‘న్యూ ఇయర్ గిఫ్ట్’ అంటూ లింక్ వచ్చిందా.. తస్మాత్ జాగ్రత్త ?

Date:


India

-Korivi Jayakumar

నూతన
సంవత్సరం
వేళ
‘హ్యాపీ
న్యూఇయర్’
శుభాకాంక్షలు
అంటూ
మెసేజ్
లు
రావడం
సహజమే.
కానీ
ఇప్పుడు
దీన్ని
కూడా
సైబర్
నేరగాళ్లు
టార్గెట్
గా
మార్చుకున్నారు.
గిఫ్ట్స్,
బ్యాంక్
ఆఫర్లు,
ప్రయాణ
రాయితీలు,
ఈవెంట్
టిక్కెట్ల
పేరిట
నకిలీ
లింక్‌లు..
వాట్సప్,
ఎస్‌ఎంఎస్‌
లతో
ప్రజలను
బురిడీ
కొట్టించేందుకు
రెడీ
అవుతున్నారు.

క్రమంలోనే
వాటిని
క్లిక్
చేస్తే
హానికరమైన
యాప్‌లు
ఇన్‌స్టాల్
అయి..
ఓటీపీలు,
బ్యాంక్
వివరాలు
చోరీకి
గురై..
వాట్సప్
ఖాతా
దుర్వినియోగం
కాగలదని
సైబర్‌
బ్యూరో
హెచ్చరించింది.

అనుమానాస్పద
లింక్‌లను
క్లిక్
చేయవద్దని
సైబర్
నిపుణులు
సూచిస్తున్నారు.
మోసం
జరిగితే
వెంటనే
1930కు
కాల్
చేసి
లేదా
cybercrime.gov.inలో
ఫిర్యాదు
చేయాలని
కోరుతున్నారు.
పండుగను
ఆసరాగా
చేసుకుని
సైబర్
నేరగాళ్లు
నకిలీ
బహుమతి
లింక్‌లు
పంపుతారని
ముందు
జాగ్రత్తగా
సూచిస్తున్నారు.

కాగా
సదరు
లింక్‌లపై
క్లిక్
చేయగానే
APK
ఫైల్
రహస్యంగా
ఇన్‌స్టాల్
అయి..
ఓటీపీలు,
బ్యాంకింగ్
వివరాలు,
కాంటాక్టులు,
ఫోటోలు,
వాట్సప్‌ను
యాక్సెస్
చేస్తుందని
వివరిస్తున్నారు.
ఇన్‌స్టాల్
అయిన
యాప్
బ్యాక్‌గ్రౌండ్‌లో
పనిచేస్తూ,
ఓటీపీలు,
మెసేజ్‌లు,
కాంటాక్టులు,
వాట్సప్
సెషన్‌లను
అనధికారికంగా
యాక్సెస్
చేసి,
బాధితుడి
ఖాతాను
దుర్వినియోగం
చేస్తుందని
వెల్లడించారు.

నకిలీ
లింక్‌పై
క్లిక్
చేసి
అనుమానాస్పద
యాప్‌ను
ఇన్‌స్టాల్
చేసినట్లయితే..
వెంటనే
మొబైల్
డేటా,
వైఫైలను
ఆపివేయాలన్నారు.

అనుమానాస్పద
యాప్‌ను
తక్షణమే
అన్‌ఇన్‌స్టాల్
చేసి..
మెసేజ్‌లు,
లింక్‌లు,
పాప్‌అప్స్
స్క్రీన్‌షాట్‌లు,
ట్రాన్సాక్షన్
ఐడీలు,
యూటీఆర్
నంబర్‌లు,
కాల్
లాగ్‌లు,
చాట్
హిస్టరీ
వంటి
వివరాలు
నమోదు
చేయాలని
స్పష్టం
చేశారు

వాట్సప్‌లో
‘లింక్డ్
డివైజెస్’ను
తనిఖీ
చేసి..
తెలియని
వాటిని
తొలగించాలని
తెలిపారు.
వాట్సప్,
ఈమెయిల్,
బ్యాంకింగ్,
సోషల్
మీడియా
పాస్‌వర్డ్‌లను
మార్చాలని..
నగదు
లావాదేవీలు
జరిగితే
బ్యాంక్/పేమెంట్
యాప్‌కు
సమాచారం
ఇవ్వడం
తప్పనిసరి
అని
కోరారు.
యాప్‌లను
అధికారిక
స్టోర్‌ల
నుండి
మాత్రమే
డౌన్‌లోడ్
లేదా
అప్‌డేట్
చేయాలని
అధికారులు
సూచించారు.
ప్రజలు
అప్రమత్తంగా
ఉండాలని
వివరించారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related