Andhra Pradesh
oi-Dr Veena Srinivas
సంక్రాంతి
అంటేనే
ప్రతీ
ఒక్కరికి
ఆంధ్రప్రదేశ్
గుర్తుకు
వస్తుంది.
పంట
చేతికి
వచ్చి
అందరూ
సంతోషంగా
జరుపుకునే
పండుగతో
పాటు
ఏపీలో
సంక్రాంతి
వేడుకలకు
ప్రత్యేక
ఆకర్షణగా
నిలిచేది
కోడిపందాలు.
ప్రతి
ఏటా
వివిధ
రాష్ట్రాల
నుంచి
వేలాదిమంది
ఏపీకి
వచ్చి
కోడిపందాలను
ప్రత్యక్షంగా
వీక్షిస్తుంటారు.
కోట్ల
రూపాయల
పందేలు,
రక్తపాతంతో
కూడిన
కోళ్ళ
కత్తుల
యుద్ధం
అడ్డుకోవటానికి
ప్రభుత్వం
ఎంత
ప్రయత్నం
చేసినా
కోడి
పందాలు
కొనసాగుతూనే
ఉంటాయి.
బరిలోకి
క్రాస్
కోడిపుంజులు
సిద్ధం
పందెం
కోళ్లకు
ప్రత్యేక
ఆహారం,
కఠినమైన
శిక్షణ
ఇచ్చి
18
నెలల
నుండే
రెడీ
చేస్తున్నారు.
అయితే
ఈసారి
గతానికి
భిన్నంగా
క్రాస్
జనరేషన్
కోడిపుంజులు
హవా
కొనసాగబోతుందనే
చర్చ
ఏపీ
వ్యాప్తంగా
వినిపిస్తోంది.
గత
ఏడాది
కూడా
క్రాస్
పుంజులు
చాలా
స్పెషల్
ఎట్రాక్షన్
గా
నిలిచాయి
.
క్రాస్
కోడిపుంజులకు
తర్ఫీదు
అమెరికన్
గేమ్
పాల్,
అమెరికన్
పెర్విన్,
బ్రెజిల్
జాతి
కోళ్లను
దేశీయ
డేగ,
నెమలి
జాతులతో
క్రాసింగ్
చేసి
కొత్త
పుంజులను
తయారు
చేస్తున్నారు.
ఈ
క్రాస్
కోడిపుంజుల
ధర
లక్ష
రూపాయలకు
పైగానే
ఉంటుందని
చెప్తారు.కేవలం
సంక్రాంతి
కోడిపందాల
కోసమే
అనేక
కుటీర
పరిశ్రమలు
ఏర్పాటు
చేసినట్టు
తెలుస్తుంది.
తూర్పుగోదావరి,
పశ్చిమ
గోదావరి,
కృష్ణ
జిల్లాల్లో
వందల
కొద్దీ
శిక్షణ
కేంద్రాల్లో
ఈ
క్రాస్
పుంజులకు
తర్ఫీదు
ఇస్తున్నారు.
జోరుగా
ఏపీలో
కోడిపందాలకు
బరులు
రెడీ
నెలకు
రూ.15వేల
జీతంతో
శిక్షకులను
నియమించి,
18
నెలలపాటు
పుంజులను
పోరాటాలకు
సిద్ధం
చేస్తున్నారు.గతేడాది
జనవరిలో
కోడిపందాల
ద్వారా
దాదాపు
రూ.2000
కోట్ల
వరకు
చేతులు
మారాయని
అంచనా.
ఈసారి
కూడా
తూర్పు,
పశ్చిమ
గోదావరి,
కృష్ణా
జిల్లాల్లో
కోడిపందాలు
జోరుగా
జరగనున్నాయని
.
కోనసీమ,
గుంటూరు,
కృష్ణ
జిల్లాల్లో
ఇప్పటికే
బరులు
సిద్ధమవుతున్నాయని
అంటున్నారు
.
పందాల
కోసం
వచ్చే
వారు
ముందుగానే
హోటళ్లు,
లాడ్జీలు
బుక్
చేసుకుంటున్నారు.
కట్టడికి
రంగంలోకి
పోలీసులు
ఒకవైపు
కోడిపందాలు
నిర్వహించవద్దంటూ
పోలీసులు
హెచ్చరికలు
జారీ
చేస్తున్నా,
నిర్వాహకులు
మాత్రం
పందాలకు
సిద్ధమవుతున్నారు.
కోడి
పందేల
కట్టడికి
ప్రభుత్వం
పోలీసులు
ఏం
చేసినా
కోడి
పందాలు
కొనసాగుతాయి.
ఈసారి
క్రాస్
జనరేషన్
కోడిపుంజులతో
కోడిపోరు
మరింత
రంజుగా
సాగుతుందనే
అంచనాలు
వినిపిస్తున్నాయి.


