Science Technology
oi-Lingareddy Gajjala
ఎలక్ట్రిక్
బైక్
అంటే
నెమ్మదిగా
వెళ్లే,
చిన్న
రేంజ్
వాహనం
అన్న
భావనను
పూర్తిగా
తలకిందులు
చేసింది
అల్ట్రావయొలెట్
ఆటోమోటివ్
సంస్థ.
ఏరోస్పేస్
స్థాయి
ఇంజినీరింగ్‌తో
హై
పర్‌ఫార్మెన్స్
ఎలక్ట్రిక్
బైక్స్
తయారు
చేస్తూ,
భారత
ఆటోమొబైల్
రంగాన్ని
షేక్
చేశారు
ఈ
సంస్థను
స్థాపించిన
ఇద్దరు
కుర్రాళ్లు.
విమానం
టెక్నాలజీతో
బైక్స్
తయారీ
అన్న
ఆలోచకు
ప్రాణం
పోసిన
నారాయణన్,
నిరజ్
రాజమణి
ఎవరు?,
వీళ్ల
బ్యాక్
గ్రౌండ్
ఏంటి?,
వీరు
తయారు
చేసిన
బైక్
మోడల్స్
ఎలా
ఉన్నాయి?.
వాటి
పనితీరు
ఇక్కడ
చూద్దాం.
భారత
రోడ్లపై
ఎలక్ట్రిక్
బైక్‌లను
సాధారణ
కమ్యూటర్
వాహనాల
స్థాయిని
బీట్
చేయాలి,
హై‑పర్‌ఫార్మెన్స్,
టెక్నాలజీ
ఆధారిత
ఎలక్ట్రిక్
బైక్స్
ను
ఏరోస్పేస్
స్థాయి
ఇంజినీరింగ్‌తో
డిజైన్
చేయాలనే
లక్ష్యంతో
అడుగులు
వేస్తుంది
అల్ట్రావయొలెట్
ఆటోమోటివ్
అనే
స్టార్టప్
కంపెనీ.
ఈ
కంపెనీ
ఆలోచనకు
టోటల్
ఆటోమొబైల్
రంగమై
షేక్
అయింది.
బెంగళూరు
బేస్
గా
వర్క్
చేస్తున్న
ఈ
సంస్థ
కొత్త
ఎలక్ట్రిక్
మోటార్
సైకిల్
సెగ్మెంట్
లో
ట్రెండ్‌ను
సృష్టిస్తూ
దేశీయ
ఆటోమోటివ్
మార్కెట్‌లోనూ
సంచలనం
సృష్టిస్తోంది.
ఈ
విప్లవానికి
వెనుక
ఉన్నవారు
సీఈవో
నారాయణన్,
సీటీవో
నిరజ్
రాజమణి.
లక్షల
కిలోమీటర్ల
రేంజ్..
నారాయణన్
వ్యక్తిగతంగా
ఈ
సంస్థను
కేవలం
ఒక
ఎలక్ట్రిక్
బైక్
కంపెనీగా
కాకుండా,
భవిష్యత్తు
మొబిలిటీ
టెక్నాలజీ
ఫార్మ్
గా
తీర్చిదిద్దే
లక్ష్యంతో
ప్రారంభించారు.
అతని
దృష్టిలో
ఎలక్ట్రిక్
వాహనం
అంటే
కేవలం
ఆయిల్
నుంచి
ఎలక్రిక్ట్
కు
అప్
డేట్
చేయడం
కాదు.
పవర్
ట్రైన్,
బ్యాటరీ
మేనేజ్‌మెంట్
సిస్టమ్,
మోటార్
కంట్రోల్,
సాఫ్ట్‌వేర్
డిజైన్
అన్ని
ఒకే
ఇంటిగ్రేటెడ్
సిస్టమ్యాటిక్
గా
పనిచేయాలి.
ఇక
నిరజ్
రాజమణి
టెక్నికల్
గా
వచ్చిన
ఆలోచనలను
ఆచరణలో
పెడుతుంటారు.
అల్ట్రావయొలెట్
బైక్‌లలో
వాడే
హై
ఎనర్జీ
డెన్సిటీ
లిథియం‑ఆయాన్
సెల్స్,
వాటిని
మానిటర్
చేసే
ఇంటెలిజెంట్
బ్యాటరీ
మేనేజ్‌మెంట్
సిస్టమ్,
హీట్
పెరగకుండా
చూసే
థర్మల్
మేనేజ్‌మెంట్
సిస్టమ్‌లు..
బైక్
పనితీరును,
బ్యాటరీ
జీవితాన్ని
అనూహ్య
స్థాయిలో
పెంచుతాయి.
నారాయణన్,
నిరజ్
ఆలోచనలతో
ఈ
కంపెనీ
లక్షల
కిలోమీటర్ల
వరకు
నిరంతర
బ్యాటరీ
లైఫ్
పై
విశ్వాసం
పెట్టుకుంది.
గ్లోబల్
మార్కెట్లోనూ
గుర్తింపు..
అల్ట్రావయొలెట్
ఫ్లాగ్‌షిప్
F77
మోడల్
దేశీయంగా
మాత్రమే
కాదు,
గ్లోబల్
మార్కెట్లోనూ
గుర్తింపు
తెచ్చుకుంది.
ఈ
బైక్‌లోని
హై‑టార్క్
ఎలక్ట్రిక్
మోటార్
వేగవంతమైన
యాక్సిలరేషన్,
హైవేలో
స్థిరమైన
పెర్ఫార్మెన్స్
మరియు
సిటీ
డ్రైవ్‌లో
స్మూత్
కంట్రోల్
అందిస్తుంది.
మోటార్
కంట్రోలర్
యూనిట్
(MCU)
పవర్
డెలివరీని
సెంటిమెంట్
లేకుండా
సమీకరించడం
వల్ల
డ్రైవర్‌కు
అత్యంత
సులభమైన,
సమర్థవంతమైన
రైడింగ్
అనుభవాన్ని
ఇస్తుంది.
F77
బైక్‌లు
సాఫ్ట్‌వేర్‑డిఫైన్డ్
ఎలక్ట్రిక్
వాహనాలుగా
రూపుదిద్దబడ్డాయి.
రైడ్
మోడ్‌లు,
రీజెనరేటివ్
బ్రేకింగ్,
ట్రాక్షన్
కంట్రోల్,
డైనమిక్
స్టెబిలిటీ
కంట్రోల్
వంటి
ఫీచర్లు
సెన్సర్లు
మరియు
సాఫ్ట్‌వేర్
ఇంటిగ్రేషన్
ద్వారా
చెల్లించబడ్డాయి.
డాష్‌బోర్డ్‌లోని
TFT
డిస్‌ప్లే
ద్వారా
బ్యాటరీ
హెల్త్,
రేంజ్
ప్రెడిక్షన్,
రియల్
టైమ్
రైడింగ్
డేటా,
నావిగేషన్,
రైడింగ్
స్టైల్
అనాలిసిస్
వంటి
సమాచారం
డ్రైవర్
చేతుల్లో
ఉంటుంది.
గ్లోబల్
ఇనోవేషన్
ఫ్రంట్‌లో
నారాయణన్,
నిరజ్
రాజమణి
భారత్
మార్కెట్
మాత్రమే
కాకుండా
యూరోప్
లోని
పలు
దేశాలలో
కూడా
F77
మోడళ్లు
విడుదల
చేసి,
గ్లోబల్
ప్రాముఖ్యతను
అందించారు.
కొత్త
మోడళ్లు,
కొత్త
సెగ్మెంట్లలో
బైక్‌లు,
స్కూటర్లను
ప్రవేశపెట్టడం
ద్వారా
సంస్థను
గ్లోబల్
ఇనోవేషన్
ఫ్రంట్‌లో
నిలిపే
ప్రణాళికలో
ఉన్నారు.
అల్ట్రావయొలెట్
కంపెనీ
తయారు
చేస్తుంది
కేవలం
ఎలక్ట్రిక్
మోటార్
సైకిల్
కాదు.
ఇది
భారత
ఇంజినీరింగ్,
సాఫ్ట్‌వేర్
ఇంటిగ్రేషన్,
హై
ఫార్ఫామెన్స్,
గ్లోబల్
గ్రోత్
లక్ష్యాలను
కలిపిన
వాహన
విప్లవం.
బ్యాటరీ
నుంచి
బిట్
వరకు,
ప్రతి
ఫీచర్
అత్యధిక
ప్రామాణికత,
భద్రతతో
పాటు
స్మార్ట్
టెక్నాలజీని
ప్రతిబింబిస్తుంది.
నారాయణన్‑నిరజ్
ఆధ్వర్యంలో,
అల్ట్రావయొలెట్
ఆటోమోటివ్
భారత
ఎలక్ట్రిక్
మోటార్‌సైకిల్
భవిష్యత్తును
మెల్లగా
బలంగా
మార్చబోతుంది.


