బ్లేడు,స్ట్రాతో రోడ్డుపై సర్జరీ..దేవుళ్లలా వచ్చిన డాక్టర్లు..!!

Date:


India

oi-Kannaiah

ఆదివారం
రాత్రి
కొచ్చిలోని
ఉదయంపేరూర్
ప్రాంతంలో
ఒక
ఘోర
రోడ్డు
ప్రమాదం
జరిగింది.
కొల్లాంకు
చెందిన
లిను
అనే
యువకుడు
తీవ్ర
గాయాలతో
రోడ్డుపై
పడి
ఉన్నాడు.
ముఖానికి
బలమైన
గాయాలు
కావడంతో
నోటి
నిండా
రక్తం
గడ్డకట్టి,
అతడు
ఊపిరి
తీసుకోలేక
విలవిలలాడుతున్నాడు.
వైద్య
భాషలో
చెప్పాలంటే
‘రెస్పిరేటరీ
అరెస్ట్’
(శ్వాస
నిలిచిపోవడం)
కు
సెకన్ల
దూరంలో
ఉన్నాడు.


దేవదూతల్లా
వచ్చిన
ముగ్గురు
డాక్టర్లు

సరిగ్గా
అదే
సమయంలో

దారి
గుండా
వెళ్తున్న
ముగ్గురు
యువ
వైద్యులు
ఆగిపోయారు.
కొట్టాయం
మెడికల్
కాలేజీ
అసిస్టెంట్
ప్రొఫెసర్
డాక్టర్
బి.
మనూప్,
కొచ్చి
ఇందిరాగాంధీ
కోఆపరేటివ్
ఆసుపత్రికి
చెందిన
డాక్టర్
దంపతులు
డాక్టర్
థామస్
పీటర్,
డాక్టర్
దిదియా
కె.
థామస్
ఏమాత్రం
ఆలస్యం
చేయకుండా
క్షతగాత్రుడి
వద్దకు
పరుగెత్తారు.
లిను
పరిస్థితి
విషమంగా
ఉందని,
ఆసుపత్రికి
వెళ్లేలోపే
ప్రాణం
పోతుందని
వారు
గుర్తించారు.


బ్లేడు,
ప్లాస్టిక్
స్ట్రా..
అవే
ప్రాణవాయువులై!

అక్కడ
ఎమర్జీన్సీ
కిట్
లేదు.
కానీ

వైద్యులు
ధైర్యం
చేశారు.
స్థానికులను
అడిగి
ఒక
షేవింగ్
బ్లేడు,
ఒక
ప్లాస్టిక్
స్ట్రాను
ఏర్పాటు
చేసుకున్నారు.
వీధి
దీపాల
వెలుతురు
సరిపోకపోవడంతో
స్థానికులు
తమ
మొబైల్
ఫోన్
ఫ్లాష్
లైట్లను
వెలిగించి
సహకరించారు.వెంటనే
డాక్టర్లు
‘సర్జికల్
క్రికోథైరాయిడోటమీ’
(Surgical
Cricothyroidotomy)
అనే
అత్యవసర
ప్రక్రియను
ప్రారంభించారు.
అంటే
గొంతు
భాగంలో
చిన్న
గాటు
పెట్టి,
నేరుగా
ఊపిరితిత్తులకు
గాలి
అందేలా
మార్గాన్ని
ఏర్పాటు
చేయడం.

బ్లేడుతో
గాటు
పెట్టి,
ప్లాస్టిక్
స్ట్రాను
గొంతులోకి
పంపించి
లినుకు
శ్వాస
అందేలా
చేశారు.

క్షణం
లిను
ఊపిరి
పీల్చుకోవడంతో
అక్కడున్న
వారందరూ
ఊపిరి
పీల్చుకున్నారు.


మానవత్వం
వెల్లివిరిసిన
వేళ..

సాధారణంగా
ఇలాంటి
సమయాల్లో
జనం
మొబైల్
ఫోన్లతో
వీడియోలు
తీస్తూ
ఉంటారు.
కానీ
అక్కడ
ఉన్న
ప్రజలు
ఎంతో
పరిణతితో
వ్యవహరించారు.
డాక్టర్లు
ఆపరేషన్
చేస్తున్నప్పుడు
ఎవరూ
వీడియోలు
తీయకుండా
సహకరించారు.
ప్రక్రియ
పూర్తయ్యాక
లినును
అంబులెన్స్‌లో
ఆసుపత్రికి
తరలించారు.
డాక్టర్
మనూప్
స్వయంగా
అంబులెన్స్‌లో
ఉండి
రోగిని
పర్యవేక్షించారు.


ప్రశంసల
జల్లు

పరిమిత
వనరులతో
ఒక
నిండు
ప్రాణాన్ని
కాపాడిన

యువ
వైద్యులను
ఇండియన్
మెడికల్
అసోసియేషన్
(IMA)
ప్రత్యేకంగా
అభినందించింది.
“లభ్యమైన
వస్తువులతో
అత్యవసర
చికిత్స
అందించి
ఆదర్శంగా
నిలిచారు”
అని
ఐఎంఏ
ప్రెసిడెంట్
డాక్టర్
ఎం.ఎన్.
మీనన్
కొనియాడారు.
సోషల్
మీడియాలో
కూడా
వీరిని
రియల్
హీరోలుగా
నెటిజన్లు
అభివర్ణిస్తున్నారు.

మానవ
సేవే
మాధవ
సేవ
అని
పెద్దలు
చెబుతుంటారు.
వైద్యుడు
దేవుడితో
సమానం
అని
ఎందుకు
అంటారో

ఘటన
మరోసారి
నిరూపించింది.
సమయస్ఫూర్తి
ఉంటే
చిన్న
వస్తువులతోనూ
గొప్ప
అద్భుతాలు
చేయవచ్చని

ముగ్గురు
డాక్టర్లు
చాటి
చెప్పారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related