India
oi-Kannaiah
అస్సాంలోని
పశ్చిమ
కర్బీ
ఆంగ్లాంగ్
జిల్లాలో
గత
రెండు
రోజులుగా
చోటుచేసుకుంటున్న
తీవ్ర
హింసాకాండతో
ఆ
ప్రాంతం
రణరంగంగా
మారింది.
పరిస్థితి
చేయి
దాటిపోవడంతో
శాంతిభద్రతలను
అదుపులోకి
తెచ్చేందుకు
ప్రభుత్వం
బుధవారం
(డిసెంబర్
24,
2025)
నాడు
సైన్యాన్ని
(Army)
రంగంలోకి
దించింది.
ఈ
ఘర్షణల్లో
ఇప్పటివరకు
ఇద్దరు
మరణించగా,
38
మంది
పోలీసులతో
సహా
మొత్తం
45
మంది
గాయపడ్డారు
సైన్యం
పహారా
–
డీజీపీ
హెచ్చరిక
హింస
తీవ్ర
రూపం
దాల్చిన
ఖేరోని
ప్రాంతాన్ని
అస్సాం
డీజీపీ
హర్మీత్
సింగ్
సందర్శించారు.ఆర్మీ
బలగాలు
ఇప్పటికే
ఫ్లాగ్
మార్చ్
నిర్వహించాయని…ప్రస్తుతం
పరిస్థితి
పూర్తిగా
అదుపులోనే
ఉందని
ఆయన
స్పష్టం
చేశారు.పెడదోవ
పట్టిన
యువతకు
పెద్దలు
నచ్చజెప్పాలని,
హింస
వల్ల
సమస్యలు
పరిష్కారం
కావని,
చర్చల
ద్వారానే
సాధ్యమని
పిలుపునిచ్చారు.హింసకు
పాల్పడిన
వారిని
గుర్తించి
కఠినంగా
శిక్షిస్తామని,
అయితే
ప్రస్తుతం
పరిస్థితిని
చక్కదిద్దడమే
తమ
ప్రాధాన్యత
అని
డీజీపీ
పేర్కొన్నారు.
స్పందించిన
సీఎం
అస్సాంలోని
కర్బీ
ఆంగ్లాంగ్
జిల్లాలో
చెలరేగిన
హింసలో
ఇప్పటికే
ఇద్దరు
మృతి
చెందారు.
దీనిపై
స్పందించిన
సీఎం
హిమాంత
బిస్వ
శర్మ..
ఈరోజు
పరిస్థితి
అదుపులో
ఉందని
చెప్పారు.ప్రభుత్వం
తరపున
సీనియర్
అధికారులు
అక్కడ
ఉండి
పరిస్థితిని
సమీక్షిస్తున్నారని
చెప్పిన
సీఎం…
ఇరు
వర్గాలు
శాంతియుత
వాతావరణం
నెలకొనేందుకు
చర్చలు
జరుపుతున్నాయని
వెల్లడించారు.
జనాలు
వీధుల్లో
తిరుగుతున్నారని,
షాపింగ్
చేసుకుంటున్నారని
వివరించారు.
రానున్న
రోజుల్లో
పరిస్థితి
మరింత
చక్కబడి
సాధారణ
స్థితికి
చేరుకుంటుందన్న
విశ్వాసం
ఆయన
వ్యక్తం
చేశారు.
హింస
చెలరేగిన
సందర్భంగా
దుకాణాలు,
ఇళ్లకు
ఆందోళనకారులు
నిప్పు
పెట్టగా
అందులో
చిక్కుకున్న
ఒక
దివ్యాంగుడు
బయటకు
రాలేక
ప్రాణాలు
వదిలాడు.
నిన్న
జరిగిన
పోలీసుల
కాల్పుల్లో
మరో
వ్యక్తి
మృతి
చెందాడు.
మొత్తంగా
ఇద్దరు
మృతి
చెందగా..
పలువురికి
గాయాలయ్యాయి.
ఎందుకు
ఈ
ఉద్రిక్తత?
అస్సాంలోని
గిరిజన
బెల్టుల్లో
స్థానిక
సంస్కృతి,
భూమి
మరియు
ఉపాధిని
కాపాడుకోవాలనే
తపన
గిరిజనుల్లో
ఎక్కువగా
ఉంటుంది
.
ఈ
హింసాకాండ
వెనుక
దశాబ్దాల
నాటి
భూ
వివాదం
ఉంది.
గిరిజన
ప్రాంతాల్లోని
విలేజ్
గ్రేజింగ్
రిజర్వ్
(VGR)
మరియు
ప్రొఫెషనల్
గ్రేజింగ్
రిజర్వ్
(PGR)
భూముల్లో
బీహార్‌కు
చెందిన
వారు
అక్రమంగా
నివాసం
ఉంటున్నారని,
వారిని
వెంటనే
ఖాళీ
చేయించాలని
కర్బీ
సామాజికవర్గానికి
చెందిన
ఆందోళనకారులు
గత
15
రోజులుగా
నిరాహార
దీక్ష
చేస్తున్నారు.
అక్రమ
వలసదారుల
వల్ల
తమ
ఉనికికే
ముప్పు
కలుగుతోందని
గిరిజన
సంఘాలు
ఆందోళన
చెందుతున్నాయి.తాజా
హింసాకాండ
ఈ
దీర్ఘకాలిక
అసంతృప్తికి
పరాకాష్టగా
నిలిచింది.


