India
oi-Jakki Mahesh
Eggs
Price:
చలికాలం
ప్రారంభం
కావడంతో
దేశవ్యాప్తంగా
గుడ్ల
ధరలు
ఆకాశాన్ని
తాకుతున్నాయి.
గతంలో
ఎన్నడూ
లేని
విధంగా
రీటైల్
మార్కెట్లో
ఒక్కో
గుడ్డు
ధర
8
రూపాయల
నుంచి
12
రూపాయల
వరకు
పలుకుతోంది.ఢిల్లీ,
ముంబై,
లక్నో,
హైదరాబాద్
వంటి
ప్రధాన
నగరాల్లో
సామాన్యుడికి
గుడ్డు
భారంగా
మారింది.
ప్రతి
ఏటా
చలికాలంలో
గుడ్లకు
డిమాండ్
పెరగడం
సాధారణమే
అయినా,
ఈ
ఏడాది
ధరలు
గత
రికార్డులను
చెరిపివేస్తున్నాయి.
దీనికి
ప్రధానంగా
మూడు
కారణాలు
కనిపిస్తున్నాయి.
1.
విపరీతంగా
పెరిగిన
డిమాండ్
చలి
తీవ్రత
పెరగడంతో
దేశవ్యాప్తంగా
గుడ్ల
వినియోగం
పెరిగింది.
ఒక్క
ఉత్తరప్రదేశ్
రాష్ట్రానికే
రోజుకు
5.5
నుంచి
6
కోట్ల
గుడ్ల
అవసరం
ఏర్పడుతోంది.
ఇందులో
దాదాపు
4
కోట్ల
గుడ్లను
ఇతర
రాష్ట్రాల
నుంచి
దిగుమతి
చేసుకోవాల్సి
వస్తోంది.
డిమాండ్‌కు
తగ్గట్టుగా
సరఫరా
లేకపోవడంతో
ధరలు
ఎగబాకుతున్నాయి.
2.
తగ్గిన
ఉత్పత్తి
పౌల్ట్రీ
రంగ
నిపుణుల
అభిప్రాయం
ప్రకారం..
గత
కొన్ని
ఏళ్లుగా
కోళ్ల
దాణా
(మక్కజొన్న,
సోయాబీన్)
ధరలు
పెరిగినప్పటికీ,
రైతులకు
గుడ్డుపై
ఆశించిన
లాభాలు
రాలేదు.
దీనివల్ల
నష్టాలు
భరించలేక
చాలామంది
రైతులు
పౌల్ట్రీ
ఫారమ్‌లను
మూసివేశారు.
ఫలితంగా
గుడ్ల
ఉత్పత్తి
గణనీయంగా
తగ్గిపోయింది.
3.
రవాణా
ఖర్చులు
హోల్
సేల్
మార్కెట్‌లో
గుడ్డు
ధర
సుమారు
7.5
రూపాయల
వరకు
ఉంది.
దీనికి
రవాణా
ఖర్చులు,
ఇతర
పన్నులు
తోడవ్వడంతో
రిటైల్
షాపుల్లో
వినియోగదారుడికి
8
నుంచి
10
రూపాయల
కంటే
తక్కువకు
దొరకడం
లేదు.
ముఖ్యమైన
అంశాలు
*అత్యంత
చౌకైన
మార్కెట్:
దేశంలోనే
అతిపెద్ద
గుడ్ల
మార్కెట్లుగా
పేరుగాంచిన
తమిళనాడులోని
నమక్కల్,
కర్ణాటకలోని
హోస్పేట్
లలో
100
గుడ్ల
హోల్
సేల్
ధర
రూ.
640-645
వరకు
ఉంది.
జనవరిలో
మరింత
భారం:
జనవరిలో
చలి
తీవ్రత
ఇంకా
పెరుగుతుంది
కాబట్టి,
ధరలు
మరో
25శాతం
నుంచి
50శాతం
వరకు
పెరిగే
అవకాశం
ఉందని
మార్కెట్
వర్గాలు
అంచనా
వేస్తున్నాయి.
ఉపశమనం
ఎప్పుడు?:
ఫిబ్రవరి
నుండి
వాతావరణంలో
మార్పులు
వస్తేనే
ధరలు
తగ్గే
అవకాశం
ఉంది.
“ప్రస్తుతం
గుడ్డు
ధర
8
రూపాయలు
ఉండటం
రైతులకు
మేలు
చేసే
అంశమే.
దాణా
ధరలు
పెరిగినా
గుడ్డు
ధర
పెరగకపోతే
భవిష్యత్తులో
గుడ్ల
కొరత
మరింత
తీవ్రమయ్యేది.
ప్రపంచంలోనే
అత్యంత
చౌకగా
గుడ్లు
దొరికే
దేశం
భారత్
మాత్రమే.”
అని
పౌల్ట్రీ
ఫెడరేషన్
ఆఫ్
ఇండియా
అధ్యక్షుడు
పేర్కొన్నారు.


