అత్యవసర సమయాల్లో సాయం కోసం ప్రత్యేక ఫీచర్‌.. పూర్తి వివరాలు

Date:


News

oi-Suravarapu Dileep

|

అత్యవసర సమయాల్లో ఇతరుల సాయం పొందడం సహా మన వివరాలను ఇతరులకు షేర్‌ చేయడం పెద్ద టాస్క్‌. ముఖ్యంగా లొకేషన్‌ షేర్ చేయడం కొన్ని సందర్భాల్లో చాలా కష్టం. ఇలాంటి సందర్భాల్లో తక్షణ సాయం కోసం ప్రత్యేక నంబర్లు కూడా ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. అయితే తాజాగా భారత్‌ లో ఆండ్రాయిడ్ ప్రత్యేక ఫీచర్‌ ను తీసుకొచ్చింది. ప్రస్తుతం టెస్టింగ్‌ చేస్తోంది.

ఎమర్జెన్సీ లొకేషన్‌ సర్వీస్‌ :
ఆండ్రాయిడ్ ఎమర్జెన్సీ లొకేషన్‌ సర్వీస్‌ పేరుతో (Emergency Location Service) ఈ ఫీచర్‌ ను తీసుకొచ్చింది. ప్రస్తుతం భారత్‌ లో ఉత్తరప్రదేశ్‌ లో ఈ ఫీచర్‌ టెస్టింగ్‌ దశలో ఉంది. త్వరలో అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఫీచర్‌ ఆండ్రాయిడ్‌ లో ఇన్‌బిల్ట్‌ గా ఉంటుంది.

కచ్చితమైన లొకేషన్‌ :
ఏదైనా అత్యవసర సమయాల్లో మీరు 112 నంబర్‌ కు కాల్‌ చేసినప్పుడు, మీ ఫోన్ ఆటోమేటిక్‌ గా మీ లొకేషన్‌ ను షేర్‌ చేస్తుంది. అయితే కేవలం GPS లొకేషన్‌ ఆధారంగానే కాకుండా, వైఫై (Wi-Fi) నెట్‌వర్క్స్‌, మొబైల్‌ టవర్ల నుంచి కచ్చితమైన లొకేషన్‌ ను షేర్‌ చేస్తుంది.

ఆండ్రాయిడ్‌ కోసం ప్రత్యేకంగా :
ఈ కొత్త సర్వీసు వల్ల ఏదైనా అత్యవసర సందర్భాల్లో మీరున్న లొకేషన్‌ ను ఇతరులతో షేర్‌ చేయలేకపోయినా పరిస్థితుల్లో ఈ ఎమర్జెన్సీ లొకేషన్‌ సర్వీస్‌ (ELS) మీకు ఉపయోగపడుతుంది. ఎటువంటి యాప్స్‌ అవసరం లేకుండా ఈ ఫీచర్‌ పనిచేస్తుంది. ఆండ్రాయిడ్‌ కోసం గూగుల్‌ ఈ ఫీచర్‌ ను అభివృద్ధి చేసింది.

ఈ ఫీచర్‌ కోసం ఎటువంటి యాప్‌ అవసరం లేకపోయినా.. ఫోన్‌ లో ఉన్న ఈ సర్వీస్‌ ను యాక్టివేట్ చేసుకోవాలి. చాలా ఫోన్‌లో ఈ సర్వీస్‌ డిఫాల్ట్‌గా యాక్టివ్‌లోనే ఉంటోంది. మీ ఫోన్‌లో యాక్టివ్‌ గా ఉందో లేదో తెలుసుకొనేందుకు లొకేషన్‌ సెట్టింగ్స్‌ లో ఉన్న ఎమర్జెన్సీ లొకేషన్‌ సర్వీస్‌ పైన క్లిక్‌ చేయాలి.

ఎమర్జెన్సీ సమయాల్లో మాత్రమే :
ఆండ్రాయిడ్ 6.0 లేదా అంతకంటే కొత్త OS వెర్షన్‌లపై పనిచేస్తున్న ఫోన్‌లలో ఈ ఫీచర్‌ పనిచేస్తుంది. అయితే ప్రస్తుతం భారత్‌లో ఉత్తర ప్రదేశ్‌లో మాత్రమే ఈ సర్వీస్‌ను లైవ్‌లోకి తీసుకొచ్చారు. అయితే ఈ ఫీచర్‌ యాక్టివ్‌లో ఉన్నా.. ఎమర్జెన్సీ కాల్‌ లేదా ఎమర్జెన్సీ SMS సమయాల్లో మాత్రమే ఆన్‌ అవుతుంది.

గోప్యతకు ఇబ్బంది లేకుండా! :
అయితే ఈ సర్వీస్‌ కారణంగా వ్యక్తిగత గోప్యతకు ఎటువంటి ఇబ్బంది ఉండదని తెలుస్తోంది. మీ లొకేషన్‌ను నిరంతరం ట్రాకింగ్ చేయడం గానీ లేదా లొకేషన్‌ హిస్టరీని స్టోరేజీ చేయడం గానీ ఉండదు. మీ లొకేషన్‌ వివరాలు నేరుగా ఎమర్జెన్సీ సర్వీసులకు వెళ్తాయని తెలుస్తోంది.

ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్‌లో ఈ సరీస్‌ టెస్టింగ్‌ చేస్తున్నారు. ఈ సర్వీసులను నేరుగా 112 నంబర్‌కు ఇంటిగ్రేట్‌ చేశారు. మిలియన్‌ల ఎమర్జెన్సీ కాల్స్‌ లొకేషన్‌ ట్రాక్‌ చేయడం సహా కేవలం సెకన్ల వ్యవధిలో డిస్‌కనెక్ట్‌ అయిన కాల్స్‌ లొకేషన్‌లను కూడా గుర్తించగలిగారు.

More News

Best Mobiles in India

English summary

what is emergency location service on android for indian users, full details



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related