Business
oi-Lingareddy Gajjala
ప్రశాంతంగా
ఉండే
బ్యాంక్
ఉద్యోగులు
సమ్మె
బాట
పట్టారు.
చాలా
రోజుల
తర్వాత
బ్యాంక్
ఉద్యోగులు
సమ్మెకు
దిగబోతున్నారు.
దీంతో
బ్యాంకింగ్
కార్యకలాపాలు
నిలిచిపోబోతున్నాయి.
జనవరిలో
వరుసగా
4
రోజులు
బ్యాంకు
కార్యకలాపాలకు
అంతరాయం
కలగనున్నట్లు
తెలుస్తోంది.
బ్యాంక్
ఉద్యోగులు
ఎందుకు
సమ్మెకు
దిగబోతున్నారు.
వారి
సమస్యలేంటి.
ఏఏ
తేదీల్లో
బ్యాంకులు
పని
చేయవో
ఇక్కడ
తెలుసుకుందాం.
బ్యాంక్
ఉద్యోగులు
మళ్లీ
సమ్మె
బాట
పట్టేందుకు
సిద్ధమయ్యారు.
తమ
చిరకాల
డిమాండ్లపై
ప్రభుత్వ
వైఖరికి
నిరసనగా
2026
జనవరి
27న
దేశవ్యాప్తంగా
సమ్మె
నిర్వహిస్తున్నట్లు
ఆల్
ఇండియా
బ్యాంక్
ఆఫీసర్స్
కాన్ఫెడరేషన్
(AIBOC)
ప్రకటించింది.
ఈ
మేరకు
సర్క్యులర్
విడుదల
చేస్తూ,
సమస్యలపై
కేంద్రం
ఇంకా
స్పష్టమైన
నిర్ణయం
తీసుకోకపోవడంపై
తీవ్ర
అసంతృప్తి
వ్యక్తం
చేసింది.
ఐదు
రోజుల
పని
విధానం..
బ్యాంక్
ఉద్యోగుల
ప్రధాన
డిమాండ్
అయిన
వారానికి
ఐదు
రోజుల
పని
విధానంపై
ప్రభుత్వం
నిర్లక్ష్యంగా
వ్యవహరిస్తోందని
AIBOC
ఆరోపించింది.
అంతేకాకుండా,
వేతన
సవరణ
అంశం
కూడా
ఎక్కడికక్కడే
నిలిచిపోయిందని
పేర్కొంది.
గతంలో
ఇండియన్
బ్యాంక్స్
అసోసియేషన్
(IBA),
యునైటెడ్
ఫోరమ్
ఆఫ్
బ్యాంక్
యూనియన్లు
(UFBU)
ఐదు
రోజుల
పనిపై
ఏకాభిప్రాయానికి
వచ్చినా,
కేంద్ర
ప్రభుత్వం
నుంచి
ఇప్పటివరకు
అధికారిక
ప్రకటన
రాలేదని
తెలిపింది.
ఈ
నిర్లక్ష్యానికే
నిరసనగా
సమ్మెకు
పిలుపునిచ్చామని
వివరించింది.
పూర్తిగా
నిలిచిపోనున్న
సేవలు..
సమ్మె
కారణంగా
జనవరి
27న
బ్యాంకింగ్
సేవలకు
తీవ్ర
అంతరాయం
ఏర్పడే
అవకాశముంది.
అన్ని
బ్యాంకుల
ఉద్యోగులు
సమ్మెలో
పాల్గొంటే,
బ్రాంచ్
కార్యకలాపాలు
పూర్తిగా
నిలిచే
పరిస్థితి
ఉంటుంది.
అయితే
ఏటీఎంలు,
క్యాష్
డిపాజిట్
మెషీన్లు,
ఆన్‌లైన్
లావాదేవీలు
కొనసాగవచ్చని
సమాచారం.
అయినా
వినియోగదారులు
ముందుగానే
అవసరమైన
పనులు
పూర్తి
చేసుకోవాలని
బ్యాంకింగ్
వర్గాలు
సూచిస్తున్నాయి.
27
నుంచి..
ఇక్కడ
మరో
కీలక
అంశం
ఏమిటంటే..
వరుసగా
నాలుగు
రోజులు
బ్యాంకులు
మూతపడే
పరిస్థితి.
జనవరి
24న
నాలుగో
శనివారం,
25న
ఆదివారం
సెలవు,
26న
గణతంత్ర
దినోత్సవం
సందర్భంగా
హాలిడే
ఉంది.
ఈ
నేపథ్యంలో
27న
సమ్మె
జరిగితే,
వరుసగా
నాలుగు
రోజుల
పాటు
బ్యాంకింగ్
సేవలు
నిలిచిపోవచ్చు.
వీకెండ్
హాలిడే..
బ్యాంకర్లు
తమ
డిమాండ్‌కు
న్యాయబద్ధత
ఉందని
స్పష్టం
చేస్తున్నారు.
రిజర్వ్
బ్యాంక్
ఆఫ్
ఇండియా,
LIC,
GIC,
ఫారెన్
ఎక్స్చేంజ్
మార్కెట్,
స్టాక్
మార్కెట్లు,
ఇతర
కేంద్ర
ప్రభుత్వ
విభాగాలన్నీ
ఇప్పటికే
వారానికి
ఐదు
రోజులే
పని
చేస్తున్నాయని
గుర్తు
చేస్తున్నారు.
బ్యాంకులకు
ప్రస్తుతం
ఆదివారాలు,
నెలలో
రెండో
మరియు
నాలుగో
శనివారాలే
సెలవులు
ఉండగా,
మిగతా
శనివారాలను
కూడా
హాలిడేగా
ప్రకటించాలని
కోరుతున్నారు.
సానుకూల
సంకేతాలపై…
ఇక
ప్రపంచ
దేశాల్లో
చాలాచోట్ల
వారానికి
నాలుగు
రోజుల
పని
విధానం
అమలులో
ఉండగా,
తాము
కేవలం
ఐదు
రోజుల
పనే
కోరుకుంటున్నామని
ఉద్యోగులు
చెబుతున్నారు.
డిజిటల్
సేవలు
24×7
అందుబాటులో
ఉన్నాయని,
అదనపు
సెలవులు
విలాసం
కోసం
కాదని,
న్యాయం
కోసమే
పోరాటం
చేస్తున్నామని
బ్యాంక్
ఉద్యోగ
సంఘాలు
స్పష్టం
చేశాయి.
గతంలో
2024లో
ప్రభుత్వ
సానుకూల
సంకేతాలపై
వార్తలు
వచ్చినా,
ఇప్పటివరకు
అధికారిక
ప్రకటన
లేకపోవడం
నిరాశ
కలిగిస్తోందని
ఆవేదన
వ్యక్తం
చేశాయి.
ఇకనైనా
ప్రభుత్వం
స్పష్టమైన
నిర్ణయం
తీసుకోవాలని,
మరిన్ని
వాయిదాలు
వద్దని
బ్యాంక్
ఉద్యోగులు
గట్టిగా
డిమాండ్
చేస్తున్నారు.
ఈ
సమ్మెపై
కేంద్రం
ఎలా
స్పందిస్తుందోనన్నది
ఇప్పుడు
ఆసక్తికరంగా
మారింది.


