Andhra Pradesh
oi-Dr Veena Srinivas
ఏపీ
రాజకీయాల్లో
సంచలనం
సృష్టించిన
స్కిల్
డెవలప్మెంట్
కార్పొరేషన్
స్కాం
కేసులో
ఏపీ
సీఎం
నారా
చంద్రబాబు
నాయుడుకి
బిగ్
రిలీఫ్
లభించింది.
ఈ
కేసులో
మనీలాండరింగ్
కోణంలో
దర్యాప్తు
చేసిన
ఈడి
మనీలాండరింగ్
కార్యాకలాపాలలో
చంద్రబాబు
పాత్ర
లేదని
స్పష్టం
చేసింది.
తాజాగా
దాఖలు
చేసిన
అనుబంధ
చార్జిషీట్
లో
ఈడి
చంద్రబాబును
నిందితుడిగా
చేర్చలేదు.
చంద్రబాబుకు
భారీ
ఊరట
ఈ
వ్యవహారంలో
మనీలాండరింగ్
సంబంధిత
ప్రక్రియలలో
చంద్రబాబు
పాత్ర
లేదని
ఈడి
ధ్రువీకరించడం
ఈ
కేసులో
చంద్రబాబుకు
భారీ
ఊరటనిచ్చింది.
విశాఖపట్నంలోని
ప్రత్యేక
పీఎంఎల్ఏ
కోర్టులో
ఈడి
ఈ
సప్లమెంటరీ
చార్జ్
షీట్
దాఖలు
చేసింది
.
ఈ
ఛార్జ్
షీట్
ను
జనవరి
28వ
తేదీన
కోర్టు
విచారణకు
స్వీకరించగా,
ఇందులో
చంద్రబాబు
పాత్ర
లేదని
పేర్కొంది.
అనుబంధ
అభియోగ
పత్రాలలో
చంద్రబాబు
పేరు
లేదు
ఈ
కేసుకు
సంబంధించి
దాఖలు
చేసిన
ప్రధాన
అనుబంధ
అభియోగ
పత్రాలలో
కూడా
చంద్రబాబు
పేరు
లేకపోవడం
ప్రధానంగా
కనిపిస్తుంది.
ఈ
కేసులో
డిజైన్
టెక్
సిస్టం
ప్రైవేట్
లిమిటెడ్
దాని
ఎండి
వికాస్
వినాయక్
ఖన్వేల్ఖర్,
సీమెన్స్
ఇండియా
మాజీ
ఎండీ
సౌమ్యాద్రి
శేఖర్
బోస్
తదితరులను
నిందితులుగా
పేర్కొన్న
ఈడి
చంద్రబాబు
ప్రమేయంపై
సాక్ష్యాలు
లేవని
తేల్చిచెప్పింది.
ఈడి
అధికారిక
ప్రకటనతో
ఈ
విషయం
వెలుగులోకి
వచ్చింది.
స్కిల్
కేసులో
53
రోజులు
చంద్రబాబు
జైల్లో
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో
గత
ప్రభుత్వ
హయాంలో
ఏపీ
సిఐడి
స్కిల్
కేసులో
2023
సెప్టెంబర్లో
చంద్రబాబును
నిందితుడిగా
చేర్చి
అరెస్టు
చేసింది.
సుమారు
53
రోజులపాటు
చంద్రబాబు
రాజమహేంద్రవరం
జైల్లో
ఉన్నారు.
ఏపీ
సిఐడి
అధికారులు
2024
ఏప్రిల్
లో
విజయవాడ
ఏసిబి
కోర్టులో
అభియోగపత్రం
దాఖలు
చేసి
చంద్రబాబును
ప్రధాన
నిందితుడిగా
పేర్కొన్నారు.
ఇక
ఈ
కేసులో
మనీ
లాండరింగ్
ఆరోపణలు
చేసి
ఈడికి
లేఖ
రాశారు.
చంద్రబాబుకు
క్లీన్
చిట్
ఇచ్చిన
ఈడీ
ఈ
లేఖ
ద్వారా
రంగంలోకి
దిగిన
ఈడి
కేసును
దర్యాప్తు
చేసి
ఈ
కేసులో
ఎక్కడ
చంద్రబాబు
పాత్ర
లేదని
తాజా
అనుబంధ
అభియోగ
పత్రంలో
పేర్కొంది.
ఈ
కేసులో
నిధులు
దారి
మళ్లింపు
వ్యవహారాలలో
చంద్రబాబు
పాత్ర
లేదని
చంద్రబాబుకు
క్లీన్
చిట్
ఇచ్చింది.
ఇప్పటికే
జగన్
ప్రభుత్వ
హయాంలో
సిఐడి
కేసులో
చంద్రబాబుకు
విముక్తి
లభించగా,
తాజాగా
ఈడీ
కేసులోనూ
చంద్రబాబు
పాత్ర
లేదని
స్పష్టం
చేయడంతో
ఈ
కేసు
నుండి
చంద్రబాబుకు
విముక్తి
లభించినట్లయ్యింది.


