Train Fares Hike: రేపటి నుంచే రైల్వే టికెట్ ఛార్జీల పెంపు..! ఎంతో తెలుసా ?

Date:


India

oi-Syed Ahmed

దేశవ్యాప్తంగా
రైల్వే
ఛార్జీల
పెంపుకు
రంగం
సిద్దమైంది.
రేపటి
నుంచి
కొత్త
రైల్వే
ఛార్జీలు
అమల్లోకి
వస్తాయని
రైల్వేశాఖ
ఇప్పటికే
ప్రకటించింది.
వివిధ
రకాల
రైళ్లలో
వివిధ
రూపాల్లో

టికెట్
రేట్ల
పెరుగుదల
ఉండబోతోంది.

ఛార్జీల
పెంపు
ద్వారా

ఆర్ధిక
సంవత్సరం
ముగింపు
కల్లా
అంటే
2026
మార్చి
31
కల్లా
రూ.600
కోట్లు
అదనంగా
సంపాదించాలని
రైల్వే
శాఖ
లక్ష్యంగా
పెట్టుకుంది.

నేపథ్యంలో
రైల్వే
ఛార్జీల
పెంపుకు
ప్రయాణికులు
సిద్దం
కావాల్సిందే.

తాజాగా
పెరగనున్న
రైల్వే
ఛార్జీలు
రేపటి
నుంచి
వర్తించబోతున్నాయి.
వీటిలో
రైళ్లలో
జనరల్
టికెట్లకు
215
కి.మీ
కంటే
ఎక్కువ
దూరం
ప్రయాణించే
ప్రయాణాలకు
కిలోమీటరుకు
1
పైసా
అదనపు
ఛార్జీ
విధిస్తున్నారు.
అయితే
మెయిల్,
ఎక్స్‌ప్రెస్
సర్వీసులకు
నాన్-ఏసీ,
ఏసీ
తరగతులకు
కిలోమీటరుకు
2
పైసల
పెరుగుదల
ఉంటుంది.

లెక్కన
చూస్తే
500
కి.మీ
నాన్-ఏసీ
ట్రిప్‌కు
అదనంగా
రూ.10
ఖర్చవుతుంది.
215
కి.మీ
కంటే
తక్కువ
దూరం
ప్రయాణించే
మార్గాలకు
ఛార్జీలు
పెరగట్లేదు.

పేద,
మధ్యతరగతి
ఆదాయ
వర్గాలకు
కూడా
ఇందులో
ఊరట
లభించనుంది.
ప్రతీ
నెలా
వారు
తీసుకునే
సీజనల్
సబర్బన్
,
నెలవారీ
టిక్కెట్లకు
ఛార్జీల
పెంపు
వర్తింపజేయడం
లేదని
రైల్వేశాఖ
ప్రకటించింది.
పదేళ్లుగా
రైల్వేలు
తమ
నెట్
వర్క్
పెంచుకోవడం,
మారుమూల
ప్రాంతాలకు
సైతం
విస్తరించడం
జరుగుతోందని,
దీనికి
మరింత
ప్రోత్సాహం
ఇచ్చేలా

టికెట్
రేట్లు
పెంచుతున్నట్లు
రైల్వేశాఖ
చెబుతోంది.

వాస్తవానికి
రైల్వే
శాఖ
మొత్తం
నిర్వహణ
వ్యయం
ఏటా
2.63
లక్షల
కోట్లు
దాటిపోయింది.
ఇందులో
ఉద్యోగుల
జీత
భత్యాలకు
1.15
లక్షల
కోట్లు,
పెన్షన్లకు
60
వేల
కోట్లు
ఖర్చవుతోంది.
దీంతో
పెరుగుతున్న
ఖర్చులను
తట్టుకునేందుకు
రైల్వేలు
ప్రయాణీకుల
ఛార్జీలలో
స్వల్ప
మార్పులు
చేస్తున్నట్లు
రైల్వే
చెబుతోంది.
అలాగే
కార్గో
లోడింగ్‌ను
పెంచుకుంటున్నట్లు
తెలిపింది.
తాజాగా
పండుగల
సీజన్‌లో
12
వేలకు
పైగా
ప్రత్యేక
రైళ్లను
రైల్వే
శాఖ
విజయవంతంగా
నడిపింది.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related