India
oi-Jakki Mahesh
దశాబ్దాల
నిరీక్షణకు
ఎట్టకేలకు
తెరపడింది.
శివసైనికులు,
మహారాష్ట్ర
నవనిర్మాణ
సేన
కార్యకర్తలు
ఎప్పుడెప్పుడా
అని
ఎదురుచూస్తుండగా..
థాక్రే
సోదరులు
ఎట్టకేలకు
ఏకమయ్యారు.
మహారాష్ట్ర
రాజకీయాలను
మలుపు
తిప్పుతూ
ఉద్ధవ్
థాకరే,
రాజ్
థాకరే
అధికారికంగా
పొత్తును
ప్రకటించారు.
బాలాసాహెబ్
సాక్షిగా
ఒక్కటైన
కుటుంబం
బుధవారం
ముంబైలోని
వర్లీలో
జరిగిన
ఉమ్మడి
విలేకరుల
సమావేశంలో
ఈ
చారిత్రాత్మక
ప్రకటన
వెలువడింది.
దీనికి
ముందు
ఉద్ధవ్,
రాజ్
థాక్రేలు
తమ
కుటుంబ
సభ్యులతో
(రష్మీ
థాక్రే,
షర్మిల
థాక్రే,
ఆదిత్య
థాక్రే,
అమిత్
థాక్రే)
కలిసి
దాదర్‌లోని
శివాజీ
పార్కుకు
వెళ్లారు.
అక్కడ
శివసేన
వ్యవస్థాపకులు
బాలాసాహెబ్
థాక్రే
స్మారకం
వద్ద
నివాళులర్పించి,
ఆశీస్సులు
తీసుకున్నారు.
అనంతరం
ఒకే
కారులో
ప్రెస్
కాన్ఫరెన్స్‌కు
చేరుకోవడం
విశేషం.
ముంబై
మేయర్
‘మరాఠీ’నే
కావాలి:
రాజ్
థాక్రే
మహారాష్ట్ర
నవనిర్మాణ
సేన
(MNS)
అధినేత
రాజ్
థాక్రే
మాట్లాడుతూ..
శివసేన
(UBT),
మహారాష్ట్ర
నవనిర్మాణ
సేన
పొత్తును
అధికారికంగా
ఖరారు
చేశారు.
వివాదాల
కంటే
మహారాష్ట్ర
ప్రయోజనాలే
మాకు
ముఖ్యమని
ఆయన
పేర్కొన్నారు.
సీట్ల
పంపకంపై
ఇప్పుడే
స్పందించనని
చెబుతూ..
“ముంబై
మేయర్
పీఠంపై
మరాఠీ
వ్యక్తే
కూర్చుంటారు,
అది
మా
కూటమి
నుంచే
జరుగుతుందని
ధీమా
వ్యక్తం
చేశారు.
పరోక్షంగా
బీజేపీపై
విమర్శలు
చేస్తూ..
అభ్యర్థులను
దొంగిలించే
ముఠాలు
తిరుగుతున్నాయని
ఎద్దేవా
చేశారు.
ముంబైని
ముక్కలు
చేయనివ్వం:
ఉద్ధవ్
థాక్రే
బీజేపీపై
ఉద్ధవ్
థాక్రే
తీవ్రస్థాయిలో
విరుచుకుపడ్డారు.
బీజేపీ
ముంబైని
ముక్కలు
చేయాలని
చూస్తోందని
ఆయన
ఆరోపించారు.”మరాఠీ
పార్టీలు
విడివిడిగా
కొట్లాడితే
అది
అమరవీరులకు
అవమానం
అవుతుంది.
అందుకే
మన
వారసత్వాన్ని
కాపాడుకోవడానికి
మేము
ఒక్కటయ్యాం”
అని
ఉద్ధవ్
భావోద్వేగంగా
పిలుపునిచ్చారు.
ఇప్పుడు
ముంబై
వైపు
కన్నెత్తి
చూసే
వారి
రాజకీయ
భవిష్యత్తు
ముగిసినట్లేనని
హెచ్చరించారు.
7
నగరాల్లో
పోటీకి
సిద్ధం
ఈ
రెండు
పార్టీలు
కలిసి
ముంబై,
పుణె,
నాసిక్
వంటి
7
ప్రధాన
మున్సిపల్
కార్పొరేషన్
(BMC)
ఎన్నికల్లో
పోటీ
చేయనున్నాయి.
జనవరి
15న
జరగనున్న
ఈ
ఎన్నికల్లో
‘మరాఠీ
అస్మిత’
వర్సెస్
‘బీజేపీ
హిందుత్వ/అభివృద్ధి’
మధ్య
పోరు
ఆసక్తికరంగా
మారనుంది.


