Telangana
oi-Dr Veena Srinivas
ప్రస్తుతం
తెలుగు
రాష్ట్రాలలో
శివాజీ
మహిళల
వస్త్రధారణపై
చేసిన
వ్యాఖ్యలతో
పెను
దుమారం
కొనసాగుతుంది.
నటుడు
శివాజీ
ఇటీవల
ఒక
సినిమా
ఫ్రీ
రిలీజ్
ఈవెంట్
లో
హీరోయిన్ల
వస్త్రధారణ
పైన
మాట్లాడారు.
హీరోయిన్లు
చీరలు,
సాంప్రదాయ
దుస్తులు
ధరించాలని
ఎందుకంటే
అందం
వాటిలోనే
ఉంటుందని
శరీరాన్ని
ప్రదర్శించడంలో
కాదని
అభిప్రాయం
వ్యక్తం
చేశారు.
మహిళల
వస్త్ర
ధారణపై
శివాజీ
అభిప్రాయం
సావిత్రి,
సౌందర్య
లాంటి
వారు
చీరలో
అద్భుతంగా
కనిపించారని
ఇది
తన
అభిప్రాయంగా
శివాజీ
చెప్పారు.
ఇక
శివాజీ
వ్యాఖ్యల
పైన
అనసూయ,
చిన్మయి
శ్రీపాద
వంటి
వారు
స్పందించారు.
ఆయన
వ్యాఖ్యలు
పాతకాలపు
ఆలోచనలు
అని,
వ్యక్తిగత
స్వేచ్ఛని
కించపరిచేలా
ఉన్నాయని
విమర్శలు
గుప్పించారు.
ఇక
అనసూయ
భరద్వాజ్
శివాజీ
వ్యాఖ్యలకు
ఘాటుగా
కౌంటర్
ఇచ్చారు.
శివాజీ
వ్యాఖ్యలకు
అనసూయ
కౌంటర్
తాజాగా
ఒక
బహిరంగ
వేదికపై
మహిళలు
ఎలా
దుస్తులు
ధరించాలి
అనే
విషయం
పైన
చేసిన
ఉటంకిస్తూ
పేర్కొన్న
ఆమె
కన్సర్న్
పేరుతో
కంట్రోల్
చేయడం,
ప్రొటెక్షన్
పేరుతో
జడ్జిమెంట్
ఇవ్వాలని
కన్ఫ్యూజ్
అవ్వడం
చూస్తుంటే
ఆశ్చర్యం
కలుగుతుంది
అన్నారు.
ఒక
మహిళ
వస్త్రధారణ
అనేది
ఆమె
వ్యక్తిగత
ఇష్టం
అని
అది
ఎవరిని
ఉద్దేశించింది
కాదని
దానివల్ల
ఎవరికి
నష్టం
లేదంటూ
వ్యాఖ్యలు
చేశారు.
శివాజీ,
అనసూయ
ఎవరిది
కరెక్ట్
వీళ్ళ
అభద్రతాభావాన్ని
మోరల్
పోలీసింగ్
గా
మార్చడం
మగతనం
అనిపించుకోదు
అంటూ
ఘాటుగా
వ్యాఖ్యానించారు.
అయితే
ప్రస్తుతం
సోషల్
మీడియాలో
మహిళల
వస్త్రధారణ
విషయంలో
శివాజీ
వర్సెస్
అనసూయ
రగడ
కొనసాగుతుంది.
ఇందులో
ఎవరిది
కరెక్ట్
ఎవరిది
రాంగ్
అన్న
చర్చ
జరుగుతోంది.
ఒకరిది
సామాజిక
కోణం
అయితే
మరొకరిది
వ్యక్తిగత
స్వేచ్ఛ
కోణం
అన్నది
ఇందులో
ప్రధానంగా
కనిపిస్తుంది.
శివాజీ
వ్యాఖ్యలలో
సామాజిక
కోణం
శివాజీ
మహిళల
వస్త్రధారణ
సంస్కృతి
పైన,
సమాజం
పైన
ప్రభావాన్ని
చూపుతోందని
అభిప్రాయపడ్డారు.
అర్థనగ్నంగా
లేదా
ప్రదర్శనాత్మక
తప్పు
సందేశాన్ని
ఇస్తాయని
ఆందోళనలను
వ్యక్తం
చేశారు.
పిల్లలు,
యువత
పైన
దాని
ప్రభావాన్ని
దృష్టిలో
పెట్టుకోవాలని
శివాజీ
సూచించారు.
ఇది
తన
సామాజిక
బాధ్యత
కోణంలో
చెప్పిన
అభిప్రాయంగా
ఆయన
చెప్పారు.
ఇద్దరి
మాటల్లోనూ
నిజం
అనసూయ
అభిప్రాయం
ప్రకారం
వస్త్రధారణ
వ్యక్తిగత
స్వేచ్ఛ
అని
ఆమె
తెలిపారు.
మహిళలను
దుస్తుల
ఆధారంగా
జడ్జ్
చేయకూడదని
ఆమె
పేర్కొన్నారు.
సమస్య
దుస్తుల్లో
కాదు
చూసే
దృష్టిలో
ఉందని
అభిప్రాయం
వ్యక్తం
చేశారు.
అనసూయ
వ్యక్తిగత
హక్కులు,
స్వేచ్ఛ
కోణంలో
ఈ
అభిప్రాయాన్ని
వ్యక్తం
చేశారు.
అయితే
నిజానికి
ఇద్దరి
మాటల్లోనే
కొంత
నిజం
ఉందని,
ఇద్దరి
మాటల్లోని
మంచి
అంశాలను
తీసుకోవలసిన
అవసరం
ఉంది.
స్వేచ్చ
అంటే
బాధ్యత
లేని
ప్రవర్తన
కాదు,
సంసృతి
అంటే
బలవంతపు
నియమాలు
కాదు
మహిళలకు
తమ
ఇష్టం
ప్రకారం
దుస్తులు
ధరించే
హక్కు
ఉంది.
కానీ
అదే
సమయంలో
సందర్భోచితంగా,
వెళుతున్న
ప్రదేశాన్ని
బట్టి,
ఆ
సమయాన్నిబట్టి
ఎలాంటి
దుస్తులు
ధరించాలనే
అవగాహన
అవసరం
అన్న
అభిప్రాయం
వ్యక్తం
అవుతుంది.
స్వేచ్ఛ
అంటే
బాధ్యతలేని
ప్రవర్తన
కాదని,
ఇదే
సమయంలో
సంస్కృతి
అంటే
బలవంతపు
నియమాలు
కాదని
కూడా
అభిప్రాయం
ఉంది.
సంస్కృతి
పట్ల
అవగాహనతో
వ్యక్తిగత
స్వేచ్చతో
వస్త్ర
ధారణ
ఉండాలి
మహిళల
వస్త్రధారణను
నియంత్రించాల్సిన
అవసరం
లేదని,
అలాగని
సమాజాన్ని
పూర్తిగా
విస్మరించడం
మంచిది
కాదు
అన్న
అభిప్రాయం
కూడా
వ్యక్తం
అవుతుంది.
సంస్కృతి
పట్ల
అవగాహనతో,
స్వేచ్ఛకు
గౌరవాన్ని
ఇస్తూ
వస్త్రధారణ
ఉండడంలో
తప్పు
లేదబె
అభిప్రాయం
ఉంది.


