ఆధార్‌ యాప్‌ నుంచే మొబైల్ నంబర్‌ అప్‌డేట్‌.. UIDAI కీలక ప్రకటన..!

Date:


News

oi-Suravarapu Dileep

|

ఆధార్‌ కార్డులోని సమాచారాన్ని గోప్యంగా ఉంచడం సహా వివరాలను సులభంగా అప్‌డేట్‌ చేసుకొనేందుకు వీలుగా UIDAI అనేక చర్యలు తీసుకుంటోంది. గత 10 సంవత్సరాల్లో ఆధార్‌ వివరాలను అప్‌చేయని కార్డుదారులు వెంటనే పూర్తి చేయాలని సూచిస్తోంది. ఇందులో భాగంగా సుమారుగా గత రెండు సంవత్సరాల నుంచి ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ మార్గాల్లో అప్‌డేట్‌ చేసుకొనేందుకు అవకాశం కల్పిస్తోంది.

ఆధార్‌ వివరాలను భద్రంగా, సురక్షితంగా నిర్వహించుకొనేందుకు వీలుగా ఇప్పటికే యూజర్లకు అనేక ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతోపాటు ఆధార్‌ వివరాలు దుర్వినియోగం కాకుండా ఉండేలా ఆధార్‌ హిస్టరీ ఫీచర్‌ ను కూడా తీసుకొచ్చింది. mAadhaar యాప్‌ ఇప్పటికే అందుబాటులో ఉండగా.. ఇటీవలే ఆధార్‌కు సంబంధించి కొత్త యాప్‌ ను కూడా తీసుకొచ్చింది.

కీలక ప్రకటన :
ఆధార్‌ కొత్త యాప్‌ లో ఆధార్‌ వివరాలను డిజిటల్‌ గా స్టోర్‌ చేసుకోవడం సహా ఇతర ఆప్షన్లను అందిస్తోంది. ఈ యాప్‌లో కుటుంబ సభ్యుల వివరాలను కూడా భద్రపరచుకొనేందుకు అవకాశం ఉంటుంది. అయితే UIDAI మరో గుడ్‌న్యూస్ (Aadhaar App Mobile Number Update) చెప్పింది.

ప్రస్తుతం ఆధార్‌లో అనేక వివరాలను ఆన్‌లైన్ ద్వారానే అప్‌డేట్‌ చేసుకొనేందుకు అవకాశం ఉంది. ఫోటో, ఫోన్ నంబర్‌ను మార్చుకొనేందుకు మాత్రం కచ్చితంగా ఆధార్‌ సేవా కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. అయితే త్వరలో కొత్తగా తీసుకొచ్చిన ఆధార్‌ యాప్‌ నుంచి ఫోన్‌ నంబర్‌ ను కూడా అప్‌డేట్‌ చేసుకొనేందుకు అవకాశం కల్పిస్తామని UIDAI తెలిపింది.

ఫీడ్‌బ్యాక్‌ :
ఆధార్‌ యాప్‌ లో త్వరలో ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. ఆధార్‌ ఫేస్‌ అథెంటికేషన్, OTP ఆధారంగా.. యాప్‌ నుంచి మొబైల్ నంబర్‌ను అప్‌డేట్‌ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన యూజర్లు.. ఫీచర్‌ పనితీరును తమతో పంచుకోవాలని కోరింది. [email protected] కు మెయిల్‌ చేయాలని సూచించింది.

ఈ నెల రెండో వారంలో ఆధార్‌ కొత్త యాప్‌ను UIDAI తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్, iOS లో ఈ యాప్‌ అందుబాటులో ఉంది. ఈ యాప్‌ ద్వారా డిజిటల్‌గా ఆధార్‌ వివరాలను భద్రపరుచుకోవచ్చు. ఆధార్‌ బయోమెట్రిక్‌ వివరాలను లాక్‌, అన్‌లాక్‌ చేసేందుకు అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఆధార్‌ హిస్టరీని కూడా ఈ యాప్‌ ద్వారా తెలుసుకొనేందుకు అవకాశం ఉంటుంది.

> యాప్‌ స్టోర్‌, ప్లే స్టోర్‌ నుంచి ఆధార్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి.
> అనంతరం యాప్‌ అనేక భాషల్లో అందుబాటులో ఉంటుంది. మీ భాషను ఎంపిక చేసుకోవాలి.
> అనంతరం 12 అంకెల ఆధార్‌ నంబర్‌ను నమోదు చేయాలి.
> ఆ తర్వాత ఆధార్‌తో అనుసంధానం చేసిన మొబైల్‌ నంబర్‌కు వచ్చిన OTP ని నమోదు చేయాలి.
> OTP నమోదు చేసిన అనంతరం, ఫేస్‌ అథెంటికేషన్‌ పూర్తి చేయాల్సి ఉంటుంది.
> యాప్‌ కోసం 6 అంకెల పాస్‌వర్డ్‌ను క్రియేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.
> అనంతరం యాప్ ద్వారా ఆధార్‌ వివరాలను సురక్షితంగా నిర్వహించుకొనేందుకు వీలుగా మాస్క్‌, బయోమెట్రిక్‌ లాక్‌ వంటి ఫీచర్‌లను ఉపయోగించుకోవాలి.

More News

Best Mobiles in India

English summary

aadhaar New app will soon allow users can update mobile number via app

Story first published: Friday, November 28, 2025, 17:42 [IST]



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Tyra Banks on Going “Too Far” on America’s Next Top Model 

It's time to pull back the curtain on America's Next...

WWE Superstar Talks Unreal & Seth Rollins

As WWE marches toward WrestleMania season, wrestling superstar Becky...

President Asks South Korea Leader for More Concerts

The President of Mexico, Claudia Sheinbaum, revealed on Monday...