Telangana
oi-Lingareddy Gajjala
సినిమా
టికెట్
ధరల
పెంపుపై
తెలంగాణ
హైకోర్టు
ఆగ్రహం
వ్యక్తం
చేసింది.
మంగళవారం
టికెట్ల
పెంపుపై
జరిగిన
విచారణలో
కీలక
ఆదేశాలు
జారీ
చేసింది.
చివరి
క్షణాల్లో
టికెట్
ధరల
కోసం
కోర్టు
మేట్లు
ఎక్కడం,
ప్రభుత్వం
చుట్టూ
తిరిగడంపై
కూడా
అసహనం
వ్యక్తం
చేసి
కోర్టు..
ఇక
నుంచి
విడుదల
కాబోయే
అన్ని
చిత్రాలకు
వర్తించేలా
ఆదేశాలు
జారీ
చేసింది
సినిమా
టికెట్
ధరల
పెంపు
విషయంలో
ఇకపై
ప్రభుత్వానికి
స్పష్టమైన
గడువు
తప్పనిసరి
అంటూ
తెలంగాణ
హైకోర్టు
కీలక
ఆదేశాలు
జారీ
చేసింది.
సినిమా
విడుదలకు
కనీసం
90
రోజుల
ముందే
టికెట్
ధరలు
పెంచే
ఉత్తర్వులు
జారీ
చేయాలి
అని
హోంశాఖను
ఆదేశించింది.
ఈ
నిర్ణయం
భవిష్యత్తులో
అన్ని
చిత్రాలకు
వర్తించనుంది.
మన
శంకరవరప్రసాద్
గారు
సినిమా
టికెట్
ధరల
పెంపును
సవాల్
చేస్తూ
న్యాయవాది
విజయ్
గోపాల్
హైకోర్టును
ఆశ్రయించారు.
ఈ
నెల
9న
జరిగిన
విచారణలో,
సినిమా
విడుదలకు
కేవలం
ఒక
రోజు
ముందు
అంటే
ఈ
నెల
8న
టికెట్
ధరలు
పెంచుతూ
ఉత్తర్వులు
జారీ
చేయడాన్ని
ఆయన
తీవ్రంగా
తప్పుబట్టారు.
అంతేకాదు,
ఈ
ఉత్తర్వులను
కోర్టు
దృష్టికి
ప్రభుత్వ
న్యాయవాది
తీసుకురాలేదని
పేర్కొన్నారు.
వాదనలు
విన్న
ధర్మాసనం,
టికెట్
ధరల
పెంపు
వంటి
నిర్ణయాలు
చివరి
నిమిషంలో
కాకుండా
ముందస్తుగా
తీసుకోవాలని
స్పష్టం
చేసింది.
ఇకపై
సినిమాల
విడుదలకు
మూడు
నెలల
ముందే
ఇలాంటి
ఉత్తర్వులు
జారీ
చేయాలని
హోంశాఖకు
స్పష్టమైన
ఆదేశాలు
ఇచ్చింది.
ఈ
వ్యవహారంలో
హోంశాఖ
ప్రత్యేక
ప్రధాన
కార్యదర్శిపై
కోర్టు
ధిక్కరణ
కేసు
నమోదు
కాగా,
ఆయనకు
నోటీసులు
కూడా
జారీ
అయ్యాయి.
టికెట్
ధరల
పెంపు
అంశంపై
కౌంటర్
దాఖలు
చేయాలని
ప్రభుత్వాన్ని
ఆదేశించిన
హైకోర్టు,
తదుపరి
విచారణను
వాయిదా
వేసింది.
ఈ
తీర్పుతో
టికెట్
ధరలపై
అకస్మాత్తు
నిర్ణయాలకు
ఇకపై
బ్రేక్
పడినట్టే
అని
న్యాయ
వర్గాలు
వ్యాఖ్యానిస్తున్నాయి.


