oi
-Suravarapu Dileep
రిపబ్లిక్ డే సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ తన సేల్ వివరాలను నిన్న (జనవరి 8) వెల్లడించింది. ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 17 వ తేదీ నుంచి ప్రారంభం కానుందని తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ బ్లాక్, ప్లస్ మెంబర్లు 24 గంటల ముందుగానే సేల్‌లో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తామని తెలిపింది. HDFC బ్యాంకు క్రెడిట్ కార్డులపై 10 శాతం డిస్కౌంట్ ను అందిస్తామని వెల్లడించింది. అయితే డీల్స్ సహా ఇతర వివరాలు వెల్లడి కాలేదు.
సేల్ ఎప్పటి నుంచి ప్రారంభం కానుంది? :
అయితే మరో ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ రిపబ్లిక్ డే సందర్భంగా ప్రత్యేక సేల్ నిర్వహిస్తున్నట్లు తెలిపింది. అమెజాన్ మైక్రోసైట్ ఆధారంగా అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ (Amazon Great Republic Day Sale 2026) జనవరి 16 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. SBI క్రెడిట్ కార్డు, EMI లావాదేవీలపై 10 శాతం డిస్కౌంట్ ను అందిస్తామని తెలిపింది. డీల్స్ సహా ఇతర వివరాలను వెల్లడించలేదు.
అయితే ఫ్లిప్‌కార్ట్ తరహాలోనే అమెజాన్ ప్రీమియం యూజర్లు సేల్ లో ముందస్తుగా పాల్గొనే అవకాశం కల్పించే అవకాశం ఉంది. ఈ సేల్‌లో 8PM డీల్స్, ట్రెండింగ్ డీల్స్, బ్లాక్‌బస్టర్ డీల్స్, బ్లాస్‌బస్టర్ డీల్స్ విత్ ఎక్స్ఛేంజీ, టాప్ 100 డీల్స్ వంటివి ఉండే అవకాశం ఉంది.
ఈ ఉత్పత్తులపై డిస్కౌంట్లు :
అమెజాన్ రిపబ్లిక్ డే సేల్‌లో స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్స్, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, కెమెరాలు, ఇయర్‌బడ్స్, స్పీకర్లు, స్మార్ట్‌వాచ్‌లు సహా అనేక ఉత్పత్తులపై డిస్కౌంట్ ను పొందే అవకాశం ఉందని తెలుస్తోంది. వీటితోపాటు కిచెన్ కు సంబంధించిన ఉత్పత్తులు, ఆరోగ్యం సహా ఫ్యాషన్ ఉత్పత్తులపై డీల్స్ ఉంటాయని అంచనా వేస్తున్నారు.
ఈ సేల్ లో గేమింగ్ ఉత్పత్తులు, స్మార్ట్ గ్లాస్లు, వాషింగ్ మెషిన్లు, ప్రొజెక్టర్లు, రిఫ్రిజిరేటర్లు సహా ఇతర గృహోపకరణాలపై డీల్స్ ఉండే అవకాశం ఉంది. దీంతోపాటు అమెజాన్ ఉత్పత్తులు తగ్గింపు ధరకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ సేల్ లో భాగంగా ఆపిల్, శాంసంగ్, సోనీ, వన్‌ప్లస్, షియోమీ, టీసీఎల్, ఎల్జీ, హెచ్‌పీ, బోట్, ఐకూ సహా అనేక బ్రాండ్లపై డిస్కౌంట్లను పొందే అవకాశం ఉందని తెలుస్తోంది.
అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ ప్రారంభ తేదీ వెల్లడించినా, ఎన్నిరోజులపాటు నిర్వహిస్తారనే సమాచారాన్ని వెల్లడించలేదు. SBI క్రెడిట్ కార్డు లావాదేవీలపై 10 శాతం డిస్కౌంట్ అందిస్తామని తెలిపింది. అయితే ఎక్స్ఛేంజీ సహా ఇతర వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
దీంతోపాటు కేటగిరీల వారీగా డీల్స్‌ను వెల్లడించే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి. అమెజాన్ ప్రైమ్ మెంబర్లు ముందుగానే సేల్‌లో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది.
ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ సేల్ వివరాలను వెల్లడించింది. అయితే ఏయే ఉత్పత్తులపై ఎంత డిస్కౌంట్‌ను అందిస్తామనే వివరాలను మాత్రమే వెల్లడించలేదు. త్వరలో ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్కు సంబంధించిన వివరాలు కూడా అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు.
Best Mobiles in India


