Telangana
oi-Chandrasekhar Rao
Hitech
Railway
Station:
ఐటీ
హబ్
హైటెక్
సిటీకి
కనెక్టివిటీ
మరింత
మెరుగుపడనుంది.
ఇక్కడి
రైల్వే
స్టేషన్
పునర్నిర్మాణం,
ఆధునికీకరణ
పనులు
చురుగ్గా
సాగుతున్నాయి.
ఇప్పటివరకు
దాదాపుగా
81
శాతం
పనులు
పూర్తయ్యాయి.
వచ్చే
ఏడాదిలో
ఈ
రైల్వే
స్టేషన్
అందుబాటులోకి
రానుంది.
ఈ
పనులు
పూర్తయితే
చర్లపల్లి
తరహాలో
ఇప్పుడున్న
వాటి
కంటే
అదనపు
రైలు
సర్వీసులు
అందుబాటులోకి
వచ్చే
అవకాశాలు
ఉన్నాయి.
సంక్రాంతి
రద్దీ
నేపథ్యంలో
పలు
ఎక్స్
ప్రెస్
రైళ్లకు
హైటెక్
సిటీ
స్టేషన్
లో
హాల్ట్
సౌకర్యం
కల్పించింది
దక్షిణ
మధ్య
రైల్వే.
జనవరి
7
నుండి
20వ
తేదీరకు
14
రోజుల
పాటు
ఆయా
రైళ్లన్నీ
కూడా
ఇక్కడ
ఆగుతాయి.
హైటెక్
సిటీలో
ఆగే
రైళ్లలో..
12749
మచిలీపట్నం-బీదర్
17255
నర్సాపూర్-లింగంపల్లి
12737
కాకినాడ
పోర్ట్-
లింగంపల్లి
12806
లింగంపల్లి-విశాఖపట్నం
12775
కాకినాడ
టౌన్-లింగంపల్లి
(సోమ,
బుధ,
శుక్ర)
17207
సాయినగర్
షిర్డీ-మచిలీపట్నం
(గురు,
సోమ,
బుధ,
శుక్ర)
17205
సాయినగర్
షిర్డీ-కాకినాడ
పోర్ట్,
18519
విశాఖపట్నం-లోకమాన్య
తిలక్
టెర్మినస్
ముంబై
(మంగళవారం)
ఉన్నాయి.
హైటెక్
సిటీ
రైల్వే
స్టేషన్
అభివృద్ధి
పనులూ
చురుగ్గా
సాగుతున్నాయి.
ఇప్పటివరకు
812
శాతం
పనులు
పూర్తయ్యాయి.
స్టేషన్
ఎంట్రీ
ర్యాంప్,
దివ్యాంగుల
సౌకర్యాలు,
ఫుట్
ఓవర్
బ్రిడ్జి
లాంచ్,
ప్లాట్
ఫామ్
షెడ్స్
పూర్తయ్యాయి.
స్టేషన్
భవన
సముదాయం,
ఫుట్
ఓవర్
బ్రిడ్జి,
సర్కులేటింగ్
ఏరియా
నిర్మాణం
సాగుతోంది.
12
మీటర్ల
వెడల్పుతో
ఫుట్
ఓవర్
బ్రిడ్జి
నిర్మితమౌతోంది.
లిఫ్ట్,
ఎస్కలేటర్
సైతం
అందుబాటులోకి
రానుందీ
హైటెక్
సిటీ
రైల్వే
స్టేషన్‌లో.
కాచిగూడ,
సికింద్రాబాద్
తరహాలో
ఎస్కలేటర్
అత్యాధునిక
సాంకేతిక
పరిజ్ఞానంతో
రూపుదిద్దుకోనుంది.
ప్లాట్‌ఫామ్
రీసర్ఫేసింగ్
పనులు
కొనసాగుతున్నట్లు
దక్షిణ
మధ్య
రైల్వే
అధికారులు
వెల్లడించారు.
దీనికి
సంబంధించిన
కొన్ని
ఫొటోలను
విడుదల
చేశారు.
ఈ
స్టేషన్
అందుబాటులోకి
వచ్చిన
తర్వాత
ప్రధాన
టెర్మినల్
గా
మారే
అవకాశాలు
లేకపోలేదు.
రద్దీ
సమయాల్లో
కొన్ని
రైళ్లను
ఇక్కడి
నుంచి
నడిపించవచ్చు.


