరిక్ష
రంగంలో
తన
స్థానాన్ని
సుస్థిరం
చేసుకుంది.
పీఎస్ఎల్వీ-సీ62
కోర్-అలోన్
కాన్ఫిగరేషన్‌లో
ప్రయాణిస్తుంది.
ఉపగ్రహాలను
తక్కువ
భూ
కక్ష్యలోకి
(low
Earth
orbit)
విజయవంతంగా
ప్రవేశపెట్టేలా
దీన్నిఆప్టిమైజ్
చేశారు.
భూ
ఉపరితలం
నుంచి
సుమారు
650
కిలో
మీటర్ల
ఎత్తులో
సన్
సింక్రనైజ్డ్
ఆర్బిట్
లో
ఇది
పనిచేస్తుంది.
ఈ
అద్భుత
ప్రయోగాన్ని
ప్రత్యక్షంగా
చూడటానికి
ఇస్రో
అవకాశం
కల్పించింది.
శ్రీహరికోట
సతీష్
ధావన్
స్పేస్
సెంటర్
లోని
లాంచ్
వ్యూ
గ్యాలరీ
నుండి
వీక్షించడానికి
రిజిస్ట్రేషన్లు
మొదలయ్యాయి.
ఆసక్తి
గల
వారు
ఆన్‌లైన్
ద్వారా
తమ
పేర్లను
నమోదు
చేసుకోవచ్చు.
దీనికోసం
ఆధార్
లేదా
ప్రభుత్వం
జారీ
చేసిన
గుర్తింపు
కార్డు,
మొబైల్
నంబర్,
ఇమెయిల్
తప్పనిసరి.


