“హైడ్రా” పవర్.. రూ.1400 కోట్ల విలువైన భూమి సేఫ్ !

Date:


Telangana

oi-Korivi Jayakumar

హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలపై కొరడా ఝుళిపిస్తూ దూసుకుపోతుంది “హైడ్రా”. చెరువుల పరిరక్షణే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ టీమ్ సూపర్ సక్సెస్ ఫుల్ గా పని చేస్తోంది. ఎక్కడ సమస్య ఉందో అక్కడే ప్రత్యక్షమై, యాక్షన్ మొదలు పెడుతూ ఆక్రమణలకు గురైన భూములకు విముక్తి కలిగిస్తోంది. ఇప్పుడు మరోసారి ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపింది.

ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని.. ఫీల్డ్‌లోకి దిగి తక్షణ చర్యలు చేపడుతోంది. అక్రమ నిర్మాణాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై కఠిన చర్యలు కొనసాగిస్తోంది. చెరువులు, పార్కులు మరియు ప్రజావసరాల భూములను పరిరక్షించడమే లక్ష్యంగా ఏర్పాటైన ఈ బృందం ప్రజల ఫిర్యాదుల ఆధారంగా ఫీల్డ్‌లోకి దిగుతూ తక్షణ చర్యలు చేపడుతోంది. ఎక్కడ సమస్య ఉన్నా అక్కడే స్పందిస్తూ ఆక్రమణలకు గురైన భూములను విముక్తి చేస్తోంది.

కొండాపూర్‌లో భారీ భూముల రక్షణ..

Hyderabad నగరంలోని కొండాపూర్ ప్రాంతంలో సుమారు 7 ఎకరాల పార్కులు మరియు ప్రజావసరాల భూములను హైడ్రా శనివారం రక్షించింది. ఈ భూముల విలువ దాదాపు రూ.1400 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్ గ్రామంలోని సర్వే నంబర్లు 78 నుంచి 93 వరకు 1993లో రాజరాజేశ్వరి నగర్ కాలనీ పేరుతో 2059 ప్లాట్లతో గ్రామపంచాయతీ లేఅవుట్ రూపొందించారు.

ప్రజావసరాల భూములపై ఆక్రమణలు..

లేఅవుట్ ప్రకారం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు 5 ఎకరాలు, పాఠశాలకు దాదాపు 1 ఎకరం, పార్కులకు మరో ఎకరానికి పైగా స్థలం కేటాయించారు. అయితే పాఠశాల కోసం కేటాయించిన భూమిలో సుమారు 1000 గజాల మేర అపార్ట్‌మెంట్ నిర్మాణం జరిగినట్లు గుర్తించారు. అదేవిధంగా కమ్యూనిటీ హాల్ కోసం కేటాయించిన 2181 గజాల స్థలంలో ప్రైవేట్ షాపులు, షెడ్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. పలు షోరూములు, కిరాణా దుకాణాలు మరియు రహదారులు కూడా ఆక్రమణకు గురైనట్లు కాలనీ సంక్షేమ సంఘం ఫిర్యాదు చేసింది.

యూఎల్సీ భూముల్లో ప్లాట్లు ఎల్ఆర్ఎస్ కిందకి వచ్చినప్పటికీ పార్కులు, ప్రజావసరాల భూములు ఆక్రమణదారుల సొంతంగా మారడం ఎలా జరిగిందని స్థానికులు ప్రశ్నించారు. ఈ భూములు ప్రజల అవసరాలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని హైడ్రాను కోరారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి, లేఅవుట్ ప్రకారం అవి పార్కులు మరియు ప్రజావసరాల భూములేనని నిర్ధారించారు.

అనంతరం ఆక్రమణలను తొలగించి భూములకు ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ప్రజావసరాల భూములను తిరిగి రక్షించడంతో రాజరాజేశ్వరి నగర్‌లో నివసిస్తున్న సుమారు 5 వేల కుటుంబాలు సంతోషం వ్యక్తం చేశాయి. దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్య హైడ్రా చర్యలతో పరిష్కారం కావడంతో స్థానికులు హైడ్రా అధికారులను అభినందించారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related