Andhra Pradesh
oi-Dr Veena Srinivas
తెలుగు
రాష్ట్రాలలో
పరిచయం
అక్కరలేని
పేరు
వేణుస్వామి.
ముఖ్యంగా
సినీ
సెలబ్రిటీలు,
రాజకీయ
ప్రముఖులకు
సంబంధించి
జ్యోతిష
అంచనాలతో
కాంట్రవర్సీలకు
కేరాఫ్
గా
నిలిచే
జ్యోతిష్యుడు
వేణుస్వామి
తాజాగా
ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర
రాజకీయాలపైన
ముఖ్యంగా
ఏపీ
సీఎం
చంద్రబాబు,
మాజీ
సీఎం
వైఎస్
జగన్,
డిప్యూటీ
సీఎం
పవన్
కళ్యాణ్,
మంత్రి
నారా
లోకేష్
లతో
సహా
పలువురు
ప్రముఖుల
జాతకాలపైన
తాజాగా
ఓ
ఇంటర్వ్యూలో
ఆసక్తికర
వ్యాఖ్యలు
చేశారు
చంద్రబాబుకు
వేణు
స్వామి
కీలక
సూచనలు
2026లో
వారి
రాజకీయ
భవిష్యత్తు
ఎలా
ఉండబోతుందో
చెప్పిన
వేణు
స్వామి
చంద్రబాబుకు
కీలక
సూచనలు
కూడా
చేశారు.
ముఖ్యమంత్రి
చంద్రబాబు
రాష్ట్రపతి
అయ్యే
అవకాశం
లేదని
వేణు
స్వామి
స్పష్టం
చేశారు.
కొన్ని
రోజులుగా
ఈ
విషయం
పైన
ఊహాగానాలు
వినిపిస్తున్నప్పటికీ
అది
జరగదని
పేర్కొన్న
వేణు
స్వామి,
చంద్రబాబు
ఆరోగ్యం
విషయంలో
జాగ్రత్తగా
ఉండాలంటూ
సూచనలు
చేశారు.
లోకేష్
రాజకీయ
భవిష్యత్
పై
వేణుస్వామి
చంద్రబాబు,
తెలంగాణ
మాజీ
సీఎం
కేసీఆర్
ఇద్దరు
కర్కాటకరాశి
వారని,
వారు
ఆరోగ్యం
విషయంలో
జాగ్రత్తగా
ఉండాలని
వేణుస్వామి
పేర్కొన్నారు.
బీహార్
సీఎం
నితీష్
కుమార్
కు
ఇదే
వర్తిస్తుందని,
ఆయన
కూడా
ఆరోగ్యం
పట్ల
జాగ్రత్తగా
ఉండాలని
వేణుస్వామి
చెప్పారు.
మంత్రి
లోకేష్
భవిష్యత్తు
పైన
మాట్లాడిన
వేణు
స్వామి
2026సంవత్సరంలో
మంత్రి
నారా
లోకేష్
కు
పదోన్నతి
కనిపిస్తోందని,
డిప్యూటీ
సీఎం
అయ్యే
అవకాశం
ఉందని
అన్నారు.
పవన్
కళ్యాణ్
కు
ఈ
ఏడాది
ఉంటుంది
ఇలా
ఏపీలో
మరో
డిప్యూటీ
సీఎం
ఉంటే
తప్ప
ఏమీ
లేదని,
ఆయన
ఉన్న
స్థాయి
నుంచి
మరో
మెట్టు
పైకి
ఎక్కుతారని,
లోకేష్
అభిమానులకు
ఇది
పండుగ
అయినట్టు
వేణు
స్వామి
చెప్పారు.
ఇక
పవన్
కళ్యాణ్
జాతకం
కూడా
విశేషంగా
ఉందని
చెప్పిన
వేణు
స్వామి,
కేటీఆర్,
పవన్
కళ్యాణ్
లది
మకర
రాశి
అని,
పవన్
కళ్యాణ్
కు
ఈ
సంవత్సరం
ఎటువంటి
ఇబ్బంది
లేదని
స్పష్టం
చేశారు.
పవన్
కళ్యాణ్
కు
సీఎం
అయ్యే
అవకాశం
ఇప్పట్లో
లేదు
ఏపీలో
కూటమి
పార్టీలో
ఎటువంటి
సమస్యలు
రావని,
2026సంవత్సరం
అంతా
సాఫీగా
సాగిపోతుందని
వేణుస్వామి
జోస్యం
చెప్పారు.
2027సంవత్సరంలో
పవన్
కళ్యాణ్
కొన్ని
సంచలనాలు
సృష్టించే
అవకాశం
ఉందని
అంచనా
వేశారు.
2029వరకు
పవన్
కళ్యాణ్
ముఖ్యమంత్రి
అయ్యే
అవకాశం
లేదని
పేర్కొన్నారు.
ఆ
తర్వాత
పవన్
కళ్యాణ్
జాతకం
ఎలా
ఉందో
చూసి
చెప్తానని
చెప్పిన
వేణుస్వామి,
ప్రతి
మనిషికి
రెండున్నర
సంవత్సరాలకు
ఒకసారి
జాతకాలు
మారుతాయని
స్పష్టం
చేశారు.
2026లో
జగన్
జాతకం
ఇలా
మాజీ
ముఖ్యమంత్రి
వైయస్
జగన్మోహన్
రెడ్డి
జాతకం
పైన
సానుకూలంగా
స్పందించిన
వేణు
స్వామి
2026
లో
ఆయనకు
చాలా
పాజిటివ్
గా
ఉంటుందన్నారు.
ఆయనది
మిధున
రాశి
కావడంతో
ప్రజల
నుంచి
ఆయనకు
మద్దతు
లభిస్తుందని,
2026లో
పెద్దగా
మార్పులేవీ
ఉండవని,
ఏపీ
రాజకీయాలు
కూల్
గా
సాగిపోతాయని
తెలిపారు.


