సంక్రాంతికి కొత్త రోడ్లు.. సంతోషంతో స్టెప్పులేసిన ఎమ్మెల్యే

Date:


Andhra Pradesh

oi-Lingareddy Gajjala

తిరువూరు
రాజకీయం
మళ్లీ
మారిపోయింది.
ముఖ్యంగా
సంక్రాంతి
వేళ
పండుగ
శోభను
సంతరించుకుని
ఉంది.
గత
మూడు
నాలుగు
నెలలుగా
రాజకీయ
ఆధిపత్య
పోరుతో
వార్తల్లో
నిలిచిన
తిరువూరు
నియోజకవర్గం

సారి
మాత్రం
అభివృద్ధి
పనుల
విషయమై
వార్తకెక్కింది.
సంక్రాంతికి
రోడ్లు
అన్ని
పూర్తి
చేయాలని
లక్ష్యంగా
పెట్టుకున్న
కూటమి
ప్రభుత్వం
175
నియోజకవర్గాల్లో
దాదాపు
పనులన్ని
పూర్తి
చేసింది.
ఇందులో
భాగంగానే
తిరువూరులో
కూడా
తెలంగాణ
రాష్ట్రానికి
కూడా
అనుసంధానమైన
ప్రధాన
రోడ్డు
పనులను
శంకుస్థాపన
చేసింది.

ఎన్టీఆర్
జిల్లా
తిరువూరు
బస్టాండ్
నుండి
సూర్య
రెస్టారెంట్
వెళ్లే
ప్రధాన
రహదారి
చాలా
అధ్వానంగా
ఉండేది.
ముఖ్యంగా
తెలంగాణ
రాష్ట్రానికి
కూడా
అనుసంధానమైన
రోడ్డు
ఇది.
గత
పది
సంవత్సరాలుగా
అధికారులు,
పాలకులు
పట్టించుకోకపోవడంతో
రోడ్డు
పూర్తిగా
ధ్వంసమైంది.
రోడ్డుపై
పెద్ద
పెద్ద
గుంటలు
ఏర్పడి
ప్రయాణించాలంటే
వాహనదారులకు
ప్రాణ
సంకటంగా
మారింది.
ఎంతోమంది
వాహనాలు
గుంటల్లో
పడి
జరిగి
కాళ్లు
చేతులు
విరిగి
ఆసుపత్రుల
పాలై
నరకయాతన
అనుభవించారు
కూడా.
అయితే
ఎట్టకేలకు

రోడ్డుకు
మోక్షం
కలిగింది.

బస్టాండ్
నుండి
సూర్యా
రెస్టారెంట్
వరకు
వెళ్లే
రోడ్డుకు
రాష్ట్ర
ప్రభుత్వం
నిధులు
మంజూరు
చేయటంతో
ఎమ్మెల్యే
కొలకపూడి
శ్రీనివాసరావు,
పంచాయతీరాజ్
శాఖ
అధికారులతో
కలిసి
రోడ్డుకు
శంకుస్థాపన
చేసి..
రోడ్డు
పనులు
ప్రారంభించారు.

సందర్భంగా
సంతోషంలో
డాన్స్
చేశారు.
ఎప్పుడూ
వివాదాస్పద
అంశాలు
మాట్లాడి
రచ్చకు
తెరలేపే
కొలకపూడి
సరదాగా
డాన్స్
చేయడంతో
కార్తకర్తలు
ఆశ్చర్యపోయారు.
తనదైన
శైలిలో
ముక్కుసూటిగా
వెళ్లే
ఎమ్మెల్యే
కొలకపూడి..
శంకుస్థాపన
కార్యక్రమంలో
చిన్న
పిల్లాడితో
కలిసి
డాన్స్
చేయడంతో
ఆయనలో
మార్పు
వచ్చిందని..
రాజకీయ
హీట్
ను
పక్కన
పెట్టి..
నియోజకవర్గ
అభివృద్ధిపై
ఫోకస్
చేశారని
టాక్
వినిపిస్తుంది.


సందర్భంగా
ఎమ్మెల్యే
కొలకపూడి
మాట్లాడుతూ..
తిరువూరు
నియోజకవర్గంలో
పాడైపోయిన
రోడ్లు
త్వరలోనే
బాగు
చేస్తామని
తెలిపారు.
త్వరలోనే
కోకిలంపాడు
రోడ్డు
పనులు
ప్రారంభిస్తామని
ఎమ్మెల్యే
హామీ
ఇచ్చారు.
తిరువూరు
నియోజకవర్గంలో
రోడ్ల
మరమ్మతులకు
నిధులు
కేటాయించినందుకు
ముఖ్యమంత్రి
చంద్రబాబు
నాయుడుకి,
డిప్యూటీ
సీఎం
పవన్
కళ్యాణ్
కు
కృతజ్ఞతలు
తెలిపారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related