ఆ దేశంపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించిన డొనాల్డ్ ట్రంప్: రాత్రికి రాత్రి

Date:


International

oi-Chandrasekhar Rao

సిరియాలో
ఇస్లామిక్
స్టేట్
(ఐసిస్)
ఉగ్రవాదులపై
అమెరికా
మరోసారి
ప్రతీకార
దాడులు
ప్రారంభించింది.
వైమానిక
దాడులు
చేపట్టింది.
కిందటి
నెలలో
ఇద్దరు
అమెరికా
సైనికులు
హత్యకు
గురైన
నేపథ్యంలో
అమెరికా

చర్యలకు
దిగింది.
ఐసిస్
స్థావరాలపై
అమెరికా

వైమానిక
దాడులు
చేపట్టడం..
నెల
రోజుల
వ్యవధిలో
ఇది
రెండోసారి.
దాడుల
విషయాన్ని
అమెరికా
సెంట్రల్
కమాండ్
అధికారికంగా
వెల్లడించింది.

అమెరికా,
దాని
భాగస్వామ్య
బలగాలు
సంయుక్తంగా

భారీస్థాయి
దాడులను
నిర్వహించాయి.
ఈస్టర్న్
టైమ్
జోన్
ప్రకారం
శనివారం
మధ్యాహ్నం
12:30
గంటల
ప్రాంతంలో
సిరియాలోని
పలు
ఇస్లామిక్
స్టేట్
లక్ష్యాలను
ఛేదించినట్లు
యూఎస్
సెంట్రల్
కమాండ్
వెల్లడించింది.
అధ్యక్షుడు
డొనాల్డ్
ట్రంప్
ఆదేశించిన
విస్తృతస్థాయి
ప్రతీకార
చర్యల్లో
భాగంగానే

తాజా
దాడులు
సంభవించాయి.
దీనిపై
ఐసిస్
నుండి
ఇప్పటివరకు
ఎటువంటి
ప్రకటన
రాలేదు.

గత
నెలలో
పాల్మెరా
ప్రాంతంలో
ఇస్లామిక్
స్టేట్
తీవ్రవాదులు
జరిపిన
ఆకస్మిక
దాడిలో
ముగ్గురు
అమెరికన్లు
ప్రాణాలు
కోల్పోయారు.
మరణించినవారిలో
సార్జెంట్లు
ఎడ్గార్
బ్రియాన్
టోర్రెస్
టోవర్,
విలియం
నథానియల్
హోవార్డ్
అనే
ఇద్దరు
సైనికులు,
వారి
అసిస్టెంట్
అయాద్
మన్సూర్
సకత్
ఉన్నారు.
వీరంతా
ఐయోవా
నేషనల్
గార్డ్‌కు
చెందినవారు.
పాల్మెరా
దాడులకు
ప్రతిస్పందనగా
అమెరికా
సైన్యం
‘ఆపరేషన్
హాక్‌ఐ
స్ట్రైక్’ను
ప్రారంభించింది.


ఆపరేషన్
డిసెంబర్
19న
పెద్ద
ఎత్తున
జరిగిన
వైమానిక
దాడితో
మొదలైంది.

దాడిలో
మధ్య
సిరియాలోని
ఇస్లామిక్
స్టేట్‌కు
చెందిన
70
మౌలిక
సదుపాయాలు,
ఆయుధ
స్థావరాలను
లక్ష్యంగా
చేసుకొని
ధ్వంసం
చేశారు.

ప్రతీకార
దాడులపై
యూఎస్
సెంట్రల్
కమాండ్
శనివారం

ప్రకటన
విడుదల
చేసింది.
అత్యంత
శక్తిమంతులైన
తమదేశ
సైనికులకు
హాని
తలపెడితే..
ఎంతగా
తప్పించుకోవడానికి
ప్రయత్నించినా,
ప్రపంచంలో
ఎక్కడ
ఉన్నా
మిమ్మల్ని
వెతికి
పట్టుకొని
అంతం
చేస్తామని
స్పష్టం
చేసింది.

ఇదిలా
ఉండగా,
ఒక
రోజు
ముందు
సిరియా
అధికారులు
తమ
భద్రతా
బలగాలు
ఇస్లామిక్
స్టేట్
లెవంట్
కార్యకలాపాల
సైనిక
నాయకుడిని
అరెస్టు
చేసినట్లు
ప్రకటించాయి.
శనివారం
జరిగిన
దాడులను
అమెరికా
సైన్యం
భాగస్వామ్య
బలగాలతో
కలిసి
నిర్వహించినట్లు
తెలిపింది.

బలగాలు
ఎవరన్నది
మాత్రం
స్పష్టంగా
వెల్లడించలేదు.
సిరియాలో
ఐసిస్‌తో
పోరాటంలో
కుర్ద్
నేతృత్వంలోని
సిరియన్
డెమోక్రటిక్
ఫోర్సెస్
దీర్ఘకాలంగా
అమెరికాకు
ముఖ్య
భాగస్వామిగా
వ్యవహరించాయి.
సిరియా
ఇటీవలే
ఐసిస్
వ్యతిరేక
ప్రపంచ
కూటమిలో
సైతం
చేరింది.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Thames Water creditors offer £6.55bn in new debt to take formal control

Unlock the Editor’s Digest for freeRoula Khalaf, Editor of...

KPCC secretary, former CPI(M) councillor join BJP in Kerala

Thodiyoor Ramachandran, a Kerala Pradesh Congress Committee (KPCC) secretary...