India
oi-Jakki Mahesh
ఉత్తరప్రదేశ్‌లోని
పిలిభిత్
జిల్లాలో
శుక్రవారం
అర్ధరాత్రి
పెనుప్రమాదం
తప్పింది.
దట్టమైన
పొగమంచు
కారణంగా
దారి
తెలియక
ఓ
కారు
నలుగురు
యువకులతో
సహా
శారదా
నదిలో
పడిపోయింది.
అయితే
నది
ఒడ్డున
ఉన్న
సాధువులు,
ఒక
స్థానిక
గజ
ఈతగాడు
చూపిన
తెగువ
వల్ల
నలుగురు
ప్రాణాలతో
బయటపడ్డారు.
అసలేం
జరిగిందంటే?
శాంతినగర్‌కు
చెందిన
అభిషేక్
కుమార్
తన
స్నేహితులు
అర్జున్
గుప్తా,
ఆదిత్య
వర్మ,
అనంత్
రఘువంశీలతో
కలిసి
ఖతిమాలో
ఓ
కార్యక్రమానికి
వెళ్లి
తిరిగి
వస్తున్నారు.
ధనారాఘాట్
సమీపానికి
చేరుకోగానే
పొగమంచు
తీవ్రత
పెరిగి
ఏమీ
కనిపించకుండా
పోయింది.
కారు
అదుపు
తప్పి
నలుగురు
యువకులతో
సహా
శారదా
నదిలో
పడిపోయింది.
కారు
నీటిలో
మునుగుతుండటంతో
యువకులు
అద్దాలు
పగలగొట్టి
కారు
పైకప్పు
మీదకు
ఎక్కి
ప్రాణాల
కోసం
ఆర్తనాదాలు
చేశారు.
ఆ
సమయంలో
నది
ఒడ్డున
తపస్సు
చేస్తున్న
సాధువులు
ఆ
అరుపులు
విని
వెంటనే
అప్రమత్తమయ్యారు.
వారు
వెంటనే
స్థానిక
గజ
ఈతగాడు
బబ్లూ
మాంఝీని
పిలిపించారు.
బబ్లూ
ఏమాత్రం
ఆలస్యం
చేయకుండా
గడ్డకట్టే
చలిలో
నదిలోకి
దూకాడు.
సాధువుల
సహకారంతో
ఒక్కొక్కరిని
సురక్షితంగా
ఒడ్డుకు
చేర్చాడు.
దేవుడి
రూపంలో
వచ్చిన
సాధువులు,
బబ్లూ
తన
ప్రాణాలను
కాపాడారని
ఆ
యువకులు
కన్నీటి
పర్యంతమయ్యారు.
అధికారుల
హెచ్చరిక
సమాచారం
అందుకున్న
పోలీసులు
ఘటనా
స్థలానికి
చేరుకుని
యువకులకు
ప్రాథమిక
చికిత్స
అందించారు.
కారును
క్రేన్
సహాయంతో
బయటకు
తీశారు.
ధనారాఘాట్
పాంటూన్
వంతెనపై
వాహనాల
రాకపోకలు
ప్రారంభమై
రెండు
రోజులే
కావడంతో,
అక్కడ
తగిన
సంకేతాలులేకపోవడం
వల్లే
ఈ
ప్రమాదం
జరిగిందని
స్థానికులు
చెబుతున్నారు.
రాత్రి
వేళ
ఈ
మార్గంలో
ప్రయాణించడం
క్షేమకరం
కాదని
అధికారులు
హెచ్చరించారు.


