Andhra Pradesh
oi-Chandrasekhar Rao
ఏపీలో
రైలు
ప్రయాణికులకు
గుడ్
న్యూస్.
అత్యంత
రద్దీ
మార్గాల్లో
ఒకటైన
గుంటూరు-
గుంతకల్
రైలు
మార్గంలో
డబ్లింగ్,
విద్యుదీకరణ
పనులు
పూర్తయ్యాయి.
401
కిలోమీటర్ల
ప్రాజెక్ట్
ఇది.
ఇందులో
90
శాతం
పనులు
పూర్తయ్యాయి.
ఈ
రూట్
లో
359
కిలోమీటర్ల
మేర
డబ్లింగ్,
ఎలక్ట్రిఫికేషన్
పనులు
ముగిశాయి.
దీనివల్ల
విశాఖపట్నం,
కోల్
కత
మార్గంలో
రైళ్ల
రాకపోకలు
మరింత
మెరుగుపడతాయని,
వేగం
పెరుగుతుందని
దక్షిణ
మధ్య
రైల్వే
తెలియజేసింది.
గుంటూరు,
ప్రకాశం,
పల్నాడు,
నంద్యాల,
కర్నూలు,
అనంతపురం
జిల్లాలను
అనుసంధానించే
రైల్వే
లైన్
ఇది.
గుంతకల్
నుంచి
గుంటూరు
వరకు
మొత్తం
401
కిలోమీటర్ల
డబ్లింగ్,
ఎలక్ట్రిఫికేషన్
పనులను
చేపట్టడానికి
ఉద్దేశించిన
ఈ
ప్రాజెక్ట్
వ్యయం
3,887
కోట్ల
రూపాయలు.
2016-17లో
దీని
పనులు
మొదలయ్యాయి.
ఈ
ప్రాజెక్టు
కింద
గుంటూరు-గుంతకల్లు
మార్గంలోని
పలు
సెక్షన్లలో
ఇప్పటి
వరకు
359
కిలోమీటర్ల
డబ్లింగ్,
విద్యుదీకరణ
పనులు
పూర్తయ్యాయి.
తొలుత
గుంతకల్-బుగ్గనపల్లి
మధ్య
113
కిలోమీటర్ల
డబ్లింగ్,
విద్యుదీకరణ
పనులు
పూర్తయ్యాయి.
దీంతో
కర్నూలు
జిల్లాలోని
బేతంచర్ల-బుగ్గనపల్లి
మధ్య
ఇదివరకు
రెండో
రైలు
మార్గాన్ని
ప్రారంభించారు.
దీని
తర్వాత
నల్లపాడు-గిద్దలూరు
మధ్య
200
కిలోమీటర్ల
నిర్మాణం
పూర్తయింది.
ఈ
ప్రాజెక్టులో
భాగంగా
307
కిలోమీటర్ల
మార్గంలో
రైలు
సర్వీసులు
అందబాటులోకి
వచ్చాయి.
ఎలక్ట్రానిక్
ఇంటర్‌లాకింగ్
వ్యవస్థతో
కూడిన
కొత్త
సిగ్నలింగ్
ఏర్పాట్లు
కూడా
అందుబాటులోకి
వచ్చాయి.
నల్లపాడు-
సాతులూరు
(32
కి.మీ),
మద్దికెర-
ద్రోణాచలం
(57
కి.మీ),
బేతంచెర్ల-
మల్కాపురం
(23
కి.మీ),
మునుమాక-శావల్యాపురం
(22
కి.మీ),
జగ్గంబొట్ల
కృష్ణాపురం-చీకటిగలపాలెం
(87
కి.మీ)..
ఇలా
సెక్షన్లు,
దశలవారీగా
పనులు
పూర్తయ్యాయి.
ఇప్పుడు
తాజాగా
మొత్తం
359
కిలోమీటర్ల
మేర
డబ్లింగ్
విద్యుదీకరణ
పనులు
పూర్తయ్యాయి.
దీంతో
త్వరలోనే
ఈ
మార్గంలో
రైళ్ల
రాకపోకలు
ఆరంభం
కానున్నాయి.
డబ్లింగ్
పనులతో
గుంటూరు-రాయలసీమ
రవాణా
మెరుగుపడుతుంది.


