కళియుగ
వైకుంఠ
దైవమైన
తిరుమల
స్వామివారిని
దర్శించుకునేందుకు
నిత్యం
భక్తులు
తండోపతండాలుగా
తరలి
వస్తుంటారు.
సాధారణ
రోజుల్లోనే
ఇక్కడ
రద్దీ
ఎక్కువగా
ఉంటుంది.
ఇక,
పండుగలు,
ఉత్సవాలు,
పూజ
కార్యక్రమాల
వంటి
సమయంలో
భక్తుల
రద్దీ
గురించి
ప్రత్యేకంగా
చెప్పక్కర్లేదు.
స్వామివారి
దర్శనానికి
క్యూలైన్లో
కూడా
బారులు
తీరుతారు.
తిరుమల
వెళ్లే
భక్తులకు
ఆలయ
అధికారులు
అలర్ట్
జారీ
చేశారు.
రేపు
దీపావళి
పండుగల
సందర్భంగా
పలు
దర్శనాలను
రద్దు
చేస్తున్నట్లు
ఆలయ
అధికారులు
తెలిపారు.
దీపావళి
పండుగ
సందర్భంగా
రేపు
‘దీపావళి
ఆస్థానాన్ని’
నిర్వహించనున్నట్లు
అధికారులు
పేర్కొన్నారు.
ఈ
మేరకు
తిరుమల
తిరుపతి
దేవస్థానం
ఓ
ప్రకటననను
కూడా
జారీ
చేసింది.
రేపు
దీపావళి
పండగ
సందర్భంగా
ఆలయంలో
దీపావళి
ఆస్థానాన్ని
ఉదయం
7
గంటల
నుండి
ఉదయం
9
గంటల
వరకు
నిర్వహించనున్నారు.
ఇందుకోసం
బంగారు
వాకిలి
ముందు
గల
ఘంటా
మండపంలో
దీపావళి
ఆస్థానం
జరుపుతున్నట్లు
ఆలయ
అధికారులు
వివరించారు.
సహస్ర
దీపాలంకరణ
సేవ..
దీపావళి
ఆస్థానంలో
భాగంగా
ఆలయంలోని
శ్రీ
మలయప్పస్వామి
దేవేరులతో
కలిసి
ఘంటా
మండపంలో
ఏర్పాటు
చేసిన
సర్వభూపాల
వాహనంలో
గరుడాళ్వార్‌కు
అభిముఖంగా
వేంచేపు
చేయనున్నారు.
సేనాధిపతి
అయిన
శ్రీ
విష్వక్సేనులవారిని
కూడా
స్వామివారి
ఎడమ
పక్కన
మరొక
పీఠంపై
దక్షిణ
ఆభిముఖంగా
వేంచేపు
చేయనున్నట్లు
టీటీడీ
తెలిపింది.
ఆ
తర్వాత
స్వామివారికి
ప్రత్యేక
పూజ,
హారతి,
ప్రసాద
నివేదనలను
అర్చకులు
ఆగమోక్తంగా
నిర్వహించనున్నారు.
దీంతో
దీపావళి
ఆస్థానం
పూర్తవుతుంది.
వీటితోపాటు
సాయంత్రం
5
గంటలకు
శ్రీదేవి,
భూదేవి
సమేత
శ్రీ
మలయప్పస్వామివారు
సహస్ర
దీపాలంకరణ
సేవలో
పాల్గొనున్నట్లు
తెలిపారు.
ఆలయ
నాలుగు
మాడ
వీధులలో
విహరించి
భక్తులకు
దర్శనమివ్వనున్నారు.
ఆ
దర్శనాలు
రద్దు..
తిరుమల
శ్రీవారి
ఆలయంలో
రేపు
దీపావళి
ఆస్థానం
సందర్భంగా
వీఐపీ
బ్రేక్
దర్శనాలను
రద్దు
చేస్తున్నట్లు
టీటీడీ
అధికారులు
తెలిపారు.
ఇందుకు
సంబంధించి
30వ
తేదీ
తిరుమలలో
సిఫార్సు
లేఖలు
కూడా
స్వీకరించబడవని
అధికారులు
స్పష్టం
చేశారు.
ఈ
విషయాన్ని
గమనంలో
ఉంచుకుని
సహకరించాలని
భక్తులకు
ఆలయ
అధికారులు
కోరారు.
తిరుమల
ఆలయంలో
నవంబరు
నెలలో
జరుగనున్న
విశేష
పర్వదినాలు
ఇవే..
నవంబరు
1వ
తేదిన
కేదారగౌరీ
వ్రతం
నవంబరు
3వ
తేదిన
భగినీహస్త
భోజనం,
శ్రీ
తిరుమలనంబి
శాత్తుమొర
నవంబరు
5వ
తేదిన
నాగుల
చవితి,
పెద్ద
శేష
వాహనం
నవంబరు
6వ
తేదిన
శ్రీ
మనవాళ
మహామునుల
శాత్తుమొర
నవంబరు
8వ
తేదిన
వార్షిక
పుష్పయాగానికి
అంకురార్పణ
నవంబరు
9వ
తేదిన
శ్రీ
వారి
పుష్పయాగం,
అత్రి
మహర్షి
వర్ష
తిరునక్షత్రం,
పిళ్లైలోకాచార్య
వర్ష
తిరు
నక్షత్రం,
పోయిగైయాళ్వార్
వర్ష
తిరు
నక్షత్రం,
పూదత్తాళ్వార్
వర్ష
తిరు
నక్షత్రం,
వేదాంత
దేశికుల
శాత్తుమొర
నవంబర్10వ
తేదిన
పేయాళ్వార్
వర్ష
తిరు
నక్షత్రం
నవంబరు
11వ
తేదిన
శ్రీ
యాజ్ఞవల్క్య
జయంతి
నవంబరు
12వ
తేదిన
ప్రబోధన
ఏకాదశి
నవంబరు
13వ
తేదీన
కైశిక
ద్వాదశి
ఆస్థానం,
చాతుర్మాస్య
వ్రత
సమాప్తి
నవంబరు
15వ
తేదీన
కార్తీక
పౌర్ణమి


