Telangana
oi-Dr Veena Srinivas
తెలంగాణలో
అత్యంత
పేదరికంతో
పోరాడుతున్న
కుటుంబాలకు
అండగా
నిలవాలని
సంకల్పించిన
రేవంత్
రెడ్డి
ప్రభుత్వం
అందుకు
ఒక
బృహత్తర
ప్రణాళికను
రెడీ
చేసింది.
కేరళ
మోడల్
తరహాలో
అత్యంత
నిరుపేదల
నిర్మూలన
లక్ష్యంగా
పెట్టుకొని
ఒక
కొత్త
కార్యక్రమాన్ని
రూపొందిస్తుంది.
రాష్ట్రవ్యాప్తంగా
నిరుపేదలను
గుర్తించి
వారిని
సామాజికంగా,
ఆర్థికంగా
బలోపేతం
చేసేందుకు
ప్రయత్నం
చేయనుంది
.
ఈ
క్రమంలో
ఉన్నతాధికారులతో
కీలక
సమీక్షలను
నిర్వహించింది.
కేరళ
తరహాలో
నిరుపేదల
గుర్తింపుకు
సర్వే
తెలంగాణ
రాష్ట్ర
పంచాయతీరాజ్
గ్రామీణ
అభివృద్ధి
శాఖల
మంత్రి
సీతక్క
ఈ
సమీక్ష
సమావేశంలో
ఈ
కార్యక్రమం
విధివిధానాలపైన
చర్చించారు.
కేరళ
రాష్ట్రం
అనుసరించిన
64,006
నిరుపేద
కుటుంబాలకు
గుర్తింపు
ప్రక్రియను
ప్రాతిపదికగా
తీసుకొని
తెలంగాణ
రాష్ట్రంలో
కూడా
సర్వే
నిర్వహించాలని
భావిస్తోంది.
ఇందులో
భాగంగా
అత్యంత
నిరుపేదలను
గుర్తించే
బాధ్యతను
మహిళా
స్వయం
సహాయక
సంఘాలకు
అప్పగించి
ఇంటింటి
సర్వే
నిర్వహిస్తారు.
మహిళా
స్వయం
సహాయక
సంఘాల
ద్వారా
లబ్దిదారుల
ఎంపిక
గ్రామీణ
స్థాయిలో
విస్తృత
అవగాహన
కలిగిన
మహిళా
సంఘాల
ద్వారా
ఇంటింటి
సర్వే
నుండి
నిర్వహించి
అర్హులైన
లబ్ధిదారులను
పారదర్శకంగా
ఎంపిక
చేయాలని
మంత్రి
సీతక్క
ఆదేశించారు.
ఈ
సర్వేలో
భాగంగా
ఆయా
కుటుంబాల
ఆదాయం,
నివాస
గృహ
స్థితి
గతి,
ఆరోగ్యం,
పోషణ,
ఉపాధి,
విద్య
వంటి
అనేక
అంశాలను
ప్రాతిపదికగా
తీసుకుంటారు.
గ్రామసభల
ద్వారా
గ్రామస్తుల
సమక్షంలోనే
లబ్ధిదారులను
ఎంపిక
చేస్తారు.
వీరికి
ప్రత్యేక
గుర్తింపు
కార్డులు
ఎలాంటి
రాజకీయ
జోక్యానికి
తావు
లేకుండా
లబ్ధిదారుల
ఎంపిక
జరుగుతుంది.
ఎంపికైన
కుటుంబాలకు
ప్రత్యేక
గుర్తింపు
కార్డులతో
పాటు
గృహవసతి
లేనివారికి
ఇల్లు,
అనారోగ్యంతో
ఉన్న
వారికి
మెరుగైన
వైద్య
సేవలు
అందించేలా
మైక్రో
ప్లాన్లను
కూడా
రూపొందిస్తున్నారు.ఈ
విధంగా
కేరళ
మోడల్
లో
అత్యంత
నిరుపేదలను
గుర్తించి
వారి
పేదరిక
నిర్మూలన
కోసం
చేపడుతున్న
ఈ
కార్యక్రమం
త్వరలోనే
ప్రారంభం
కాబోతోందని
ప్రభుత్వం
శుభవార్త
చెప్పింది.
పేదరికం
నుండి
వారికి
విముక్తి
కడు
పేదరికంలో
ఇబ్బంది
పడుతున్న
వారికి
ప్రభుత్వం
బాసటగా
నిలవనుంది.
ఈ
కార్యక్రమం
ద్వారా
వారి
ప్రగతికి
ఏ
పథకాలు
అందించాలో
ఆయా
పథకాలను
ప్రత్యేక
శ్రద్ధతో
ప్రభుత్వం
వారికి
చేరేలా
చేయనుంది.
వారిని
పేదరికం
నుండి
బయటకు
తీసుకు
రావటమే
లక్ష్యంగా
పెట్టుకుంది.


