2025లో భారతీయులు గూగుల్‌లో ఎక్కువగా వెతికింది వీటి కోసమే.. ఫస్ట్ ప్లేస్‌లో ఏముందో తెలుసా?

Date:


News

oi-Suravarapu Dileep

|

Google Search Trends 2025 ప్రతి సంవత్సరం చివరిలో గూగుల్ రిలీజ్ చేసే ఇయర్ ఇన్ సెర్చ్ (Year in Search) రిపోర్ట్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. గడిచిన 12 నెలల్లో దేశంలోని ప్రజలు ఇంటర్నెట్‌లో ఎక్కువగా ఏం వెతికారు? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకోవచ్చు. గూగుల్ ఇటీవలే ఈ వివరాలను వెల్లడించింది. ఈసారి భారతీయులు ఎక్కువగా వెతికిన అంశాలేంటో ఇప్పుడు చూద్దాం.

చాట్‌జీపీటీని వెనక్కి నెట్టిన జెమిని..
సాధారణంగా ఏఐ (AI) అనగానే అందరికీ చాట్‌జీపీటీ (ChatGPT) గుర్తొస్తుంది. కానీ ఈసారి గూగుల్ సొంత ఏఐ టూల్ అయిన జెమిని (Gemini).. పాపులర్ ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీని వెనక్కి నెట్టి టాప్ ప్లేస్‌లో నిలిచింది. భారతీయులు ఏఐ టూల్స్ వాడటంలో ఎంత ఆసక్తి చూపిస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతోంది.

డీప్‌సీక్ (DeepSeek), పర్‌ప్లెక్సిటీ (Perplexity) వంటి ఇతర ఏఐ ప్లాట్‌ఫామ్‌ల కోసం కూడా జనాలు బాగానే వెతికారు. స్పోర్ట్స్ విషయానికి వస్తే, ఎప్పటిలాగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) టాప్ ప్లేస్‌లో నిలిచింది.

సినిమాలు, సెలబ్రిటీల హవా..
బాలీవుడ్ విషయానికి వస్తే కొత్త ముఖాలు, పాత లెజెండ్స్ టాప్‌ సెర్చ్‌లో నిలిచారు. అనీత్ పడ్డా, అహాన్ పాండే నటించిన కొత్త సినిమా “సయ్యారా” (Saiyaara) గురించి నెటిజన్లు బాగా వెతికారు. అలాగే ఫైనల్ డెస్టినేషన్, స్క్విడ్ గేమ్ ఫ్రాంచైజీలతో పాటు హిట్ సినిమా కాంతారా (Kantara) కూడా ట్రెండింగ్‌లో నిలిచింది. సీనియర్ నటుడు ధర్మేంద్ర (Dharmendra), రచయిత జుబీ గార్గ్ (Zubeeh Garg) మరణ వార్తలు వచ్చినప్పుడు నెటిజన్లు వారికి ఘన నివాళులర్పిస్తూ ఎక్కువగా సెర్చ్ చేశారు.

వైరల్ మీమ్స్, వంటకాలు..
సోషల్ మీడియాలో ఈ ఏడాది హల్దీ వాటర్ (Haldi water) ట్రెండ్ బాగా నడిచింది. మీమ్స్ విషయానికొస్తే, 67 మీమ్ (67 meme) నెటిజన్లను తెగ ఆకట్టుకుంది. అలాగే అర్జున్ కపూర్, విశాల్ మెగా మార్ట్ సెక్యూరిటీ గార్డ్ మీమ్స్ కూడా నవ్వులు పూయించాయి.

వంటకాల విషయానికి వస్తే.. సంప్రదాయ వంటలైన టేకువా (Thekua), మోదక్ (Ukadiche Modak), ఇడ్లీ (Idli) రెసిపీల కోసం గృహిణులు గూగుల్ ను ఆశ్రయించారు. కుంభమేళా (Maha Kumbh) సమయంలో మతపరమైన అంశాలపై సెర్చ్‌లు పెరిగాయి.

టెక్నాలజీ, ట్రావెల్ ట్రెండ్స్..
జెమిని నానో బనానా (Nano Banana), ఎలాన్ మస్క్ ఎక్స్ గ్రోక్ (Grok) వంటి ఏఐ అప్డేట్స్ గురించి యూజర్లు ఎక్కువగా తెలుసుకొనే ప్రయత్నం చేశారు. వెకేషన్ కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారు వియత్నాంలోని ఫు క్వాక్ (Phu Quoc) ఐలాండ్ గురించి ఎక్కువగా ఆరా తీశారు. దీని తర్వాత పాండిచ్చేరి, ఫుకెట్, ఫిలిప్పీన్స్ ప్లేసులు నిలిచాయి.

వార్తలు, కరెంట్ అఫైర్స్..
దేశంలో జరిగిన ముఖ్యమైన వార్తా విశేషాలూ గూగుల్ సెర్చ్‌లో టాప్‌లో నిలిచాయి. ఆపరేషన్ సింధూర్, పెహల్గామ్ దాడి వంటి ఘటనల గురించి ప్రజలు ఎక్కువగా వెతికారు. అలాగే సీజ్‌ఫైర్ అంటే ఏంటి? (What is a ceasefire?) అనే ప్రశ్న ట్రెండింగ్‌లో నిలిచింది. గాలి నాణ్యత, భూకంపాలు, దసరా, దుర్గా పూజ ఉత్సవాల గురించి కూడా సెర్చ్ చేశారు.

క్రీడాకారులు..
IPL తో పాటు యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi), స్టార్ బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues) పేర్లు బాగా వినిపించాయి. మహిళల క్రికెట్ వరల్డ్ కప్ (Women’s Cricket World Cup) గురించి కూడా నెటిజన్లు ఆసక్తిగా వెతికారు, ఇది మహిళల క్రీడలకు పెరుగుతున్న ఆదరణను సూచిస్తోంది.

More News

Best Mobiles in India

English summary

Google Year in Search 2025 India From Gemini AI to IPL and Viral Memes

Story first published: Saturday, December 6, 2025, 12:05 [IST]



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related