Telangana
oi-Chandrasekhar Rao
ఈ
ఏడాది
అసెంబ్లీ
ఎన్నికలను
ఎదుర్కొనబోతోన్న
కేరళకు
కేంద్ర
ప్రభుత్వం
కొత్తగా
మూడు
వందే
భారత్
స్లీపర్
ఎక్స్
ప్రెస్
రైళ్లను
కేటాయించనుంది.
మూడు
ప్రధాన
మార్గాల్లో
ఇవి
అందుబాటులోకి
రానున్నాయి.
తిరువనంతపురం-చెన్నై,
తిరువనంతపురం-బెంగళూరు,
తిరువనంతపురం-
హైదరాబాద్
మధ్య
ఈ
మూడు
వందే
భారత్
స్లీపర్
రైళ్లు
పరుగులు
పెట్టడం
ఖాయంగా
కనిపిస్తోంది.
ఈ
మూడింటి
వల్ల
ప్రయాణ
సమయం
గరిష్టంగా
మూడున్నర
గంటల
వరకు
ఆదా
అవుతుందని
అంచనా.
దూరాన్ని
దృష్టిలో
పెట్టుకుని
హైదరాబాద్
కు
బదులుగా
తిరువనంతపురం
నుంచి
మంగళూరుకు
నడిపించాలనే
ప్రతిపాదనలు
కూడా
రైల్వే
మంత్రిత్వ
శాఖ
పరిశీలనలో
ఉన్నట్లు
తెలుస్తోంది.
ఈ
మార్గంలో
అధిక
ఆదాయం
ఉన్నందున
ఈ
ప్రతిపాదనలు
రైల్వే
శాఖ
వద్దకు
వచ్చాయి.
దీనిపై
తుది
నిర్ణయాన్ని
తీసుకోవాల్సి
ఉంది.
తిరువనంతపురం
నుండి
చెన్నై,
బెంగళూరు,
హైదరాబాద్
రూట్లల్లో
కొత్త
వందే
భారత్
స్లీపర్
ఎక్స్
ప్రెస్
లను
నడిపించడానికి
రైల్వే
శాఖ
అధిక
ప్రాధాన్యత
ఇస్తోందని
చెబుతున్నారు.
ప్రస్తుతం
నడుస్తున్న
కేరళలో
అందుబాటులో
ఉన్న
రెండు
వందే
భారత్
ఎక్స్‌ప్రెస్
రైళ్ల
ద్వారా
వచ్చే
ఆదాయంలో
తిరువనంతపురం-మంగళూరు
మార్గం
లాభదాయకంగా
ఉంది.
ఈ
ఏడాది
కేరళ,
తమిళనాడు
అసెంబ్లీలకు
ఎన్నికలు
జరుగనున్న
నేపథ్యంలో
ఈ
రాష్ట్రాల
మధ్య
రైలు
కనెక్టివిటీని
మరింత
మెరుగుపర్చాలని
రైల్వే
శాఖ
భావిస్తోంది.
రెండు
రాష్ట్రాలకు
ప్రయోజనం
చేకూర్చేలా
రూట్లను
ఎంపిక
చేసుకుంటోంది.
ఈ
క్రమంలో
త్రిశూర్,
పాలక్కాడ్,
కోయంబత్తూర్,
ఈరోడ్,
సేలం
మీదుగా
రాకపోకలు
సాగించేలా
తిరువనంతపురం-చెన్నై
మధ్య
వందే
భారత్
స్లీపర్
ను
ప్రవేశపెట్టాలని
భావిస్తోంది.
తిరువనంతపురం-
చెన్నై
మధ్య
దూరం
సుమారు
922
కిలోమీటర్లు.
ప్రస్తుతం
అందుబాటులో
ఉన్న
రైలు
ప్రయాణం
ద్వారా
సుమారు
17
గంటల
సమయం
పడుతోంది.
వందే
భారత్
స్లీపర్
ను
ప్రవేశపెడితే
ప్రయాణ
సమయం
మూడు
నుంచి
మూడున్నర
గంటలు
తగ్గుతుందని
రైల్వే
శాఖ
భావిస్తోంది.
కొట్టాయం
మీదుగా
మంగళూరు-తిరువనంతపురం
మధ్య
దూరం
631
కిలోమీటర్లు.
ప్రస్తుత
ప్రయాణ
సమయం
14
గంటలు.
వందే
భారత్
తో
సుమారు
మూడున్నర
గంటలు
ఆదా
అవుతుంది.
తిరువనంతపురం-బెంగళూరు
మార్గం
844
కిలోమీటర్లు.
ప్రస్తుత
ప్రయాణ
సమయం
16
గంటల
వరకు
ఉంటోంది.
వందే
భారత్
స్లీపర్
తో
ఈ
ప్రయాణ
సమయం
మూడు
గంటలు
తగ్గే
అవకాశం
ఉంది.
తిరువనంతపురం-
హైదరాబాద్
మధ్య
ప్రస్తుతం
ఉన్న
రైలు
ప్రయాణం
దాదాపుగా
22
గంటలు
పడుతోంది.
వందే
భారత్
స్లీపర్
ప్రవేశపెడితే
ప్రయాణ
సమయంలో
మూడు
నుంచి
నాలుగు
గంటలు
తగ్గొచ్చు.
తిరువనంతపురం
నుంచి
బయలుదేరే
ఈ
ఎక్స్
ప్రెస్
త్రిశూర్,
పాలక్కాడ్,
కోయంబత్తూర్,
ఈరోడ్,
సేలం,
బెంగళూరు,
అనంతపురం,
కర్నూలు
మీదుగా
ఈ
రైలు
రాకపోకలు
సాగించే
అవకాశం
ఉంది.


