Business
oi-Kannaiah
భారత
విమానయాన
రంగంలో
సరికొత్త
శకం
మొదలైంది.
కేంద్ర
పౌర
విమానయాన
శాఖ
మంత్రి
కింజరాపు
రామ్మోహన్
నాయుడు
గ్రీన్
సిగ్నల్
ఇవ్వడంతో,
దేశీయ
గగనతలంపైకి
మూడు
కొత్త
విమాన
సంస్థలు
రాబోతున్నాయి.
ఇందులో
అందరి
దృష్టిని
ఆకర్షిస్తోంది
‘శంఖ్
ఎయిర్’.
ఉత్తరప్రదేశ్
రాష్ట్రం
నుంచి
వస్తున్న
మొట్టమొదటి
ఎయిర్‌లైన్
ఇది
కావడమే
కాకుండా,
దీని
వెనుక
ఉన్న
వ్యక్తి
జీవిత
ప్రయాణం
ఏ
సినిమా
కథకూ
తీసిపోదు.
ఎవరీ
శ్రవణ్
కుమార్
విశ్వకర్మ?
శంఖ్
ఎయిర్
వ్యవస్థాపకుడు
శ్రవణ్
కుమార్
విశ్వకర్మ
కథ
అసాధారణమైనది.
కాన్పూర్‌లో
ఒక
మధ్యతరగతి
కుటుంబంలో
జన్మించిన
శ్రవణ్,
చదువుపై
ఆసక్తి
లేక
మధ్యలోనే
పాఠశాల
మానేశారు.
ఆర్థిక
ఇబ్బందుల
వల్ల
ఒకప్పుడు
కాన్పూర్
వీధుల్లో
టెంపో
కూడా
నడిపారు.
సైకిళ్ళు,
బస్సులు,
రైళ్లు,
టెంపోలు..
ఇలా
సామాన్యుడు
ప్రయాణించే
ప్రతి
వాహనంపై
ఆయనకు
అనుభవం
ఉంది.
అదే
అనుభవం
ఈరోజు
ఆయనను
ఒక
విమానయాన
సంస్థకు
యజమానిని
చేసింది.
టెంపో
డ్రైవర్
నుంచి
టెక్కు
దాకా..
టెంపో
నడిపిన
రోజుల్లోనే
ఏదో
ఒకటి
సాధించాలనే
పట్టుదల
ఆయనలో
ఉండేది.
మొదట
స్టీల్
(TMT)
వ్యాపారంలో
అడుగుపెట్టి,
ఆ
తర్వాత
సిమెంట్,
మైనింగ్
రంగాల్లోకి
విస్తరించారు.
అంచెలంచెలుగా
ఎదుగుతూ
వందలాది
ట్రక్కులతో
ఒక
భారీ
ట్రాన్స్‌పోర్ట్
సామ్రాజ్యాన్ని
నిర్మించారు.
కానీ
ఆయన
కల
మాత్రం
ఇంకా
పెద్దది..
అదే
‘సామాన్యుడికి
కూడా
విమాన
ప్రయాణాన్ని
అందుబాటులోకి
తీసుకురావడం’.
శంఖ్
ఎయిర్
ప్రత్యేకతలేంటి?
-
తొలి
అడుగు:
ఉత్తరప్రదేశ్
నుంచి
వస్తున్న
తొలి
ప్రైవేట్
ఎయిర్‌లైన్. -
ముఖ్య
కేంద్రాలు:
లక్నో,
నోయిడా
(జెవార్
ఎయిర్‌పోర్ట్),
న్యూఢిల్లీ
కేంద్రంగా
విమానాలు
నడుస్తాయి. -
లక్ష్యం:
మధ్యతరగతి
ప్రజలకు
అందుబాటు
ధరల్లో,
నమ్మకమైన
సేవలను
అందించడం. -
వ్యూహం:
విమాన
ప్రయాణం
అనేది
విలాసం
కాదు,
అది
సమయాన్ని
ఆదా
చేసే
ఒక
అవసరమని
ఆయన
నమ్ముతారు.
మంత్రి
రామ్మోహన్
నాయుడు
శంఖ్
ఎయిర్‌తో
పాటు
అల్
హింద్
ఎయిర్,
ఫ్లై
ఎక్స్‌ప్రెస్
సంస్థలకు
కూడా
నో
అబ్జెక్షన్
సర్టిఫికేట్
(NOC)
మంజూరు
చేశారు.
2026
ప్రారంభంలో
ఈ
విమానాలు
గగనవిహారం
చేసే
అవకాశం
ఉంది.
“చదువు
లేదని
ఆగిపోలేదు..
పేదరికమని
వెనకడుగు
వేయలేదు..
రోడ్డు
మీద
టెంపో
నడిపిన
వాడికి
ఆకాశంలో
విమానం
నడపడం
అసాధ్యమేమీ
కాదు”
అని
శ్రవణ్
కుమార్
నిరూపించారు.
సామాన్యుల
కలలకు
రెక్కలు
తొడుగుతూ
వస్తున్న
‘శంఖ్
ఎయిర్’,
భారత
విమానయాన
రంగంలో
సరికొత్త
రికార్డులు
సృష్టిస్తుందని
శ్రవణ్
విశ్వాసం
వ్యక్తం
చేశారు.


