Andhra Pradesh
oi-Syed Ahmed
ఏపీలో
గత
ఎన్నికలకు
ముందు
కూటమి
పార్టీలు
ఇచ్చిన
ఓ
హామీ
నిలబెట్టుకోవడంలో
రెండేళ్లయినా
ప్రభుత్వం
విఫలమవుతోందని
రాష్ట్ర
కాంగ్రెస్
అధ్యక్షురాలు
వైఎస్
షర్మిల
ఆరోపించారు.
కూటమి
రెండేళ్ల
పాలన
హామీలు
ఘనం..అమలుకు
ఘరానా
మోసం
అన్నారు.
ఏటా
జనవరి
వస్తోంది..
పోతుందని..సంవత్సరాలు
మారుతూ
క్యాలెండర్
మారుతున్నా..ఫస్ట్
తారీఖున
ఇస్తామని
చెప్పిన
జాబ్
క్యాలెండర్
కి
మాత్రం
దిక్కులేదని
షర్మిల
విమర్శించారు.
రికార్డు
చేసి
పెట్టుకోండని
ఇచ్చిన
వాగ్దానానికి
విలువ
లేదని
షర్మిల
తెలిపారు.
ఉద్యోగాల
పేరుతో
ఆశ
చూపి,
భారీగా
నిరుద్యోగుల
ఓట్లు
దండుకుని,
రెండో
ఏడాది
కూడా
జాబ్
క్యాలెండర్
పై
ఊసెత్తకుండా
వారి
జీవితాలతో
చెలగాటం
ఆడేందుకు
కూటమి
ప్రభుత్వానికి
సిగ్గుండాలని
షర్మిల
విమర్శించారు.
గత
వైసీపీ
ప్రభుత్వం
5
ఏళ్లు
జాబ్
క్యాలెండర్
పేరుతో
యువత
చెవుల్లో
పూలు
పెడితే,
ఇప్పుడు
కూటమి
ప్రభుత్వం
ఏకంగా
క్యాలీఫ్లవర్లు
పెడుతోందన్నారు.
2025
జనవరి
1
నుంచి
క్రమం
తప్పని
జాబ్
క్యాలెండర్
ఎక్కడ
?
అని
షర్మిల
చంద్రబాబును
ప్రశ్నించారు.
రెండేళ్లలో
రెండు
జాబ్
క్యాలెండర్ల
సంగతేంటన్నారు.
ఇదిగో
అదిగో
అని
ఊరించడం
తప్ప
ఉద్యోగాల
భర్తీ
షెడ్యూల్
ఏదన్నారు.కూటమి
ప్రభుత్వ
హామీ
జాబ్
క్యాలెండర్
కాదు..జోక్
క్యాలెండర్
అన్నారు.
నిరుద్యోగ
బిడ్డలను
దగా
చేసిన
దగా
క్యాలెండర్
అని
విమర్శించారు.
జాబ్
క్యాలెండర్
కోసం
రాష్ట్ర
వ్యాప్తంగా
దాదాపు
50
లక్షల
మంది
నిరుద్యోగ
బిడ్డలు
ఎదురు
చూస్తున్నారన్నారు.
ఉన్నది
అమ్ముకుని
సైతం
కోచింగులు
తీసుకొంటున్నారని,
ఉద్యోగాలు
ఇస్తారా
లేదా
అనే
తీవ్ర
ఆందోళనలో
ఉన్నారని
గుర్తుచేశారు.
ఆయా
ప్రభుత్వ
విభాగాల్లో
కలిపి
ఖాళీలు
2
లక్షలకు
పైగా
ఉన్నట్లు
అంచనా
ఉందన్నారు.
వెంటనే
2
లక్షల
ఉద్యోగాలకు
సంబంధించి
జాబ్
క్యాలెండర్
తక్షణం
విడుదల
చేయాలన్నారు.
కూటమి
ప్రభుత్వం
కొలువయ్యాక
కొలువులు
ఇస్తామని
ఇచ్చిన
హామీని
నిలబెట్టుకోవాలని,
రాష్ట్ర
నిరుద్యోగుల
పక్షాన
కూటమి
ప్రభుత్వాన్ని
డిమాండ్
చేస్తున్నట్లు
షర్మిల
తెలిపారు.


