Telangana
oi-Bomma Shivakumar
హైదరాబాద్
పోలీస్
వార్షిక
నివేదికను
హైదరాబాద్
పోలీస్
కమిషనర్
సీపీ
సజ్జనార్
విడుదల
చేశారు.
హైదరాబాద్
సిటీ
పోలీస్
వార్షిక
నివేదిక-2025
ను
డిజిటల్
పద్ధతిలో
ఆవిష్కరించారు.
ఎకో-
ఫ్రెండ్లీ
విధానంలో,
ప్రజలందరికీ
సులభంగా
అందుబాటులో
ఉండేలా
ఈ
నివేదికను
రూపొందించినట్లు
సీపీ
సజ్జనార్
పేర్కొన్నారు.
ఈ
రిపోర్టు
ప్రకారం
హైదరాబాద్
లో
నేరాలు
15
శాతం
తగ్గాయని..
అలాగే
మహిళలపై
నేరాలు
6
శాతం
పెరిగాయని
సజ్జనార్
స్పష్టం
చేశారు.
హైదరాబాద్
నగరంలో
నేరాలు
15
శాతం
తగ్గినట్లు
పోలీస్
కమిషనర్
సీపీ
సజ్జనార్
తెలిపారు.
మహిళలపై
నేరాలు
6
శాతం
పెరిగినట్లు
స్పష్టం
చేశారు.
405
అత్యాచారం,
119
కిడ్నాప్
కేసులు
నమోదైనట్లు
వివరించారు.
తెలంగాణలోకి
ఇతర
రాష్ట్రాల
నుంచి
గ్యాంగ్
లు
రావాలంటే
భయపడుతున్నాయని
సీపీ
సజ్జనార్
అన్నారు.
అలాగే
నగరంలో
ఎక్కడ
దొంగతనం
జరిగినా
పట్టుకుంటారనే
భయం
దొంగల్లో
ఏర్పడిందని..
ఈ
మేరకు
566
మంది
సైబర్
నేరగాళ్లను
అరెస్ట్
చేసినట్లు
హైదరాబాద్
సిటీ
పోలీస్
వార్షిక
నివేదిక-2025లో
వెల్లడించారు.
అంతేకాక
సోషల్
మీడియాలో
సైబర్
క్రైమ్
పై
అవగాహన
కల్పిస్తున్నట్లు
సీపీ
సజ్జనార్
పేర్కొన్నారు.
ఇక
గతేడాదితో
పోలిస్తే
నగరంలో
వాహన
రద్దీ
పెరిగినప్పటికీ,
పటిష్ట
చర్యలతో
రోడ్డు
ప్రమాదాలను
గణనీయంగా
తగ్గించగలిగామని
సీపీ
సజ్జనార్
స్పష్టం
చేశారు.
హైదరాబాద్
పోలీస్
వార్షిక
నివేదిక-
2025
ప్రకారం..
ట్రాఫిక్
విభాగ
గణాంకాలను
పరిశీలిస్తే
వాహనదారుల
వైఖరిలో
ఆశించిన
మార్పు
కనిపించడం
లేదని
స్పష్టం
అవుతోందన్నారు.
ప్రధానంగా
హెల్మెట్
లేకుండా
వాహనాలు
నడిపిన
కేసులు
41
లక్షలు
దాటడం
ఆందోళనకరంగా
ఉందన్నారు.
ఓవర్
స్పీడ్,
రాంగ్
సైడ్
డ్రైవింగ్,
సెల్‌ఫోన్
మాట్లాడుతూ
వాహనం
నడపడం
వంటి
ఉల్లంఘనలు
భారీగా
పెరిగినట్లు
తెలిపారు.
హెల్మెట్
లేకుండా
వాహనాలు
నడిపిన
కేసులు
41
లక్షలకు
పైగా
ఉండటం,
రాంగ్
సైడ్
డ్రైవింగ్
6
లక్షలకు
పైగా
కేసులు,
ఓవర్
స్పీడ్
డ్రైవింగ్
2
లక్షల
34
వేలు,
ట్రిపుల్
రైడింగ్
లక్షా
75
వేలు,
సిగ్నల్
జంపింగ్
లక్షా
52
వేలకు
పైగా
కేసులు
నమోదైనట్లు
సీపీ
సజ్జనార్..
హైదరాబాద్
పోలీస్
వార్షిక
నివేదిక-
2025
లో
తెలిపారు.


