150GB డేటా, అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌తో ఎయిర్‌టెల్ ప్లాన్!

Date:


News

oi-Suravarapu Dileep

|

ఎయిర్‌టెల్‌ యూజర్ల పరంగా ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది. ప్రీపెయిడ్‌, పోస్ట్‌పెయిడ్‌ యూజర్ల కోసం అనేక ప్రత్యేక రీఛార్జ్‌ ప్లాన్‌లను కలిగి ఉంది. పోస్ట్‌పెయిడ్‌లో ఇప్పటికే అనేక ప్లా్న్‌లు ఉన్నాయి. ప్రస్తుతం రూ.999 ధరకు ఫ్యామిలీ ప్లా్న్‌ను (Airtel Rs999 Recharge Plan) అందిస్తోంది. ఇందులో కాలింగ్, డేటా, SMS ప్రయోజనాలను అందిస్తోంది.

ఎయిర్‌టెల్‌ రూ.999 పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్‌ మూడు సిమ్‌ కార్డులను సపోర్టు చేస్తుంది. కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లు లేదా వ్యక్తిగత, ఆఫీస్‌ నంబర్ల కోసం ఈ ప్లాన్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో భారీ డేటాతోపాటు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సదుపాయాన్ని అందిస్తోంది.

మూడు సిమ్‌ కార్డులు :
ఎయిర్‌టెల్‌ రూ.999 పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్‌ లో భాగంగా మూడు సిమ్‌ కార్డులను వినియోగించుకోవచ్చు. ఈ మూడు కనెక్షన్‌లు కూడా అన్‌లిమిటెడ్‌ కాలింగ్, రోజువారీ 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. మరియు 150GB డేటాను అందిస్తోంది. ప్రైమరీ యూజర్‌ 90GB డేటాను వినియోగించుకోవచ్చు. మిగిలిన ఇద్దరు యూజర్లు 30GB డేటా చొప్పున పొందుతారు.

ఈ పోస్ట్‌పెయిడ్‌ ఫ్యామిలీ ప్లాన్‌ లో భాగంగా కాలింగ్, డేటా, SMS ప్లాన్‌లతోపాటు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లను అందిస్తోంది. మరియు క్లౌడ్‌ స్టోరేజీని కూడా వినియోగించుకోవచ్చు.

> 6 నెలల వరకు అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌
> 12 నెలల వరకు జియో హాట్‌స్టార్‌ మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌
> ఆపిల్‌ TV+ సబ్‌స్క్రిప్షన్‌
> ఆపిల్‌ మ్యూజిక్‌
> ఎయిర్‌టెల్‌ Xstream ప్లే ప్రీమియం
> గూగుల్‌ వన్‌ 100GB వరకు క్లౌడ్‌ స్టోరేజీ
> పెర్‌ఫ్లెక్సిటీ ప్రో ఏఐ
> హలోట్యూన్స్‌ వంటి ప్రయోజనాలను పొందవచ్చు

అయితే ఈ అదనపు ప్రయోజనాల్లో ఎప్పుడైనా మార్పులు చోటుచేసుకొనే అవకాశం ఉంది. అందువల్ల ఇలాంటి ప్లాన్‌లను ఎంచుకొనే సమయంలో యాప్‌, వెబ్‌సైట్‌లో ఉన్న తాజా సమాచారం ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి. ఈ ప్లాన్‌ను యాక్టివేట్‌ చేసుకొనేందుకు ఎయిర్‌టెల్‌ యాప్, వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.

రూ.449 పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో భాగంగా ఒక్క సిమ్‌ కార్డును మాత్రమే ఉపయోగించుకోవచ్చు. ఇందులో అన్‌లిమిటెడ్ లోకల్‌, STD కాలింగ్‌ సదుపాయం, రోజువారీ 100 SMS లు, మొత్తంగా 50GB డేటాను పొందవచ్చు.

దీంతోపాటు గూగుల్‌ వన్‌ సబ్‌స్క్రిప్షన్‌, ఇందులో 100GB వరకు క్లౌడ్‌ స్టోరేజీకి అవకాశం ఉంది. ఎయిర్‌టెల్‌ Xstream ప్లే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్, పెర్‌ఫ్లె్క్సిటీ ప్రో ఏఐ మోడల్‌ను ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు హలోట్యూన్‌ను ఉచితంగా వినియోగించుకోవచ్చు.

రూ.549 పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో భాగంగా ఒక్క సిమ్‌ కార్డును ఉపయోగించుకొనేందుకు వీలుంది. అన్‌లిమిటెడ్‌ లోకల్‌, STD కాలింగ్ సదుపాయం ఉంది. రోజువారీ 100 SMS లతోపాటు మొత్తంగా 75GB డేటాను వినియోగించుకోవచ్చు.

ఇందులో సంవత్సరం వరకు జియోహాట్‌స్టార్‌ మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌ ను పొందవచ్చు. 6 నెలల వరకు అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. ఎయిర్‌టెల్ Xstream ప్లే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ ను కూడా పొందవచ్చు. గూగుల్‌ వన్‌ ద్వారా 100 GB క్లౌడ్‌ స్టోరేజీని పొందవచ్చు. పెర్‌ఫ్లెక్సిటీ ప్రో ఏఐ, ఉచితంగా హలోట్యూన్స్‌ను ఉపయోగించుకోవచ్చు.

More News

Best Mobiles in India

English summary

Airtel Rs999 postpaid family plan Offers 150GB Data, unlimited callings and OTT Subscriptions



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related