Andhra Pradesh
oi-Syed Ahmed
ఏపీ
రాజధాని
అమరావతికి
విజయవాడ
నుంచి
వెళ్లే
ప్రయాణికులకు
శుభవార్త.
ప్రస్తుతం
అమరావతి
రాజధానికి
వెళ్లాలంటే
ప్రకాశం
బ్యారేజ్
దాటి
కుడివైపుకు
మళ్లాక
వచ్చే
కరకట్ట
రోడ్డు
మీదుగానే
ప్రయాణాలు
సాగించాల్సి
వచ్చేది.
అదీ
సింగిల్
రోడ్డు
కావడంతో
రెండు
వైపులా
ఒకేసారి
వాహనాలు
ప్రయాణించాలంటే
తీవ్ర
ఇబ్బందులు
ఉండేవి.
ఏదైనా
తేడా
వస్తే
వాహనాలు
కరకట్టపై
నుంచి
కిందకి
పడిపోయే
పరిస్ధితి.
ఈ
సమస్యలకు
చెక్
పెట్టేందుకు
ఎప్పటినుంచో
జరుగుతున్న
ప్రయత్నాలు
కొలిక్కి
వచ్చాయి.
విజయవాడ
నగరం
నుంచి
ఉండవల్లిపై
ఉన్న
కరట్ట
మీదుగా
సీడ్
యాక్సెస్
రోడ్డుపై
సాగుతున్న
ప్రయాణాల
రూటును
కాస్త
మార్చి
పక్కనే
మరో
రోడ్డును
అందుబాటులోకి
తెచ్చారు.ప్రకాశం
బ్యారేజ్
దాటిన
తర్వాత
కరకట్టతో
సంబంధం
లేకుండా
నేరుగా
సీడ్
యాక్సెస్
రోడ్డును
కలిపే
విధంగా
కొత్త
రోడ్డు
అందుబాటులోకి
వచ్చింది.
అయితే
ఇందులో
పక్కనే
ఉన్న
గుంటూరు
ఛానల్
పై
నిర్మిస్తున్న
వంతెన
పనులు
మాత్రమే
మిగిలాయి.
ఇవి
కూడా
పూర్తి
కాగానే
ఇక
నేరుగా
సీడ్
యాక్సెస్
రోడ్డు
మీదుగా
రాజధానికి
ప్రయాణాలు
చేసేందుకు
వీలు
కలుగుతుంది.
ప్రస్తుతం
అమరావతిలోని
కీలకమైన
సీడ్
యాక్సెస్
రోడ్డు
నిర్మాణంలో
మిగిలిన
పనులు
శరవేగంగా
పూర్తవుతున్నాయి.
ఇందులో
భాగంగా
మంగళగిరివైపు
సీడ్
యాక్సెస్
రోడ్డులో
మిగిలిన
1.5
కిలోమీటర్ల
మార్గాన్ని
తాజాగా
పూర్తి
చేశారు.
దీన్ని
ప్రకాశం
బ్యారేజ్
దాటాక
మెయిన్
రోడ్డుకు
కలపనున్నారు.
దీంతో
విజయవాడ
నుంచి
అమరావతికి
వెళ్లేందుకు
కరకట్టపై
దూరం
గణనీయంగా
తగ్గిపోనుంది.
కొత్తగా
అందుబాటులోకి
వచ్చిన
సీడ్
యాక్సిస్
రోడ్డుతో
పాటు
గుంటూరు
చానెల్
పై
నిర్మిస్తున్న
స్టీల్
బ్రిడ్జి
పనులను
మంత్రి
నారాయణ
పరిశీలించారు.
ఈ
నెలాఖరుకు
స్టీల్
బ్రిడ్జి
పనులు
పూర్తి
చేయాలని
కాంట్రాక్ట్
సంస్థకు
మంత్రి
నారాయణ
ఆదేశాలు
ఇచ్చారు.
కరకట్టపై
వెళ్ళే
అవసరం
లేకుండా
త్వరలోనే
బ్రిడ్జి
అందుబాటులోకి
తెచ్చేలా
చర్యలు
తీసుకుంటున్నట్లు
మంత్రి
నారాయణ
వెల్లడించారు.


