Telangana
oi-Sai Chaitanya
సంక్రాంతి
సమీపిస్తోంది.
పండుగకు
సొంత
గ్రామాలకు
వెళ్లేందుకు
సిద్దం
అవుతున్నారు.
ఇందు
కోసం
ముందస్తు
రిజర్వేషన్లు
చేసుకుంటున్నారు.
ఈ
సారి
డిమాండ్
ఎక్కువగా
కనిపిస్తోంది.
ఇప్పటికే
రైళ్లన్నీ
ఫుల్
అయ్యాయి.
ఆర్టీసీ
రెగ్యులర్
సర్వీసుల్లోనూ
రిజర్వేషన్లు
ఖాళీలు
లేవు.
దీంతో,
హైదరాబాద్
నుంచి
ఏపీకి
సంక్రాంతికి
వెళ్లే
వారి
కోసం
ఆర్టీసీ
ప్రత్యేకంగా
1200
బస్సుల
ను
ప్రకటించింది.
నగరంలోని
పలు
ప్రాంతాల
నుంచి
ఇవి
బయల్దేరనున్నాయి.
సంక్రాంతి
వేళ
హైదరాబాద్
నుంచి
1,200
బస్సులు
తెలంగాణ
ఆర్టీసీ
ప్రత్యేక
బస్సులను
ఏర్పాటు
చేసింది.
జనవరి
9
నుంచి
15
వరకు
ఈ
ప్రత్యేక
బస్సులు
నగరం
నలువైపులా
ఉన్న
ఆర్టీసీ
డిపోల
నుంచి
నడిపేలా
అధికారులు
కసరత్తు
చేస్తున్నారు.నల్గొండ,
నిజామాబాద్,
కరీంనగర్,
వరంగల్,
విశాఖపట్నం,
నెల్లూరు,
ఒంగోలు,
తిరుపతి,
కాకినాడ,
కందుకూరు,
విజయవాడ,
రాజమండ్రి,
ఉదయగిరి
తదితర
ప్రాంతాలకు
బస్సులు
అందుబాటులో
ఉండేలా
కసరత్తు
చేస్తున్నారు.
ప్రధానంగా
ఎలక్ట్రిక్
బస్సులు
నడిపేందుకు
ప్రయత్నాలు
చేస్తున్నట్లు
తెలిపారు.
కాగా,
ఈ
సారి
హైదరాబాద్
లోని
బీహెచ్‌ఈఎల్
డిపో
ఆర్సీపురం
నుంచి
మియాపూర్,
కేపీహెచ్‌బీ,
ఔటర్
రింగ్
రోడ్డు
మీదుగా
అమలాపురం,
కాకినాడ,
నర్సాపురం,
విశాఖపట్నం,
రాజమండ్రి,
పోలవరం,
గుంటూరు,
విజయవాడతో
పాటు
ఇతర
ప్రాంతాలకు
బస్సులు
నడపనున్నట్టు
ప్రకటించారు.
సంక్రాంతికి
హైదరాబాద్
నుంచి
ఆంధ్రప్రదేశ్
కు
వెళ్లేవారి
సంఖ్య
భారీగా
ఉంటుంది.
ఇప్పటికే
రైళ్లు,
బస్సులకు
భారీగా
డిమాండ్
ఏర్పడింది.
ఈ
నేపథ్యంలోనే
ప్రయాణికుల
రద్దీని
దృష్టిలో
ఉంచుకుని
సౌత్
సెంట్రల్
రైల్వే
ఇప్పటికే
కొన్ని
ప్రత్యేక
రైళ్లను
ప్రకటించగా,
వాటిల్లో
టికెట్లు
చాలా
వేగంగా
అమ్ముడై
పోయాయి.
దీంతో
కొంతమందికి
రిజర్వేషన్
చేసుకోవడానికి
అవకాశం
లేకుండా
పోయింది.
అలాంటి
వారి
కోసం
మరో
11
సంక్రాంతి
స్పెషల్
ట్రైన్లను
ప్రకటించింది.
ఈ
సందర్భంగా
వాటికి
సంబంధించిన
వివరాలను
దక్షిణ
మధ్య
రైల్వే
తెలిపింది.జనవరి
7
నుంచి
12వ
తేదీల
మధ్య
కాకినాడ
నుంచి
వికారాబాద్,
వికారాబాద్-పార్వతీపురం,
కాకినాడ
టౌన్-వికారాబాద్,
పార్వతీపురం-వికారాబాద్,
పార్వతీపురం-కాకినాడ
టౌన్,
సికింద్రాబాద్-పార్వతీపురం
మధ్య
ఈ
రైళ్లు
రాకపోకలు
సాగించనున్నాయని
దక్షిణ
మధ్య
రైల్వే
పేర్కొంది.


