India
oi-Bomma Shivakumar
ప్రపంచంలోనే
అత్యధిక
రోడ్డు
ప్రమాదాలు
జరుగుతున్న
దేశంగా
భారత్
నిలుస్తోంది.
రోడ్డు
ప్రమాదం
కారణంగా
ప్రతి
మూడు
నిమిషాలకు
ఒకరు
ప్రాణాలు
కోల్పోతున్నట్లు
నివేదికలు
స్పష్టం
చేస్తున్నాయి.
అతివేగం,
హెల్మెట్,
సీట్
బెల్టు
ధరించకపోవడం,
రాంగ్
రూట్
డ్రైవింగ్,
రాష్
డ్రైవింగ్,
మద్యం
సేవించి
డ్రైవింగ్
తదితర
అంశాలు
ప్రమాదాలకు
ప్రధాన
కారణాలుగా
ఉన్నాయి.
ఈ
క్రమంలో
దేశ
రాజధాని
దిల్లీ
సంచలన
నిర్ణయం
తీసుకుంది.
రాంగ్
రూట్
లో
వెళ్తే
FIR
నమోదు
చేసి
క్రిమినల్
కేసులు
బుక్
చేసేలా
ఆదేశాలు
జారీ
చేసింది.
దేశంలోనే
తొలిసారిగా
రాంగ్
రూట్
లో
డ్రైవింగ్
చేస్తున్నవారిపై
FIR
నమోదు
చేస్తుంది
దిల్లీ
ప్రభుత్వం.
నూతనంగా
తీసుకొచ్చిన
చట్టం
ప్రకారం
వాహనదారులను
జైలుకు
తరలించడం,
ఫైన్
విధించడం,
అలాగే
వాహనం
సీజ్
చేయడం
లాంటి
కఠిన
చర్యలు
చేపడుతున్నారు.
నిర్లక్ష్యంగా
వాహనాలను
నడిపేవారిపై
ఉక్కుపాదం
మోపడంతోపాటు
ప్రజలకు
రోడ్డు
ప్రమాదాలపై
అవగాహన
కోసం
ఈ
చట్టం
తీసుకొచ్చినట్లు
సమాచారం.
దేశంలోనే
తొలిసారిగా
రాంగ్
రూట్
లో
వెళ్తున్నవారిపై
క్రిమినల్
కేసులు
నమోదు
చేస్తున్నట్లు
దిల్లీ
పోలీసులు
స్పష్టం
చేశారు.
ట్రాఫిక్
రూల్స్
ను
పాటించని
వారిపై
ఇలాంటి
కఠినమైన
చర్యలు
తీసుకోవడం
ఇదే
తొలిసారి
అని
పేర్కొన్నారు.
ఇప్పటివరకూ
నలుగురిపై
ఎఫ్ఐఆర్
లు
నమోదు
చేసినట్లు
స్పష్టం
చేశారు.
అయితే
వాళ్లు
బెయిల్
పై
విడుదల
అయ్యారని..
వాహనదారులకు
స్ట్రాంగ్
మెసేజ్
ఇచ్చేందుకే
ఈ
నిర్ణయం
తీసుకున్నట్లు
దిల్లీ
పోలీసులు
వివరిస్తున్నారు.
దిల్లీ
రోడ్లపై
రాంగ్
సైడ్
డ్రైవింగ్
ను
తీవ్రమైన
నేరంగా
పరిగణిస్తున్నారు.
గత
కొన్నేళ్లుగా
రాంగ్
రూట్
డ్రైవింగ్
కేసులు
దిల్లీలో
గణనీయంగా
పెరిగినట్లు
అధికారులు
అంచనా
వేశారు.
2025
లోనే
దాదాపు
3
లక్షలకుపైగా
రాంగ్
రూట్
కేసులు
నమోదయ్యాయి.
వీటికి
సంబంధించి
1.78
లక్షల
చలాన్లు
జారీ
చేశారు.
1.27
లక్షల
కేసులకు
సంబంధించి
నోటీసులు
జారీ
చేశారు.
రాంగ్
సైడ్
డ్రైవింగ్
రోడ్డు
ప్రమాదాలకు
ప్రధాన
కారణంగా
దిల్లీ
పోలీసులు
భావిస్తున్నారు.
దీనివల్ల
కేవలం
వాహనదారుడు
మాత్రమే
కాకుండా
పాదచారులు
ఇతర
వాహనదారులు
కూడా
ప్రమాదంలో
పడే
అవకాశం
ఉందని
వివరిస్తున్నారు.
ఇదివరకు
రాంగ్
సైడ్
డ్రైవింగ్
కూ
రూ.
5
వేలు
జరిమానా
విధించేవారు.
కానీ
ఇప్పుడు
భారతీయ
న్యాయ
సంహిత(BNS)
చట్టం,
సెక్షన్
281
ప్రకారం
ఎఫ్ఐఆర్
లు
నమోదు
చేస్తున్నారు.
ఈ
చట్టం
ప్రకారం
వాహనదారులకు
కనీసం
6
నెలలు
జైలు
శిక్ష
పడుతుంది.
అలాగే
రూ.
1000
ఫైన్
కట్టాలి.
దాంతోపాటు
వాహనం
కూడా
సీజ్
అవుతుంది.


