హైదరాబాద్.. రంగారెడ్డి జిల్లాల్లో మార్పులు, చేర్పులు – కొత్తగా ఇలా..!!

Date:


Telangana

oi-Sai Chaitanya

తెలంగాణ
ప్రభుత్వం
మరో
కీలక
నిర్ణయం
తీసుకుంది.
గ్రేటర్
హైదరాబాద్
పునర్విభజన
తరహా
లోనే
రంగారెడ్డి..
హైదరాబాద్
జిల్లాల్లోనూ
మార్పుల
దిశగా
కసరత్తు
చేస్తోంది.
గ్రేటర్
పరిధిలోని

రెండు
జిల్లాల్లో
మార్పులు..
చేర్పులు
చేయనుంది.
గ్రేటర్‌
హైదరాబాద్‌
పరిధి
నాలుగు
పోలీస్‌
కమిషనరేట్లుగా
మార్చిన
నేపథ్యంలో
మూడు
జిల్లాల
పరిధిని
కూడా
మార్చాలని
డిసైడ్
అయింది.

మేరకు
తుది
రూపు
ఇచ్చేందుకు
అధికారులు
ప్రతిపాదనలు
సిద్దం
చేస్తున్నారు.

హైదరాబాద్
ను
పునర్విభజించిన
విధంగానే
గ్రేటర్‌
పరిధిలో
జిల్లాలను
మార్చేందుకు
రాష్ట్ర
ప్రభుత్వం
సన్నాహాలు
చేస్తోంది.
నూతనంగా
ఏర్పాటైన
ఫ్యూచర్‌సిటీ
పోలీస్‌
కమిషనరేట్,
పునర్విభజించిన
హైదరాబాద్,
సైబరాబాద్,
మల్కాజిగిరి
పోలీస్‌
కమిషనరేట్ల
హద్దులు,
జిల్లాల
సరిహద్దులు
ఒకే
విధంగా
ఉండాలని
రాష్ట్ర
ప్రభుత్వం
భావిస్తోంది.
గ్రేటర్
పరిధిలో
మూడు
జిల్లాలు
ఉన్నాయి.
కాగా,
గ్రేటర్‌
హైదరాబాద్‌
పరిధి
నాలుగు
పోలీస్‌
కమిషనరేట్లుగా
మార్చిన
నేపథ్యంలో
మూడు
జిల్లాల
పరిధిని
కూడా
మార్చనుంది.
హైదరాబాద్,
మల్కాజిగిరి
జిల్లాల
బౌండరీలను
మార్చేందుకు
రెవెన్యూశాఖ
ఉన్నతాధికారులు
వివరాలు
సేకరిస్తున్నారని
తెలిసింది.

నూతనంగా
ఏర్పాటైన
ఫ్యూచర్‌సిటీ
కమిషనరేట్‌
పరిధికి
సమానంగా

కొత్త
జిల్లాను
ఏర్పాటు
చేసేందుకు
కసరత్తు
కొనసాగుతోంది.
వీటికి
సంబంధించిన
ముసాయిదా
నోటిఫికేషన్
కొద్ది
రోజుల్లో
విడుదల
చేయనున్నారు.
హైదరాబాద్‌
జిల్లాలో
ప్రస్తుతం
16
మండలాలున్నాయి.
ఇందులో
తిరుమలగిరి,
మారేడ్‌పల్లి
మండలాలను
మల్కాజిగిరి
జిల్లాలోకి
మార్చనున్నట్లుగా
తెలుస్తోంది.
అమీర్‌పేట
మండలంలోని
బేగంపేట
ప్రాంతాన్ని
మల్కాజ్
గిరి
ప్రాంతంలో
భాగం
చేయాలని
నిర్ణయించారు.
హైదరాబాద్‌
జిల్లాల
సరిహద్దు
మండలాలుగా
బండ్లగూడ,
బహదూర్‌పురలు
ప్రస్తుతం
ఉండగా,
ఇకపై
రాజేంద్రనగర్,
శంషాబాద్‌
మండలాలకు
విస్తరించనుంది.
కాగా,
మేడ్చల్‌-మల్కాజిగిరి
జిల్లా
ప్రస్తుతం
సైబరాబాద్,
మల్కాజిగిరి
పోలీస్‌
కమిషనరేట్ల
పరిధిలో
విస్తరించి
ఉంది.
పునర్విభజన
అనంతరం
మల్కాజిగిరి
కమిషనరేట్‌
పరిధి
ఎంతవరకు
ఉందో
జిల్లా
అంతవరకు
విస్తరించనున్నారు.

కాగా,
మేడ్చల్‌-మల్కాజిగిరి
జిల్లాలో
రంగారెడ్డి
జిల్లాలోని
హయత్‌నగర్‌,
సరూర్‌నగర్
మండలాలు
విలీనం
కానున్నాయి.
పునర్విభజన
అనంతరం
మల్కాజిగిరి
లోక్‌సభ
నియోజకవర్గం
పరిధిలోని
ఎల్బీనగర్‌(రంగారెడ్డి
జిల్లా),
కంటోన్మెంట్‌(హైదరాబాద్‌
జిల్లా)
శాసనసభ
నియోజకవర్గాలు
మేడ్చల్‌
జిల్లా
పరిధిలోకి
రానున్నాయి.
మల్కాజిగిరి
పోలీస్‌
కమిషనరేట్‌
పరిధిలో
అబ్దుల్లాపూర్‌
మెట్‌
మండలం
ఉండగా
అది
జీహెచ్‌ఎంసీ
పరిధి
దాటి
ఉండడం
వల్ల

మండలంపై
ఇంకా
నిర్ణయం
తీసుకోలేదు.
రంగారెడ్డి
జిల్లా
పరిధి
విస్తృతంగా
ఉండడం,
జిల్లా
పరిధిలో
పలు
ఐటీ
కంపెనీలు,
పరిశ్రమలు,
గేటెడ్‌
కమ్యూనిటీలుండడం
వల్ల
అర్బన్,
రూరల్‌
జిల్లాలుగా
విభజించనున్నట్లుగా
సమాచారం.
సైబరాబాద్‌
పోలీస్‌
కమిషరేట్‌
పరిధి
మొత్తాన్ని
అర్బన్‌
జిల్లాగా,
ఫ్యూచర్‌సిటీ
కమిషనరేట్‌
పరిధిని
రూరల్‌
జిల్లాగా
విభజించనున్నారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related