హైదరాబాద్ TO థాయ్‌లాండ్ టూర్.. బడ్జెట్ ధరలో.. IRCTC సూపర్ ప్యాకేజీ ..

Date:


Telangana

oi-Bomma Shivakumar

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ట్రావెలింగ్, టూరిజంపై ప్రజలకు ఆసక్తి పెరుగుతోంది. వీకెండ్ లో అలా ఫ్యామిలీతో టూర్ కు వెళ్లడం చేస్తున్నారు. అయితే అలాంటి వారి కోసం ఇండియన్​ రైల్వే క్యాటరింగ్​ అండ్​ టూరిజం కార్పొరేషన్​(IRCTC) స్పెషల్ ప్యాకేజీని తీసుకొచ్చింది. అతి తక్కువ ధరకే టూర్​ ను IRCTC ఆపరేట్​ చేస్తోంది. మరి, ఆ ప్యాకేజీ ఏంటి..? ఏ ప్రదేశాలు చూడొచ్చు..? ధర ఎంత..? ప్రయాణం ఎప్పుడు..? అనే వివరాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

చాలామందికి థాయ్ లాండ్ టూర్ వెళ్లాలని ఆశగా ఉంటుంది. కానీ ఆ టూర్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియవు. వాటి మీద అవగాహన లేకపోవడంతో ప్రయాణాలను విరమించుకుంటారు. అయితే థాయ్ లాండ్ టూర్ టూర్ వెళ్లాలనుకునేవారికి గుడ్ న్యూస్ చెప్పింది ఐఆర్‌సీటీసీ. ఈ మేరకు స్పెషల్ ప్యాకేజీని అందిస్తోంది. ఈ మేరకు హైదరాబాద్ నుంచి బ్యాంకాక్, పట్టాయా టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది ఐఆర్‌సీటీసీ. ఈ టూర్ ప్యాకేజీ వివరాలు ఇలా ఉన్నాయి..

IRCTC టూరిజం ఈ మేరకు ట్రెజర్స్ ఆఫ్ థాయ్ లాండ్ పేరుతో టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ టూర్ లో భాగంగా 4 రాత్రులు, 5 రోజుల టూర్ ప్యాకేజీని అందిస్తోంది. అయితే ఈ టూర్ హైదరాబాద్ నుంచి ఫిబ్రవరి 26న ప్రారంభం అవుతుంది. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా టూరిస్టులు విమాన ప్రయాణం ద్వారా థాయ్ లాండ్, బ్యాంకాక్, పట్టాయా అందాలను ఆస్వాదించొచ్చు.

IRCTC థాయ్ లాండ్ టూర్ లో భాగంగా.. టూరిస్టులు మొదటిరోజు ఉదయం 7.30 గంటలకు హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఫార్మాలిటీస్ పూర్తి చేసిన తర్వాత ఉదయం 11 గంటల 05 నిమిషాలకు హైదరాబాద్ లో విమానం స్టార్ట్ అవుతుంది. అలా సాయంత్రం 4.10 గంటలకు బ్యాంకాక్ ఎయిర్‌పోర్టులో దిగుతారు. అలా రాత్రి బ్యాంకాక్ లోని హోటల్ బస చేయాలి. ఇక రెండో రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ అయిన తర్వాత సఫారీ వరల్డ్, మెరైన్ పార్క్ ను వీక్షించవచ్చు. అక్కడే లంచ్, షాపింగ్ చేసుకోవచ్చు. అలా రాత్రికి బ్యాంకాక్ లో బస చేయాలి.

మూడో రోజు గోల్డెన్ బుద్ధ, మార్బుల్ బుద్ధ ప్రదేశాలను సందర్శించొచ్చు. సాయంత్రం అల్కజార్ షో ఎంజాయ్ చేయొచ్చు. ఇక రాత్రికి ఇండియన్ రెస్టారెంట్‌ లో డిన్నర్ చేశాక రాత్రికి పట్టాయా నగరంలో బస చేయాలి. నాలుగో రోజు ఉదయం కోరల్ ఐలాండ్ టూర్ ఉంటుంది. అక్కడే లంచ్ తర్వాత నాంగ్ నూచ్ ట్రాపికల్ గార్డెన్ ను సందర్శించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అక్కడే ఇండియన్ రెస్టారెంట్ లో డిన్నర్ ఉంటుంది. రాత్రికి పట్టాయాలోని హోటల్‌ లో బస చేయాల్సి ఉంటుంది. ఇక ఐదో రోజు తిరిగి బ్యాంకాక్ బయల్దేరాలి. అలా సాయంత్రం 5.10 గంటలకు బ్యాంకాక్‌ లో విమానం స్టార్ట్ అవుతుంది. రాత్రి 7 గంటల 35 నిమిషాలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

ఇక టికెట్ ధరల విషయానికి వస్తే.. ఐఆర్‌సీటీసీ థాయ్ లాండ్ టూర్ ప్యాకేజీ ధర ఒక్కరికి రూ.53,800 ఉంటుంది. అలాగే డబుల్ షేరింగ్‌ లో అయితే ఒక్కరికి రూ.54,200.. సింగిల్ షేరింగ్ కు రూ. 62,100 చెల్లించాలి. ఈ టూర్ కు సంబంధించిన పూర్తి వివరాల కోసం https://www.irctctourism.com/ వెబ్ సైట్ ను సంప్రదించండి..



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related