Telangana
oi-Dr Veena Srinivas
ఏపీ
ఉపముఖ్యమంత్రి
పవన్
కళ్యాణ్
జనవరి
3వ
తేదీన
తెలంగాణ
రాష్ట్రంలోని
సుప్రసిద్ధ
కొండగట్టు
ఆంజనేయ
స్వామి
ఆలయాన్ని
సందర్శించనున్నారు
ఈ
మేరకు
ఆయన
పర్యటన
షెడ్యూల్
ఖరారు
అయింది.
ఈ
సందర్భంగా
పవన్
కళ్యాణ్
స్వామివారిని
దర్శించుకుని
ప్రత్యేక
పూజలు
నిర్వహించనున్నారు.
అంతేకాదు
ఇటీవల
తిరుమల
తిరుపతి
దేవస్థానం
35.19
కోట్ల
నిధులతో
చేపట్టనున్న
ఆలయ
అభివృద్ధి
పనులకు
భూమిపూజ
చేస్తారు.
కొండగట్టు
అభివృద్ధి
పనులకు
పవన్
కళ్యాణ్
భూమి
పూజ
పవిత్రమైన
మార్గశిర
పౌర్ణమి
రోజున
ఈ
అభివృద్ధిపనులు
పవన్
కళ్యాణ్
చేతుల
మీదుగా
ప్రారంభం
కానున్నాయి
.ఈ
నిధులతో
100గదుల
అత్యాధునిక
ధర్మశాల
నిర్మాణం,
అలాగే
2,000మంది
భక్తులు
ఒకేసారి
హనుమాన్
దీక్ష
విరమించే
భారీ
మండపం
నిర్మాణం
చేయనున్నారు.
సుదూర
ప్రాంతాల
భక్తుల
సౌకర్యార్థం
ప్రత్యేక
వసతి
గృహాలు
కూడా
ఈ
ప్రణాళికలో
నిర్మించనున్నారు.
ఈ
ప్రాజెక్టులు
ఆలయ
మౌలికవసతులను,
భక్తుల
సౌకర్యాలను
మెరుగుపరచడం
లక్ష్యంగా
ఉన్నాయి.
కొండగట్టు
ఆలయానికి
పవన్
కళ్యాణ్
కు
ప్రత్యేక
అనుబంధం
కొండగట్టు
ఆంజనేయస్వామి
ఆలయంతో
పవన్
కళ్యాణ్
కు
చాలా
ప్రత్యేక
అనుబంధం
ఉంది.
గతంలో
వారాహి
వాహనం
ఎన్నికల
ప్రచార
రథం
పూజ
కూడా
కొండగట్టు
ఆంజనేయ
స్వామీ
ఆలయంలో
చేశారు.
ఆంధ్రప్రదేశ్
రాజకీయాలకు
సంబంధించి
ఎన్డీఏ
కూటమి
పార్టీలతో
పొత్తును
ఆయన
ఇదే
ఆలయం
నుంచి
ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్
సార్వత్రిక
ఎన్నికల్లో
కూటమి
భారీ
విజయం
సాధించిన
తరుణంలో
కూడా
పవన్
కళ్యాణ్
కొండగట్టును
సందర్శించడం
విశేషం.
పవన్
కళ్యాణ్
ఇచ్చిన
మాటకు
కట్టుబడి
టీటీడీ
నిధులు
ఈ
పర్యటనకు
రాజకీయంగా,
ఆధ్యాత్మికంగా
రెండింటికీ
ఎంతో
ప్రాధాన్యం
ఉంది.
ఏపీ
డిప్యూటీ
సీఎం
పవన్
కళ్యాణ్
కొండగట్టు
అంజన్న
ఆలయానికి
సంబంధించి
పవన్
కల్యాణ్
రాకతో
భక్తులు,
ఆయన
అభిమానులు
భారీగా
తరలి
వచ్చే
అవకాశం
ఉందని
అధికారులు
అంచనా
వేస్తున్నారు.
అయితే
కొండగట్టు
ఆంజనేయస్వామి
ఆలయ
అభివృద్ధికి
తన
వంతు
సాయం
చేస్తానని
మాటిచ్చిన
పవన్
కళ్యాణ్
ఇచ్చిన
మాటకు
కట్టుబడి
టీటీడీ
నిధులను
ఇచ్చేలా
చేశారు.


