Business
oi-Jakki Mahesh
Stock
Market
Holidays:
స్టాక్
మార్కెట్
ట్రేడర్లు,
ఇన్వెస్టర్లకు
అలర్ట్.
ఈ
వారం
షేర్
మార్కెట్
వరుసగా
సెలవులను
జరుపుకోనుంది.శని,
ఆదివారాలతో
పాటు
జనవరి
15(గురువారం)న
కూడా
స్టాక్
మార్కెట్లు
పనిచేయవని
బాంబే
స్టాక్
ఎక్స్చేంజ్(బీఎస్ఈ),
నేషనల్
స్టాక్
ఎక్స్చేంజ్(ఎన్ఎస్ఈ)
అధికారికంగా
ప్రకటించాయి.
దీంతో
ఈ
వారంలో
ట్రేడింగ్
కేవలం
4
రోజులు
మాత్రమే
జరుగుతుంది.
సెలవుకు
కారణం
ఏమిటి?
జనవరి
15న
మహారాష్ట్రలో
మున్సిపల్
కార్పొరేషన్
ఎన్నికలు
జరగనున్నాయి.
ముఖ్యంగా
బృహన్
ముంబై
మున్సిపల్
కార్పొరేషన్
(BMC)తో
పాటు
మరో
29
మున్సిపల్
కార్పొరేషన్లకు
ఎన్నికలు
జరగనున్న
నేపథ్యంలో
రాష్ట్ర
ప్రభుత్వం
ఆ
రోజున
పబ్లిక్
హాలిడే
ప్రకటించింది.
స్టాక్
మార్కెట్
కార్యకలాపాలు
ప్రధానంగా
ముంబై
కేంద్రంగా
సాగుతాయి
కాబట్టి,
ఇన్వెస్టర్లు
ఓటు
వేసేందుకు
వీలుగా
ఎక్స్ఛేంజ్‌లు
ట్రేడింగ్‌ను
నిలిపివేశాయి.
ఈ
రోజున
ఈక్విటీ,
ఈక్విటీ
డెరివేటివ్స్,
కరెన్సీ
డెరివేటివ్స్
విభాగాల్లో
ఎటువంటి
లావాదేవీలు
జరగవు.
డెరివేటివ్స్
ఎక్స్‌పైరీ
డేలో
మార్పు
సాధారణంగా
ప్రతి
గురువారం
నిఫ్టీ,
బ్యాంక్
నిఫ్టీ
వంటి
ఈక్విటీ
డెరివేటివ్
కాంట్రాక్టుల
వీక్లీ
ఎక్స్‌పైరీ
జరుగుతుంది.
అయితే
జనవరి
15
గురువారం
సెలవు
కావడంతో
ఆ
రోజు
ముగియాల్సిన
కాంట్రాక్టుల
గడువును
ఒక
రోజు
ముందుకు
అంటే
జనవరి
14
(బుధవారం)
కు
మార్చారు.
ట్రేడర్లు
ఈ
విషయాన్ని
గమనించి
తమ
పొజిషన్లను
ఒక
రోజు
ముందుగానే
క్లోజ్
చేసుకోవడం
లేదా
రోల్
ఓవర్
చేసుకోవడం
వంటి
జాగ్రత్తలు
తీసుకోవాల్సి
ఉంటుంది.
సెటిల్‌మెంట్
హాలిడే,
కమోడిటీ
మార్కెట్
జనవరి
15ను
కేవలం
ట్రేడింగ్
సెలవుగానే
కాకుండా
‘సెటిల్‌మెంట్
హాలిడే’గా
కూడా
పరిగణిస్తున్నారు.
అంటే
ఆ
రోజున
బ్యాంకులకు
కూడా
సెలవు
ఉండటం
వల్ల
నగదు,
షేర్ల
బదిలీ
ప్రక్రియ
జరగదు.
ఇక
మల్టీ
కమోడిటీ
ఎక్స్ఛేంజ్
(MCX)
విషయానికి
వస్తే,
ఉదయం
సెషన్
(ఉదయం
9
నుండి
సాయంత్రం
5
వరకు)
సెలవు
ఉంటుంది,
కానీ
సాయంత్రం
సెషన్
మాత్రం
యథావిధిగా
సాయంత్రం
5
గంటల
నుండి
ప్రారంభమవుతుంది.
2026లో
మరిన్ని
మార్కెట్
సెలవులు
జనవరి
15
సెలవుతో
కలిపి,
2026
సంవత్సరంలో
వారాంతపు
సెలవులు
కాకుండా
మొత్తం
16
రోజులు
స్టాక్
మార్కెట్లకు
సెలవు
ఉండనుంది.
ఈ
నెలలోనే
జనవరి
26
(గణతంత్ర
దినోత్సవం)
నాడు
మార్కెట్లకు
మరో
సెలవు
ఉంది.
ఫిబ్రవరిలో
మహాశివరాత్రి
ఆదివారం
రావడంతో
అదనపు
సెలవు
లేదు.
మార్చిలో
హోలీ(మార్చి
3),
శ్రీరామనవమి(మార్చి
26),
మహావీర్
జయంతి(మార్చి
31)
సందర్భంగా
మూడు
సెలవులు
రానున్నాయి.
ఏప్రిల్
నెలలోలో
గుడ్
ఫ్రైడే
(ఏప్రిల్
3),
అంబేద్కర్
జయంతి
(ఏప్రిల్
14)న
సెలవులు
ఉన్నాయి.
మే
నెలలో
మహారాష్ట్ర
దినోత్సవం
(మే
1),
బక్రీద్
(మే
28)
సందర్భంగా
స్టాక్
మార్కెట్లకు
సెలవులు
ఉన్నాయి.ఈ
ఏడాది
ద్వితీయార్థంలో
మొహర్రం
(జూన్
26),
వినాయక
చవితి
(సెప్టెంబర్
14),
గాంధీ
జయంతి
(అక్టోబర్
2),
దసరా
(అక్టోబర్
20),
దీపావళి
(నవంబర్
10),
గురునానక్
జయంతి
(నవంబర్
24),
క్రిస్మస్
(డిసెంబర్
25)
సెలవులు
ఉన్నాయి.
ఇన్వెస్టర్లు
ఈ
సెలవుల
క్యాలెండర్‌ను
బట్టి
తమ
పెట్టుబడి
ప్రణాళికలను
సిద్ధం
చేసుకోవాలని
నిపుణులు
సూచిస్తున్నారు.


