International
oi-Bomma Shivakumar
ఆఫ్రికా
దేశమైన
నైజీరియాలో
దారుణమైన
ఘటన
జరిగింది.
నార్త్
నైజీరియాలోని
ఓ
గ్రామంపై
దుండగులు
కాల్పులు
జరిపారు.
ఈ
దాడిలో
30
మందికిపైగా
గ్రామస్థులు
మృతి
చెందారు.
అంతేకాక
మరికొంత
మందిని
కిడ్నాప్
చేశారు.
బోర్గు
లోకల్
గవర్న్
మెంట్
కిందకు
వచ్చే
ఓ
గ్రామంలో
ఈ
దాష్టీకానికి
పాల్పడ్డారు.
అంతేకాక
గ్రామంలోని
ఇళ్లు,
మార్కెట్
కు
నిప్పు
పెట్టి
అక్కడి
నుంచి
పరార్
అయ్యారు.
నార్త్
నైజీరియాలోని
నైగర్
రాష్ట్రంలోని
కసువాన్-
దాజీ
అనే
గ్రామంపై
సాయుధులైన
దుండగులు
విధ్వంసానికి
పాల్పడ్డారు.
గ్రామంలోని
ప్రజలపై
కాల్పులకు
తెగబడ్డారు.
ఈ
కాల్పుల్లో
దాదాపు
30
మందికి
పైగా
ప్రజలు
ప్రాణాలు
కోల్పోయారు.
మరికొంతమందిని
కిడ్నాప్
చేసి
వారితో
తీసుకెళ్లారు.
ఈ
ప్రాంతంలో
గత
కొద్ది
కాలంగా
ఉద్రిక్త
వాతావరణం
నెలకొని
ఉంది.
ఈ
క్రమంలోనే
గ్రామాలపై
దుండగులు
కాల్పులకు
పాల్పడుతున్నట్లు
సమాచారం.
గ్రామంపై
దుండగులు
ఒక్కసారిగా
తుపాకులతో
విరుచుకుపడ్డారు.
కనిపించిన
వారిని
కనిపించినట్లే
కాల్చుకుంటూ
పోయారు.
దాంతో
గ్రామస్థులు
భయంతో
పరుగులు
తీశారు.
30
మంది
చనిపోయారని
పోలీసులు
చెబుతున్నప్పటికీ
మృతుల
సంఖ్య
భారీగానే
ఉందని
గ్రామస్థులు
పేర్కొన్నారు.
మరికొంత
మందిని
కిడ్నాప్
చేసిన
అడవిలోకి
లాక్కెళ్లినట్లు
తెలిపారు.
అయితే
ఎంతమందిని
కిడ్నాప్
చేశారన్నదానిపై
అంచనా
లేదన్నారు.
దాంతో
మృతుల
సంఖ్య
మరింత
పెరిగే
అవకాశం
ఉందన్నారు.
ఇదే
ఘటనపై
నైగర్
స్టేట్
పోలీస్
ప్రతినిధి
వాసియూ
అబియోదన్
మాట్లాడుతూ..
దుండగులు
ప్రజల్ని
కాల్చిచంపడమే
కాకుండా
వారి
ఇళ్లు,
మార్కెట్
కు
నిప్పు
పెట్టారని
అన్నారు.
మృతుల
సంఖ్య
భారీగా
పెరిగే
అవకాశం
ఉందన్నారు.
కొంతమంది
ఆచూకీ
కూడా
లభించడం
లేదని
వివరించారు.
దుండగులు
కిడ్నాప్
చేసిన
వారిలో
అధికంగా
చిన్నారులు
ఉన్నట్లు
తేలిందన్నారు.
దుండగులు
వారం
నుంచే
ఈ
గ్రామంపై
నిఘా
పెట్టినట్టు
అదను
చూసుకుని
రైడ్స్
కు
పాల్పడినట్లు
వివరించారు.
ఈ
నైజీరియన్
గ్యాంగ్
దాదాపు
మూడు
గంటల
పాటు
గ్రామంలో
నరమేధం
సృష్టించిందని
స్థానికులు
చెబుతున్నారు.
ఇప్పటికే
అనేక
గ్రామాలను
ఈ
నైజీరియన్
గ్యాంగ్స్
ఇలా
విధ్వంసం
చేశాయని
తెలిపారు.
చుట్టూ
దట్టమైన
అడవులు
ఉన్నందువల్ల
వారికి
దాడి
చేసి
అడవిలోకి
పారిపోవడం
సులభమైందని
స్థానికులు
వివరిస్తున్నారు.
గత
నవంబర్
లోనూ
ఓ
స్కూల్
పై
దాడికి
పాల్పడి
దాదాపు
300
మంది
చిన్నారులు,
టీచర్లను
కిడ్నాప్
చేసినట్లు
తెలిపారు.


