Business
oi-Lingareddy Gajjala
స్పీడ్
అంటే
కేటీఎం(KTM)..
స్టైల్
అంటే
కేటీఎం…
అగ్రెషన్
అంటే
కేటీఎం!.
ఒకప్పుడు
ఇండియన్
రోడ్లపై
కుర్రకారును
ఊగించిన
యూత్
ఐకాన్
కేటీఎం,
ఈ
మధ్యలో
కాస్త
సైలెంట్
అయింది.
ఇప్పుడు
మళ్లీ
ఫుల్
థ్రోటిల్
మోడ్‌లోకి
వచ్చేసింది.
ఇప్పటికే
డ్యూక్
(Duke)
160తో
మార్కెట్‌ని
షేక్
చేసిన
కేటీఎం,
ఇప్పుడు
ఎంట్రీ
లెవల్
స్పోర్ట్స్
సెగ్మెంట్‌లో
తన
బేబీ
KTM
RC
160ని
దింపుతోంది.
ఈ
బైక్
ఎంట్రీతో
స్పోర్ట్స్
బైక్స్
మార్కెట్
టెన్షన్
మొదలైనట్టే
అని
ఆటో
వర్గాల్లో
టాక్
నడుస్తోంది.
లుక్
చూస్తేనే
లవ్
లో
పడేసే
రేంజ్
కేటీఎం
సొంతం.
చాలా
మంది
కుర్రాళ్కు
ఫస్ట్
సైట్
క్రష్!.
కొనే
అంత
బడ్జెట్
లేకపోయినా..
ఒక్కసారైనా
డ్రైవ్
చేయాలని
తహతహలాడిన
వారు
చాలా
మంది.
ఇప్పుడు
తాజాగా
వస్తున్న
బేబీ
RC
160
డిజైన్
చూస్తే
మైండ్
బ్లాక్
అవ్వడం
పక్కా.
ఒక్క
మాటలో
దీని
గురించి
చెప్పాల్సి
వస్తే
దీన్ని
ప్యూర్
రేష్
మిషన్
అనొచ్చు.
పూర్తిగా
తన
పెద్ద
అన్న
RC
200
DNAతోనే
వస్తోంది.
షార్ప్
LED
హెడ్‌ల్యాంప్స్,
అగ్రెసివ్
ఫుల్
ఫెయిరింగ్,
స్టైలిష్
DRLs…
రోడ్డుపై
ఇది
వెళ్తుంటే
ఎవరైనా
మనవైపు
ఓ
లుక్కేయాల్సిందే.
మస్కులర్
ట్యాంక్,
స్ప్లిట్
సీట్లు,
స్పోర్టీ
ఎగ్జాస్ట్…
మొత్తం
మీద
ఆల్
టైం
సూపర్
బైక్
గా
కనిపిస్తుంది.
ఇక
కలర్
వేరియంట్లు
చూస్తే
యూత్‌కు
ఫుల్
మాస్
ట్రీటే.
ఆరెంజ్,
బ్లాక్,
బ్లూ
షేడ్స్‌లో
కొత్త
గ్రాఫిక్స్
డిజైన్
తో
రొడ్డెక్కబోతుంది
స్పీడ్
+
కంట్రోల్
=
KTM
మ్యాజిక్
RC
160లో
164.2cc
లిక్విడ్
కూల్డ్
సింగిల్
సిలిండర్
ఇంజిన్
ఉంటుంది.
ఇది
9,500
RPM
వద్ద
19
bhp
పవర్,
7,500
RPM
వద్ద
15.5
Nm
టార్క్ని
పంచుతుంది.
6-స్పీడ్
గేర్‌బాక్స్‌తో
వచ్చే
ఈ
బైక్,
ట్రాఫిక్‌లోనూ
చురుకుగా,
హైవే
మీద
అయితే
ఫుల్
ఫన్
మోడ్‌లో
దూసుకుపోతుంది.
కార్నర్‌లో
రాజు…
హ్యాండ్లింగ్‌లో
బాస్
KTM
అంటే
హ్యాండ్లింగ్‌లో
నెంబర్
వన్.
RC
160ను
కూడా
స్ప్లిట్
ట్రెల్లిస్
ఫ్రేమ్పై
కట్టారు.
తక్కువ
బరువు,
బెస్ట్
బ్యాలెన్స్‌తో
కార్నర్లలో
ఇది
అసలు
తగ్గదు.
ముందువైపు
WP
Apex
USD
ఫోర్క్స్,
వెనుక
మోనోషాక్
సస్పెన్షన్
అంటే
రైడింగ్‌లో
కాన్ఫిడెన్స్
లెవెల్స్
నెక్స్ట్
లెవల్.
పైగా
SuperMoto
ABS,
ఫుల్
LED
లైటింగ్,
LCD
క్లస్టర్,
టర్న్-బై-టర్న్
నావిగేషన్
వంటి
ఫీచర్లు
ఈ
సెగ్మెంట్‌లో
బైక్‌ను
ఒక
స్టెప్
అప్
చేస్తాయి.
ధర
వింటే
షాక్…
పోటీ
చూస్తే
టెన్షన్
ప్రస్తుతం
Duke
160
ధర
సుమారు
రూ.1.70
లక్షలు
కాగా,
కొత్త
RC
160
ధర
రూ.1.80
లక్షల
–
రూ.1.95
లక్షల
మధ్య
ఉండొచ్చని
అంచనా.
ఈ
ప్రైస్
ట్యాగ్‌తో
యమహా
R15
V4,
పల్సర్
RS
200,
జిక్సర్
SF
150,
కరిష్మా
XMR
210
లాంటి
బైక్‌లకు
డైరెక్ట్
ఫైట్
ఖాయం.
ముఖ్యంగా
R15
కొనాలని
ప్లాన్
చేస్తున్న
యూత్
ఇప్పుడు
“ఒక్కసారి
KTM
RC
160
కూడా
చూద్దామా?”
అనడం
పక్కా.
న్యూ
ఇయర్
గిఫ్ట్!
తక్కువ
ధరలో
ప్రీమియం
లుక్,
స్పోర్టీ
రైడ్,
KTM
బ్రాండ్
వాల్యూ
కావాలంటే
RC
160
పర్ఫెక్ట్
ప్యాకేజ్.
కాలేజ్
రైడ్స్,
వీకెండ్
ఎస్కేప్స్,
షార్ట్
టూరింగ్…
అన్నింటికీ
సెట్.
2026
కొత్త
ఏడాది
కానుకగా
జనవరి
చివరికి
షోరూమ్‌లలోకి
వచ్చే
ఛాన్స్
ఉంది.


