Andhra Pradesh
oi-Dr Veena Srinivas
ఏపీ
ప్రభుత్వం
రేషన్
కార్డులు
ఉన్నవారికి
కొత్త
సంవత్సరం
తొలిరోజు
నుంచే
శుభవార్త
అందించింది.
నూతన
సంవత్సరం
మరియు
సంక్రాంతి
కానుకగా
నేటినుండి
కిలో
గోధుమపిండిని
కేవలం
20
రూపాయలకే
అందించే
కార్యక్రమాన్ని
ప్రారంభించింది.
ఇప్పటికే
రేషన్
షాపులలో
బియ్యం,
చక్కెర,
జొన్నలు,
రాగులు
వంటి
నిత్యవసర
సరుకులను
అందిస్తోంది
ప్రభుత్వం.
రేషన్
కార్డు
దారులకు
శుభవార్త
పట్టణ
ప్రాంతాలలో
ఉన్న
రేషన్
కార్డుదారులకు
ప్రతినెల
కిలో
గోధుమపిండిని
పంపిణీ
చేయనుంది.
దీంతో
పేద,
మధ్యతరగతి
కుటుంబాలకు
అదనపు
ఆర్థికభరోసా
లభిస్తుంది.
ఈ
పథకాన్ని
మొదట
పట్టణ
ప్రాంతాలలోనూ,
ఆ
తర్వాత
గ్రామీణ
ప్రాంతాలలోనూ
అమలు
చేయాలని
అధికారులు
నిర్ణయం
తీసుకున్నారు.
రేషన్
ద్వారా
సరుకులు
తీసుకునే
రేషన్
కార్డుదారులకు
ఆరోగ్యాన్ని
అందించే
క్రమంలో
భాగంగా
ఆహారంలో
వైవిధ్యం
పెంచడానికి
బియ్యంతో
పాటు
రాగులు,
జొన్నలు
అందిస్తున్నారు.
బియ్యానికి
బదులుగా
రాగులు,
జొన్నలు..
నేటినుండి
గోధుమపిండి
ఉదాహరణకు
20
కిలోల
బియ్యం
తీసుకునేవారు
ఉంటే
వారు
అందులో
బియ్యం
కు
బదులుగా
మూడు
కిలోలు
తగ్గించుకుని
రాగులు,
జొన్నలు
తీసుకోవచ్చు.
రేషన్
షాప్
లలో
ఈ
విధానాన్ని
కొంతకాలంగా
అమలు
చేస్తున్నారు.
ప్రస్తుతం
నేటి
నుండి
గోధుమపిండిని
కూడా
అందించడానికి
నిర్ణయించిన
ప్రభుత్వం
పట్టణ
ప్రాంతాలలో
దీనిని
అమలు
చేస్తుంది.
20
రూపాయలకే
గోధుమపిండి
బహిరంగ
మార్కెట్లో
కిలో
గోధుమపిండి
60
రూపాయల
నుండి
65
రూపాయలు
ధరగా
ఉండగా
ప్రభుత్వం
కేవలం
20
రూపాయలకే
గోధుమపిండిని
అందిస్తోంది.
ఇదిలా
ఉంటే
ఏపీ
ప్రభుత్వం
రేషన్
కార్డు
ధరలతో
పాటు
రేషన్
కార్డు
నిర్వాహకులకు
లాభం
కలిగేలా
కొత్త
విధానాన్ని
అమలు
చేయాలని
నిర్ణయించిన
విషయం
తెలిసిందే.
రేషన్
కార్డు
దారులకు,
షాప్
ల
నిర్వాహకులకు
లబ్ది
ఈ
క్రమంలోనే
చౌక
ధరల
దుకాణాలను
మినీ
మాల్స్
గా
మార్చి
రోజంతా
రేషన్
సరుకులు
అందించే
కొత్త
విధానాన్ని
అమలు
చేయనున్నారు.
దీనికోసం
కొన్ని
నగరాలను
పైలెట్
ప్రాజెక్టుగా
ఎంపిక
చేసిన
ప్రభుత్వం
ఆ
దిశగా
అడుగులు
వేస్తుంది.
పైలెట్
ప్రాజెక్టు
విజయవంతమైతే
రాష్ట్రవ్యాప్తంగా
ఈ
విధానాన్ని
ప్రవేశపెట్టాలని
తద్వారా
రేషన్
తీసుకునే
వారికి
,
రేషన్
షాప్
లో
నిర్వహించే
వారికి
లబ్ధిని
చేకూర్చాలని
భావిస్తుంది.


