Andhra Pradesh
oi-Syed Ahmed
ఏపీలో
తొలిసారి
ఎమ్మెల్యే
అయి,
మంత్రిగా
కూడా
ఛాన్స్
కొట్టేసిన
కర్నూలు
నేత
టీజీ
భరత్
ఎప్పుడూ
చాలా
కూల్
గా
కనిపిస్తుంటారు.
కానీ
ఇవాళ
ఆయనకు
ఓ
విషయంలో
బాగా
కోపం
వచ్చింది.
అంతే
బహిరంగంగానే
తన
రాజకీయ
ప్రత్యర్దులకు
ఘాటు
వార్నింగ్
ఇచ్చారు.
ఇంతకీ
ఆ
రాజకీయ
ప్రత్యర్ధులు
ఎవరో
కాదు
కూటమిలో
తోటి
పార్టీల
నాయకులే.
దీంతో
మంత్రి
టీజీ
భరత్
వ్యాఖ్యలు
చర్చనీయాంశమయ్యాయి.
కర్నూలు
అసెంబ్లీ
నియోజకవర్గం
నుంచి
తొలిసారి
ఎమ్మెల్యేగా
గెలిచిన
టీజీ
భరత్
కు
ఇప్పుడు
కూటమిలోని
ఇతర
పార్టీల
నేతలు
తలనొప్పిగా
మారినట్లు
తెలుస్తోంది.
దీంతో
ఇన్నాళ్లు
మౌనంగా
ఉన్న
ఆయన..
ఇవాళ
మాత్రం
ఫైర్
అయ్యారు.
తాను
మంత్రి
అయ్యాక
పెద్దగా
రాజకీయాలు
చేయలేదన్నారు.
తన
నియోజకవర్గంలో
వేలు
పెడితే
ఎవరినీ
వదిలిపెట్టనంటూ
నేరుగానే
హెచ్చరికలు
జారీ
చేశారు.
తాను
మంత్రి
అయినప్పటినుండి
ఎవరి
జోలికి
వెళ్లలేదని
వారికి
గుర్తుచేశారు.
కానీ
కొంతమంది
కావాలని
తన
నియోజకవర్గంలో
వేలు
పెడుతున్నారని
మంత్రి
భరత్
ఆక్షేపించారు.
నన్ను
కెలికితే
మీరే
ఇబ్బంది
పడతారు,
నా
స్ట్రాటజీలు
తట్టుకోలేరంటూ
టీడీపీ
మంత్రి
టీజీ
భరత్
హెచ్చరించారు.
తన
గురించి
చంద్రబాబు,
లోకేష్
లకు
తెలుసని,
మీరు
ఎంత
కెలికినా
అక్కడ
మారేదేమీ
లేదన్నారు.
తాను
మంత్రిగా
వేలు
పెడితే
మీ
నియోజకవర్గాల్లో
సమస్యలు
వస్తాయన్నారు.
కర్నూల్లో
జరిగిన
ఓ
కార్యక్రమంలో
భరత్
చేసిన
ఈ
హెచ్చరికలపై
ఇప్పుడు
రాష్ట్రవ్యాప్తంగా
చర్చ
జరుగుతోంది.
మాజీ
మంత్రి
టీజీ
వెంకటేష్
కుమారుడైన
భరత్
ప్రస్తుతం
టీడీపీ
యువనేత,
మంత్రి
నారా
లోకేష్
కు
అత్యంత
సన్నిహితుడిగా
ఉన్నారు.
ఆయనతో
పాటు
విదేశీ
పర్యటనలు
కూడా
చేస్తున్నారు.


