Telangana
oi-Dr Veena Srinivas
తెలంగాణ
రాష్ట్రంలో
రైతులను
రాజులను
చేయాలని
తెలంగాణ
ప్రభుత్వం
అనేక
నిర్ణయాలను
తీసుకుంటోంది.
రాష్ట్రంలో
కూరగాయల
రైతుల
ఆర్థిక
బలోపేతానికి
కృషి
చేస్తున్న
తెలంగాణ
ప్రభుత్వం
రాష్ట్ర
వ్యాప్తంగా
ప్రతి
50
కిలోమీటర్లకు
ఒకటి
చొప్పున
ముఖ్యంగా
ప్రధాన
మండల
కేంద్రాలలో
లోకల్
మార్కెట్ల
ఏర్పాటుకు
ప్రణాళికలను
సిద్ధం
చేస్తుంది.
ఉద్యాన
రైతుల
కోసం
లోకల్
మార్కెట్లు
రాష్ట్రవ్యాప్తంగా
ఉద్యాన
పంటల
వాటా
ఏడు
శాతం
ప్రస్తుతం
కొనసాగుతున్న
క్రమంలో
ప్రతి
సంవత్సరం
42.56
లక్షల
టన్నుల
దిగుబడి
వస్తున్నా
రైతులకు
దానికి
ఫలితం
ఆశించిన
మేర
రావడం
లేదని
గుర్తించిన
ప్రభుత్వం
దీనికోసం
నిర్ణయం
తీసుకుంది.
విక్రయ
వసతులు
లేక
రైతులు
ఇబ్బంది
పడుతున్నది
గుర్తించి
రైతులకు
నేరుగా
విక్రయ
వసతులను
కల్పించడం
కోసం
లోకల్
మార్కెట్లను
ఏర్పాటు
చేయనుంది.
నగరాలకే
పరిమితమైన
రైతు
బజార్లు
ప్రస్తుతం
రాష్ట్రంలో
ఉన్న
36
రైతు
బజార్లు
నగరాలకు
పరిమితం
కావడంతో
గ్రామీణ
రైతులు
రవాణా
ఖర్చులు
భరించలేక
స్థానిక
దళారులకు
తక్కువ
ధరకు
ఉత్పత్తులను
విక్రయిస్తున్నారు.
కూరగాయలు
త్వరగా
పాడవుతాయి
కాబట్టి,
నిల్వ
సౌకర్యాలు
లేక
రోజువారి
అమ్మకాల
ఒత్తిడిని
వారు
ఎదుర్కొంటున్నారు.
కాబట్టి
ఆ
సమస్యలను
పరిష్కరించి
మండల
స్థాయిలో
లోకల్
మార్కెట్లు
ఏర్పాటు
చెయ్యాలని
భావించారు.
ఇప్పటికే
ఈ
ప్రాంతాలలో
లోకల్
మార్కెట్
లు
సక్సెస్
జాతీయ,
రాష్ట్ర,
జిల్లా
రహదారులకు
చేరువగా
ఉండేలా
నిర్మాణం
చేసి
అందుబాటులోకి
తీసుకువస్తే
రైతుల
సమస్య
పరిష్కారం
అవుతుందని
భావిస్తున్నారు.
ఈ
లోకల్
మార్కెట్లతో
రైతులు
తాజా
కూరగాయలను
నేరుగా
విక్రయించుకునే
అవకాశం
ఉంటుందని
భావిస్తున్నారు.
ఇప్పటికే
ఒంటిమామిడి,
అంకాపూర్,
జగిత్యాల,
జహీరాబాద్
వంటి
ప్రాంతాలలో
ఇటువంటి
మార్కెట్లు
సక్సెస్
అయినట్టుగా
గుర్తించిన
ప్రభుత్వం,
రాష్ట్రవ్యాప్తంగా
మధ్యవర్తుల
ప్రమేయం
లేకుండా
ఉండేలా
ఇలానే
మార్కెట్లను
ఏర్పాటు
చేయాలని
భావిస్తుంది.
స్థల
సేకరణకు
మార్కెటింగ్
శాఖకు
ఆదేశం
తద్వారా
రైతులకు
గిట్టుబాటు
ధర
కల్పించడంతో
పాటు
వినియోగదారులకు
నాణ్యమైన
తాజా
కూరగాయలను
తక్కువ
ధరకు
ఇచ్చే
వీలు
కలుగుతుంది.
ఇప్పటికే
కూరగాయలు
అధికంగా
పండే
ప్రాంతాలలో
స్థల
సేకరణ
చేపట్టాలని
మార్కెటింగ్
శాఖ
అధికారులను
ప్రభుత్వం
ఆదేశించింది.
ఈ
కొత్త
మార్కెటింగ్
వ్యవస్థ
అందుబాటులోకి
వస్తే
తెలంగాణలో
కూరగాయలను
సాగు
చేసే
రైతుల
సంఖ్య
పెరిగే
అవకాశం
ఉంటుంది.
ఉద్యాన
రంగానికి
మంచి
ప్రోత్సాహం
ఇచ్చినట్టు
అవుతుంది.


